అలుపెరుగని పోరాట యోధుడు లోక్ సత్తా శ్రీనివాస్

Date:

నరెడ్ల శ్రీనివాస్ అంటే తెలియక పోవచ్చు కాని, లోక్ సత్తా శ్రీనివాస్ అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. చాలా మంది ఆయనను లోక్ సత్తా శ్రీనివాస్ అనే పిలిచేవారు. సామాజిక న్యాయం, ఉద్యమాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. ఉత్తర తెలంగాణలో గత ఆ నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన సామాజిక ఉద్యమా లతో ఆయన భాగస్వామ్యం లేని ఉద్యమమే లేదంటే అతిశయోక్తి కాదు. లోక్ సత్తా ఉద్యమ సంస్థతో గత పాతికేళ్లుగా ఆయనకు విడదీయరాని సంబంధం ఉంది. లోక్ సత్తా అంటే శ్రీనివాస్. శ్రీనివాస్ అంటే లోక్ సత్తా అని పేరెన్నిక గన్నారు.అవినీతి, అన్యాయాలు అక్రమాలపై నిరంతరమైన పోరాటాలు చేశారు. ఎన్నో విజయాలు సాధించారు. కరీంనగర్ లో ఉన్న అన్ని ఉద్యమ వేదికలు ఆయనవే. గత సామాజిక ఉద్యమా లతో ఆయనకు విడదీయరాని బంధం సంబంధం అనుబంధం ఉన్నాయి. ఆయన ప్రతి ఉద్యమం లో క్రియాశీలక పాత్ర పోషించారు. వాస్తవానికి ఉద్యమాలను నిర్మించా రంటే సమంజసంగా ఉంటుంది. ఉద్యమాల నిర్వహణలో అలుపెరగక, ఏనాడూ రాజీ పడక, మొక్కవోని ధైర్యంతో, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, అకుంఠిత కార్యదీక్ష తో, అంకిత భావంతో, అన్నింటినీ మించి చిత్తశుద్ధితో, ఉద్యమాలలో మమేకమైన పోరాట యోధుడు.1955లో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో నిరుపేద కుటుంబంలో నరెడ్ల శ్రీనివాస్‌ జన్మించిన శ్రీనివాస్…యూనియన్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ, బ్యాంకు మేనేజర్ గా ప్రమోషన్ మీద కొంత కాలంగా రాష్ట్రం విడిచి వెళ్ళిన సందర్భంలోనూ, ఏనాడూ ఉద్యమ కార్యాచరణను ఆయన వదిలి పెట్టలేదు. వినియోగదారుల మండలి తరపున వందలాది కేసులు వేసి హక్కులను పరిరక్షిం చేందుకు కృషి చేశారు. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించడం లో కృషి చేసిన వారిని సన్మానించి ప్రోత్సహించేవారు. పాలకుల తప్పులను, ప్రభుత్వ పాలసీల్లోని లోపాలను ఎత్తి చూపడంలో, ప్రజా సమస్యలతో పాటు, సామాన్య బాధితుల న్యాయం కోసం పోరాడ డంలో ఆయన వ్యక్తిత్వం అనన్య సామాన్యం. ఉమ్మడి రాష్ట్ర వినియోగదారుల మండలి అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అందరికీ అందు బాటులో ఉండేలా కిరాయి ఇల్లు వేదికగా, కరీంనగర్‌ వినియోగ దారుల మండలి నిర్వాహక బాధ్యునిగా, వేలాది కేసులను ఆయన పరిష్కరించారు. అన్యా యానికి గురైన వారు తమకు న్యాయం తప్పక జరుగుతుందని నమ్మకంతో, లోక్ సత్తా ఆఫీసును వెతుక్కుంటూ వచ్చేవారు. వారి సమస్య పరిష్కారం అయ్యే దాకా సలహాలు సూచనలు అందించ డమే కాక, వెంట ఉండి సహకరించే వారు. హుజురాబాదులో జన్మించిన 69ఏళ్ళ శ్రీనివాస్… విద్యార్థి జీవితం లోనే ప్రగతిశీల భావాలు కలిగి, ఆనాటి పోరాట, విప్లవ యోధుల సాహచర్యంతో ఎదిగారు.1970వ దశక ప్రారంభంలో మిత్రులతో కలిసి హుజురాబాద్ లో సాహితీ సంస్థ స్థాపనకు చొరవ చూపి, మహాకవి శ్రీశ్రీని ఆహ్వానించి, హుజురాబాద్ లో సమావేశాలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించారు. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో పీజీ పూర్తి చేసి, కరీంనగర్ యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగంలో చేరారు. ప్రగతి శీల, భావజాల పరిధిని విస్తృత పరుచుకుని, తనలాంటి భావాలున్న వారితో జత కట్టారు. ఒకనాడు జర్నలిస్టులకు వేదికగా, ఎందరో జర్నలిస్టులను తయారు చేసి, జర్నలిస్టుల తయారీ కర్మాగా రంగా విలసిల్లిన, విజయ కుమార్ సంపాదకత్వంలో వెలువ రించిన ‘జీవగడ్డ పత్రికలో వారం వారం ‘పెన్నుపోటు’ పేర కాలమిస్టు గా పని చేశారు. ఆకాలంలో జీవగడ్డలో పని చేసిన అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, ఆనాడు జిల్లాలో విధులు నిర్వర్తించిన సీనియర్ జర్నలిస్టు మిత్రులు దేవులపల్లి అమర్, దామెర్ల సాయిబాబా, ఎస్. కే.జకీర్ తదితరులతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. కరీంనగర్ వినియోగదారుల మండలి స్థాపించి వినియోగ దారుల పరిరక్షణ చట్టం కింద, రశీదో, బిల్లో, ఏ చిన్న ఆధారం తోనైనా సరే, ఫోరం కోర్టుల్లో వేలాది కేసులు వేస్తూ మోస పోయిన వినియోగ దారులకు లక్షలాది రూపాయల నష్ట పరిహారాలు వచ్చేలా కృషి చేశారు. అలాగే సమాచార హక్కు చట్టాన్ని మరొక ఆయుధంగా చేసుకుని సామాన్యు లకు అండగా నిలిచారు. ఈ చట్టం కింద భూ కబ్జాలు, గ్రానైట్ రాళ్ళ సంభకోణాల లాంటివి బహిర్గత పరిచి, ప్రభుత్వానికి కోట్ల రూపాయల లబ్దిని చేకూర్చారు. లోక్ సత్తా బాధ్యునిగా, జయప్రకాష్ నారాయణను కరీంనగర్ పలు మార్లు రప్పించి, చిత్తశుద్దితో పని చేశారు.సమాజంలోని అవినీతి అక్రమాలపై అలుపెరుగని, అవిశ్రాం త పోరాటం చేసి, ఆశయ సాధనకు కృషి చేసిన పోరాట యోధుడు, నరెడ్ల చివరికి కరోనా మహమ్మారి తోనూ పోరాటం చేసి, ఓటమి పాలై, పోరాట యోధుని గానే తనువు చాలించారు. ఆయన పోరాటం ఎందరికో స్ఫూర్తి దాయకం అయిందనేది వాస్తవం.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...