Wednesday, June 29, 2022
HomeLifestylespecial Editionనటుడు నరహరి శర్మకు అభినందనల వెల్లువ

నటుడు నరహరి శర్మకు అభినందనల వెల్లువ

ధర్మపురి క్షేత్రానికి చెందిన ప్రఖ్యాత రంగస్థల నటులు కొరిడే నరహరి శర్మ(Narahari Sharma) నాటక రంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా సన్మానితులు కావడం పట్ల పలువురు ఆయనను అభినందించారు. సంగీత రత్న బిరుదాంకితులు శాస్త్రీయ సంగీత విద్వాంసులు, తెలంగాణలోనే మొదటిదిగా గుర్తింపు పొందిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి ప్రధాన కార్యదర్శి, దశాబ్దాలుగా నాటక రంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా, రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన తెలంగాణ యువ నాటకోత్సవం-6 లో నరహరి శర్మ ను స్ఫూర్తి పురస్కారం తో సన్మానం గావించ బడ్డారు. సంగీత, నాటక రంగాలకు చేసిన విశిష్ట సేవలకు గాను ఆయన సన్మాన గ్రహీతలు అయినారు. 72ఏళ్ల నరహరి శర్మ 1967 నుండి పౌరాణిక చారిత్రిక సాంఘిక నాటకాలలో నాయక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ కృష్ణ రాయబారం కృష్ణునిగా, కృష్ణార్జున యుద్ధంలో పాండవ మధ్యముడుగా దక్షయజ్ఞంలో కైలాస నాధునిగా, సతీ సావిత్రి లో సత్యవంతుడుగా, చాణక్య చంద్రగుప్త లో చంద్రగుప్తునిగా, నాగమ నాయకునిలో టైటిల్ పాత్రలో, అలాగే నారదుడిగా, వీర పాండ్య కట్ట బ్రహ్మన చారిత్రక నాటకంలో ఆంగ్లేయులకు తలవంచని, ఆత్మార్పణం కు సిద్ధమైన దేశభక్తి ప్రపూర్ణుడైన బొమ్మనగా, హైదరాబాద్ రవీంద్ర భారతి, వరంగల్ నేరెళ్ళ వేణుమాధవ్ ఆడిటోరియం, కరీంనగర్ కళాభారతి, సూర్యాపేట లతోపాటు తెలంగాణలోని చోట్ల, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి వారిచే ప్రదర్శితా లైన అనేక నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. నరహరి శర్మ (Narahari Sharma)నటనా కౌశలానికి ఫిదా అయి ఆయనను అభినందించిన వారిలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి, ప్రస్తుత రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కంభంపాటి సుబ్రహ్మణ్యశర్మ, భన్వర్ లాల్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్, సి.బి. ఎస్. వేంకట రమణ తదితరులచే ప్రశంసలు అందుకున్నారు. ప్రసుతం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్త నిర్వహణలో తెలంగాణ యువ నాటకోత్సవంలో భాగంగా రవీంద్ర భారతిలో శుక్రవారం రాత్రి జరిగిన కార్య క్రమంలో సన్నానితులు కావడం పట్ల నాట్య మండలి సభ్యులు, కళాకారులు, కళాభిమానులు, పలువురు అభినందించారు.

రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments