5.1 C
New York
Saturday, March 25, 2023
HomeLifestyleDevotionalనయనానందకరం సీతారామ కల్యాణం

నయనానందకరం సీతారామ కల్యాణం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ధర్మపురి పట్టణంలో అదివారం రామజన్మోత్సవ, రామ కల్యాణోత్సవ వేడుకలు వైభవో పేతంగా, కన్నుల పండువగా జరిగాయి. ధర్మపురి క్షేత్రంలో గోదావరి తీరాన వెలసిన శ్రీరామాలయంలో ఆదివారం ఉదయం శ్రీరామ జన్మో త్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య అర్చకులు తాడూరి బాలకిష్టయ్య శర్మ, బలరామ శర్మ, బాలచంద్రశర్మ, రఘునాథ శర్మ, వామనశర్మ, రామశర్మ, శరచ్చంద్ర శర్మ, ఆశ్రిత్ శర్మ, విలోక్ శర్మ, బాలకృష్ణ శర్మ, భరత్ శర్మల ఆధ్వర్యంలో విధివిధాన వేదోక్త సంప్ర దాయ పూజలొనరించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వస్తి పుణ్యాహవాచనం, వామదేవ శతానంద రుత్విగ్వ రణం, కళ్యాణార్థం వివాహ వేదిక ప్రవేశం, శ్రీరామచంద్ర వరునికై కన్యా న్వేషణ, సీతారామ వంశావళి ప్రవరలు, మధుపర్క ప్రాశనం, సముహూర్త, మంగళ సూత్రధారణం, అక్ష తారోపణం, వివాహానంతర లఘు పూజ, నైవేద్యం, మహామంత్ర పుష్పం, దేవతాశీర్వచనం తదితర ప్రత్యేక కార్య క్రమాలను నిర్వహించారు. సర్వాలం కార శోభితులై, పుష్ప మాలాలంకృతు లైన శ్రీరామచంద్రునికి, పరమపావని యైన లోకమాత సీతాదేవికి లోకకల్యా కల్యాణార్ధం అభిజిత్ లగ్న శుభ ముహూ ర్తంలో మధ్యాహ్నం మూల విరాట్టులకు జరిపించిన కల్యాణ మహోత్సవా నికి వేలాదిమంది భక్తులు హాజరై కన్నులారా గాంచి తరించారు. రామాలయంలో వేదవిదులు మధు శంకర శర్మ, కొరిడే విశ్వనాథ శర్మ, మధు రామ శర్మ, పాలెపు చంద్రమౌళి శర్మ తదితరులు కల్యాణోత్సవాన్ని జరిపించారు.

పట్టు వస్త్రాల సమర్పణ :

ధర్మపురి దేవస్థానం పక్షాన ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరముకూడ అందజేయటం జరిగింది. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ సంకటాల శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, పెండ్యాల హరికృష్ణ శర్మ , ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ అధ్యక్షులు ఇందారపు రామన్న, సభ్యులు అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్, చుక్కరవి, గుంపుల రమేష్, గునిశెట్టి రవీందర్, స్తంభంకాడి మహేష్, వీరవేణి కొమురయ్య, ఇనుగంటి రమ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ తిరుపతి పాల్గొన్నారు.

లక్ష్మీ నరసింహ కాలనీలో

ధర్మపురి పట్ట ణంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కాల నీలో నిర్మితమైన శ్రీరామాలయంలో ఆదివారం వేద పండితులు నారంభట్ల ప్రశాంత్, మధు నరేశ్ ఆధ్వ ర్యంలో ఉదయం నుండి వేదోక్త స్మార్త సంప్రదాయరీతిలో ప్రత్యేక పూజలు చేశారు.. కమిటీ అధ్యక్షుడు దివిటీ పరమేశ్వర్ పర్యవేక్షణలో శ్రీరామునికి, సీతాదేవికి లోకకల్యాణార్థం జరిపించిన కల్యాణ మహోత్సవానికి వేలాదిమంది భక్తులు హాజరై కన్నులారా చూసి తరించారు.

దేవస్థానంలో..

ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో సీతారామ, లక్ష్మీ నరసింహ స్వాముల కల్యాణ వేడు కలు ఆదివారం ఒకే వేదికపై ఒకే మహూర్తాన కన్నుల పండువగా జరి గాయి, మునుముందుగా దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ రామయ్య, సభ్యులు, ఉప ప్రధానార్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య,. ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, ముత్యాల శర్మ తదితరులు కల్యాణ మూర్తులను వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో, శేషప్ప కళా వేదికపైకి తీసుకొచ్చి, శోడశోపచార సహిత పూజలతో, సాంప్రదాయ బద్దంగా కల్యాణం జరిపించారు.

తిమ్మాపూర్ లో

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో రామ జన్మ, కళ్యాణ వేడుకలకలను బ్రహ్మోత్సవాలలో బాగంగా నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాసా చార్య, బొజ్జా రాజ గోపాల్ శర్మ, ముత్యాల శర్మ, అరుణ్, విజయ్, మోహన్ కళ్యాణం జరిపించారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కుటుంబ సభ్యులు, డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే జైనా, దొంతా పూర్, గండి హన్మాన్ ఆలయాల్లో సీతారామ కళ్యాణ వేడుకలు నిర్వహించారు

సాయి జన్మ దిన వేడుకలు :

ధర్మపురి క్షేత్రస్థ గోదావరీ నదీ తీరస్థ శ్రీసాయి బాలాజీ మందిరంలో ఆదివారం సాయిబాబా జన్మదిన వేడుకలు వైభ వంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక నిర్మాత ఒజ్జల ప్రవీణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో, ట్రస్టు అధ్యక్షుడు గోలి రాంప్రసాద్ నిర్వహణలో, అర్చకులు, స్థానిక వేద పండితులు ఆకర్ష్ శర్మ, అక్షయ్ శర్మలు, ప్రత్యేక పూజలు, జన్మదిన అర్చనలు నిర్వహించారు. మహా క్షీరాభిషేక కార్యక్రమంలో అశేష భక్తజనులు స్వహస్తాలతో, సాయినాథున్ని క్షీరాభిషిక్తుడిని చేసి తరించారు. ఈ సందర్భంగా నివేదనలు సమర్పించారు.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments