Saturday, November 26, 2022
HomeLifestyleLife styleప్రమాదాల నివారణపై అవగాహన అవసరం

ప్రమాదాల నివారణపై అవగాహన అవసరం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

జాతీయ భద్రతా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 4న నిర్వహించ బడుతుంది. హిందువులు, ముస్లిం లు, పార్సీలు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు వివిధ మతాల ప్రజలకు చెందిన ప్రజలతో భిన్న సంస్కృతు లు ఆచార వ్యవహారాలు, వివిధ రకాల వేడుకలు, ఉత్సవాలు జరుపుకునే పెద్ద లౌకిక దేశం మనది. చైనా తర్వాత రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం. భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ, దేశాన్ని ఒకటిగా నిలపడానికి అవాంఛిత సంఘటనల నుండి ప్రజలను రక్షించడానికి దేశ అన్ని రక్షణ దళాలు తమ కర్తవ్యంలో ఎల్లప్పుడూ ఉంటాయి. పోలీసులు, కమాండోలు, దేశంలో శాంతి భద్రతలను కాపాడు కోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న భద్రతా దళాల కృషిని అభినందించడానికి జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపు కుంటారు. మార్చి 4వ తేదీని జాతీయ భద్రతా దినోత్సవం లేదా రాష్ట్రీయ సురక్ష దివాస్‌గా జరుపు కుంటారు. ప్రతి వ్యక్తికి దేశం పట్ల వారి వ్యక్తిగత బాధ్యతల గుర్తు చేయడం ఈ దిన లక్ష్యం.
ముంబైలో కార్మికుల భద్రత గురించి చర్చ మొదలై, 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖా మంత్రుల సమా వేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాల మీద, ప్రమా దాల పట్ల అప్రమత్తత పెంచాలంటే చేయవలసిన ప్రచారంపైన, కార్మికు లలో భద్రతపట్ల అవగాహన పెంచ డం పైన నిర్వహణ కొరకు ప్రభుత్వ పరంగా ఒక సంస్థ అవసరమని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత 1965 డిసెంబర్ లో పారిశ్రామిక భద్రత గురించి తొలి సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పలు సంస్థలు పాల్గొన్న ఆ సభలో జాతీయ, రాష్ట్ర స్ఠాయిలో భద్రతా మండలి ప్రారంభించాలని నిర్ణయిం చారు. అలా 1966, మార్చి 4న జాతీయ భద్రతా మండలి ఏర్పడింది. సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 1860 క్రింద సొసైటీగా నమోదు చేయ బడింది. తరువాత బాంబే పబ్లిక్ ట్రస్ట్ చట్టం 1950 ప్రకారం పబ్లిక్ ట్రస్ట్ గా నమోదు చేయబడింది. కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆ మండలి ప్రారంభమయిన మార్చి 4నే ”జాతీయ భద్రతా దినోత్సవం”గా జరపాలని నిర్ణయించారు.
నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లాభా పేక్షలేని సంస్థ. ఇది ప్రమాదాలు, విపత్తుల నుండి ఉత్పన్నమయ్యే మానవ బాధలను, ఆర్థిక నష్టాలను నివారించడానికి, తగ్గించడానికి తగిన విధానాలు, పద్ధతులు, విధానాలను అవలంబించడానికి సమాజానికి తెలియ జేయడానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి స్థాపించ బడింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ భద్రత, ఆరోగ్యం, పర్యావరణ అంశాలను దేశం లోని వివిధ ప్రాంతాలకు చేరవేయడం, పారిశ్రామిక రంగానికి చెందిన వారినందరినీ ఇందులో భాగస్వా ములను చేయడం, భద్రత కల్పించ డంలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్రను గుర్తెరిగి అనుసరింప చేయడం లక్ష్యంగా కృషిచేస్తున్నది.

సాంప్రదాయకంగా జాతీయ భద్రతా మండలి పరిధిలో నేడు ఉగ్రవాదం నుండి భద్రత, ఆర్థిక భద్రత, శక్తి భద్రత, పర్యావరణ భద్రత, నేరాల ను తగ్గించడం, ఆహార భద్రత, సైబర్ – భద్రత మొదలైన ఇతర సైనిక రహిత ప్రమాణాలు ఉన్నా యి. జాతీయ భద్రతా ప్రమాదాల పరిధిలోకి ఇతర దేశ – రాష్ట్రాలు మాత్రమే కాకుండా హింసాత్మక కార్యక్రమాలు, మాదక ద్రవ్యాల కేసులు, బహుళ జాతి సంస్థల చర్యలు కూడా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలు కూడా జాతీయ భద్రతలోకి వస్తాయి.

ప్రతి పనిలోను ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అధిక ప్రమాదాలు అజాగ్రత్తవల్ల సంభవి స్తున్నవే. రహదారి ప్రమాదాలైనా, పారిశ్రామిక ప్రమాదాలైనా మానవ నిర్లక్ష్యం వల్ల జరగడం దురదృష్ట కరం. క్రమక్రమంగా ప్రమాదాల సంఖ్య పెరుగు తున్నందున పారి శ్రామిక , రహదారి భద్రతల మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ముందస్తు తగు జాగ్రత్తలు పాటించడం వల్ల కొంతై నా ప్రమాదాలను తగ్గించ వచ్చు. అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి ఎలా బయట పడాలో అవగాహన ఉండడంవల్ల మరణాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది.

అందుకే ఈ సందర్బంగా సమావేశా లు, శిక్షణా కార్యక్రమాలు, సెమినా ర్లు, ఉద్యోగులు, కార్మికులకు ప్రమా దాలు ఎలా జరిగే అవకాశాలు, అవి జరిగినప్పుడు ఎలా స్పందించాలనే అంశాలపై అవగాహన కల్పిస్తు న్నారు. ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ జీవన విధానంలో, వృత్తుల్లో భద్రత, ఆరోగ్య రక్షణను ఒక అంత ర్గత భాగంగా మలుచు కునేలా చేయడం వల్ల ప్రమాదాల ను ఎలా నివారించ వచ్చునో పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments