నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “జాతి రత్నాలు”.ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తుండగా, అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న జాతి రత్నాలు చిత్రం నుండి తాజాగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది.
ఈ టీజర్ చాలా ప్రామిసింగ్ ఉంది. థియేటర్స్ కు వెళ్లి ఈ చిత్రాన్ని చూసే సినీ అభిమానులు తిరిగి వచ్చేటప్పుడు పక్క నవ్వుతూ వస్తారనే విషయం టీజర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది.ఈ చిత్రంలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన చిట్టి నా బంగారు చిట్టి అనే సాంగ్ మార్కెట్ లో పెద్ద హిట్ గా నిలిచింది.