HomeLifestyleLife styleనక్సలైట్లపై నిషేధం విధించిన తొలి సీఎం నేదురుమల్లి..

నక్సలైట్లపై నిషేధం విధించిన తొలి సీఎం నేదురుమల్లి..

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

దేశ చరిత్రలో తొలిసారిగా నక్సలైట్ల పై నిషేధం విధించిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేదురు మల్లిదే. శాసన సభ్యులకు పలు సౌకర్యాలు కల్పించిన గొప్పతనం ఆయనదే. పార్టీలో అసంతృప్తిని దరి చేరనీయకుండా సమయోచిత చర్యలు తీసుకున్న విజ్ఞత, సామర్థ్యం కలిగిన నేతగా గుర్తింపు ఆయనకే దక్కింది. రాష్ట్ర రాజధాని లో హైటెక్ సిటీ (సైబర్ టవర్స్)కి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రిగా చిరకాలం గుర్తుండే కార్యక్రమం చేపట్టడం ఆయన హయాంలోనే. జాతీయ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన నేదురుమల్లి జనార్థన్ రెడ్డి రాజకీయాల్లో పలు కీలక పదవులు చేపట్టారు. ఐదు దశాబ్దాల రాజకీ య జీవితంలో, శాసన సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్య మంత్రిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. పార్టీ సంస్థాగత పదవులను కూడా చేపట్టారు. దేశ చరిత్రలో తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించిన ఘనత నేదురుమల్లిదే. 1992 మేలో నక్సల్స్‌పై నిషేధం విధిస్తూ ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తమ హిట్‌ లిస్టులో ఆయనను చేర్చిన నక్సలైట్లు 7,2007 సెప్టెంబర్ న, నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారును పేల్చివేసేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఆయన, సతీమణి రాజ్యలక్ష్మి కొద్ది లో ప్రాణాపాయం నుంచి బయట పడగా ముగ్గురు పార్టీ కార్యకర్తలు మరణించారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి 1935, ఫిబ్రవరి 20న శేషమ్మ, సుబ్బరామి రెడ్డి దంపతులకు శ్రీ పొట్టి శ్రీరాము లు నెల్లూరు జిల్లా వాకాడు గ్రామం లో జన్మించారు. నెల్లూరులో బి.ఏ., బి.ఎడ్. వరకు విద్యనభ్యసించారు. తర్వాత కొంతకాలం వాకాడు పాఠ శాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జనార్థనరెడ్డి ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగి, 1978లో రాష్ట్ర కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై శాసన మండలికి ఎన్నిక య్యారు. 1983 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య మంత్రు లు టంగుటూరి అంజయ్య , భవ నం వెంకట్రామ్, కోట్ల విజయ భాస్కర రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గాలలో మంత్రిగా పని చేశారు.1988లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో రెవెన్యూ మంత్రిగా చెన్నా రెడ్డి మంత్రివర్గంలో చేరారు. 1991లో హైదరాబాదులో జరిగిన మతకల్లోలాలకు నైతిక బాధ్యత వహిస్తూ మర్రి చెన్నారెడ్డి రాజీ నామా చేయగా ఆయన స్థానంలో కాంగ్రెస్ అధిష్టానం నేదురుమల్లి జనార్ధనరెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. 1992 లో రాజీనామా చేసే వరకు ఈ పదవిలో ఉన్నారు. రెడ్డి మూడుసార్లు లోక్‌ సభకు ఎన్నికయి, బాపట్ల (1998), నర్సరావు పేట (1999), విశాఖ పట్నం (2004) నియోజక వర్గాల నుండి లోక సభకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి 2004 శాసన సభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 2009, మార్చి 16న రాజ్యసభకు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికయ్యారు. 13వ లోక్‌సభలో అనేక పార్ల మెంటరీ కమిటీలలో సభ్యుడిగా పని చేశారు. పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీకి 1999 నుండి మూడేళ్ళ వరకు ప్రాతినిధ్యం వహించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక, పార్టీలో ముఠా రాజకీయాలకు కళ్ళెం వేసి, అసమ్మతిని అదుపు చేయటానికి అనేక చర్యలు చేపట్టా రు. శాసనసభా సభ్యుల మద్దతు పొందేందుకు, తమకు వారిని అను కూలంగా మలుచు కునేందుకు హైదరాబాదు లోని విలువైన ప్రదేశా లలో స్థలాలు, టెలిఫోను బిల్లుల ప్రత్యేక అలవెన్సులు, కార్ల కొను గోళ్లకు సులువైన ఋణాలు ఇప్పిం చారు. ప్రైవేటు యాజమాన్యంలోని 20 ఇంజనీరింగు, వైద్య కళాశాలల కు పర్మిట్లు ఇస్తూ, సీటుకు ఐదు లక్షల చొప్పున కాపిటేషన్ ఫీజు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. అనేక అనుమతులు మంజూరు చేయడానికి జనార్ధన రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తీర్పుగా ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం కళాశాలకు అనుమతులు మంజూరు చేయడం లో అనేక అవకతవకలు జరిగినట్టు నిర్ణయించి, అనుమతి జారీ చేస్తూ ప్రభుత్వం చేసిన ఉత్తర్వును రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయడం గమనార్హం.హైకోర్టు తీర్పు, ప్రతిపక్షాల ఆరోప ణలు, సొంత పార్టీలో అసమ్మతి వర్గాల నుండి తీవ్ర ఒత్తిడి నేపథ్యం లో జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్ప లేదు. ఆయన స్థానంలో కోట్ల విజయ భాస్కరరెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియ మించింది.నేదురుమల్లి ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు 1992 మేలో తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించ బడినం దుకు ఆయన నక్సలైట్ల హిట్‌లిస్టు లో ఉన్నారు. సెప్టెంబర్ 7 2007న రిమోట్ కంట్రోల్ ద్వారా మావోయి స్టులు నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కారు పేల్చివేయడానికి కుట్రపన్నగా జనార్థన్ రెడ్డి, ఆయన భార్య రాజ్యలక్ష్మి ప్రాణాపాయం నుండి తప్పించు కున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతి చెందారు. 2007 డిసెంబరులో తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం జనార్థన రెడ్డికి డాక్టరేట్ ప్రధానం చేసింది.జనార్ధన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ జీవితంలో…1978 నుంచి 84వరకు ఎమ్మెల్సీగా, 1978 నుంచి 83 వరకు రాష్ట్ర రెవెన్యూ, పరిశ్రమల శాఖ మంత్రిగా, 1978-83 మధ్య విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రి గా, 1989లో వెంకటగిరి ఎమ్మెల్యే గా, 1989 – 90లో వ్యవసాయ, అటవీ, ఉన్నత విద్యాశాఖ మంత్రి గా, 1990 నుంచి 92 వరకు ఆంధ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 1998-99 లో బాపట్ల నుండి ఎంపీగా, 1999లో నరసరావుపేట ఎంపీగా,2004లో విశాఖ ఎంపీగా, 2009లో రాజ్యసభ సభ్యునిగా వివిధ పద వులు నిర్వహించారు. కాలేయ వాధ్యితో బాధపడుతూ ఆయన 2014 మే 9న తుదిశ్వాస విడిచారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments