ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా శని వారం సాయంత్రం శ్రీ ఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం క్షేత్ర సనాతన సాంప్రదాయ పద్దతిలో ఉగ్రనారసింహ స్వామి ప్రధానాలయం నుండి వేదమంత్రోచ్ఛా టనల, మంగళవాద్యాలతో, భక్తజనం తోడు రాగా స్వామి ఉత్సవ మూర్తులను జయజయ ధ్వనాలతో ఊరేగించి, బ్రహ్మ పుష్కరిణి లోనికి కోనేరు ఉత్తర ద్వారం గుండా వేంచేపు చేయగా, అప్పటికే కోనేటిలో సోపానాలపై ఆసీనులై వేచియున్న భక్తజనం తమ ఇష్ట దైవాన్ని ఘనంగా స్వాగతించారు. అజ్ఞాత భక్తునిచే ప్రత్యేక నూతన నిర్మిత, బహూకృత హంస రూపు బల్లకట్టుపై స్వామిని ఆసీనులజేసి కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించారు. బ్రహ్మపుష్కరిణి సోపానాలపై నున్న భక్త జన సమూహం ప్రదక్షిణలను మెట్లపై నుండి అనుసరించారు. బుక్కా, గులాలు ఇత్యాది పూజా ద్రవ్యాలు ఉత్సవ మూర్తులపై చల్లి భక్తి శ్రద్దలతో కైమోడ్పులిడి ప్రార్ధించారు. అనంతరం కోనేరు మధ్య భాగానగల వేదికపైనున్న భోగ మటపంలోని ఊయలలో స్వామిని అసీనుల గావించి డోలోత్సవం విర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు ఇరుకైన మార్గం గుండా ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి డోలు ఊగుచుండగా దర్శించిన భక్తులకు వేద పండితులు చతుర్వేద మంత్ర పఠనాలతో ఆశీస్సులు అంద చేశారు. జయజయ ధ్వానాలు మిన్నంటగా,
పూజా ద్రవ్యాలను చల్లి భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలిచారు. అర్చకులు శ్రీనివాసాచార్య, సంతోష్, అరుణ్ లచే భక్తులు తులసీ కంకణాలను కట్టించు కున్నారు. ఆధ్యాత్మిక ప్రాసంగికులు వొజ్జల నరహరి శర్మ పౌరాణిక ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు. ప్రముఖ గాయకులు జగదీశ్ శర్మ నరసింహ శతక పద్యాలు వినిపించారు. దేవ స్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, అభివృద్ది కమిటీ అధ్యక్షుడు రామయ్య, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాట్లు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, ఎస్ ఐ కిరణ్ నేతృత్వంలో జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పోలీసు బృందాలు, హోంగార్డులు, ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను గమ్యాలకు చేర్చారు. ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ ఇందారపు రామయ్య, కమిషనర్ రమేశ్, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
ఉగ్ర నారసింహునికి
భక్తజన నీరాజనం
ధర్మపురి క్షేత్రంలో సనాతన సంప్రదాయరీతిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంత ర్భాగంగా శనివారం జరిగిన శ్రీ ఉగ్రనార సింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలలో భాగస్వాము లయ్యేందుకు అశేష భక్త జనం క్షేత్రానికి తరలి వచ్చారు. ఉదయా తూర్వం దేవాలయాలను తెర వగా, సంప్రోక్షణం అనంతరం దేవస్థానం వంశపారం పర్య యాజ్ఞికులు కందాళై పురుషోత్తమాచార్య, వేద పండితులు రమేశ శర్మ మార్గ దర్శకత్వంలో అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, నేరేళ్ళ శ్రీనివాసా
|చార్య, హరినాథాచార్య, రమణాచార్య, మూర్తి, కిరణ్, విజయ్, అరుణ్, అలంకృత లక్ష్మీ సమేత ఉగ్ర నారసింహుడు సంతోష్ తదితరులు ఆలయాలలో, దేవస్థానం ఏసీ, ఈఓ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య అర్చనలు, నిత్య కల్యాణంతో పాటు పురుషసూక్త, శ్రీసూక్త, భూసూక్త, నృసూక్త, లక్ష్మీసూక్త, విష్ణుసూక్త, మన్యుసూక్త, సుదర్శన, విశ్వక్సేన, తిరుకళ్యాణ మహోత్సవ వ్యాహ్య కర్మణి ఆవాహిత సర్వ దేవతాహ్వానం, గరుడ, ఆళ్వారుల హవనం, లోక కళ్యాణార్ధం వ్యాహృతి హోమాది ప్రత్యేక క్రతువులను నిర్వహించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు, యాత్రికులు పరమ పవిత్ర గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, సుప్రభాత దర్శనానికి వివిధ ఆలయాల ముందు బారులు తీరి నిలుచున్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు కోడెమొక్కులు, వల్లుబండ, గండాదీపాది మొక్కులు తీర్చుకున్నారు. సహస్ర స్వర్ణ కమలార్చనలో పాల్గొన్నారు. సంతానార్ధం హోమగుండం వద్ద ప్రత్యేక పూజలు చేయించుకుని భగవదాశీస్సులనొందారు. ప్రధానంగా ఉగ్ర నారసింహా లయంలో చాలామంది భక్తులకు పూనకం రావడం, తమ భవిష్య త్తును, మంచిచెడులను భక్తులు అడిగి తెలుసుకోవడం కనిపించింది. కాగా శ్రీయోగానంద |
నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా ఆలయానికి గణనీయ ఆదాయం సమకూరింది. టికెట్ల ద్వారా, ప్రసాదాల విక్రయాల ద్వారా, అన్నదానం ద్వారా అదనపు ఆదాయం లభించినట్టు ఏసీ, ఈఓ శ్రీనివాస్ వివరించారు. ఉగ్ర నార సింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా ఉదయా త్వూర్వం నుండి గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు.
వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES