5.1 C
New York
Sunday, April 2, 2023
HomeEntertainmentMovie Updatesనాని, శివ నిర్వాణ‌, షైన్ స్క్రీన్స్ 'ట‌క్ జ‌గ‌దీష్' టీజ‌ర్ విడుద‌ల‌.. ఏప్రిల్ 23న సినిమా...

నాని, శివ నిర్వాణ‌, షైన్ స్క్రీన్స్ ‘ట‌క్ జ‌గ‌దీష్’ టీజ‌ర్ విడుద‌ల‌.. ఏప్రిల్ 23న సినిమా విడుద‌ల‌

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుద‌ల కానున్న‌ది. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన టీజ‌ర్‌లో వెల్ల‌డించారు.

ఫిబ్ర‌వ‌రి 24 నాని బ‌ర్త్‌డే. దానికి ఒక‌రోజు ముందుగానే నాని అభిమానుల‌కు సంబ‌రాన్ని చేకూర్చేలా ‘ట‌క్ జ‌గ‌దీష్’ టీజ‌ర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

1 నిమిషం 36 సెక‌న్ల నిడివి ఉన్న ఈ టీజ‌ర్‌లో త‌న ఫ్యామిలీ అంటే విప‌రీత‌మైన ప్రేమాభిమానాలు చూపించే యువ‌కుడిగానే కాకుండా రెస్పాన్సిబుల్ ప‌ర్స‌న్‌గానూ ద‌ర్శ‌న‌మిచ్చాడు. “ఏటికొక్క పూటా.. యానాది పాటా” అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్ వినిపిస్తుండ‌గా చిత్రంలోని ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో విల‌క్ష‌ణంగా ఈ టీజ‌ర్‌ను క‌ట్ చేశారు. ట‌క్ జ‌గ‌దీష్ క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో ఆ పాట మ‌న‌కు చెబుతోంది. నాజ‌ర్ తండ్రిగానూ, జ‌గ‌ప‌తిబాబు, నాని ఆయ‌న కొడుకులుగానూ ఈ టీజ‌ర్ మ‌న‌కు చూపించింది.

హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్న‌ప్పుడు పాట‌లో “చుట్టుముట్టుకుంటాడే చుట్ట‌మ‌ల్లే కాపేసి” అనే లైన్ రావ‌డం జ‌గ‌దీష్ ఎంత మంచోడో కూడా మ‌న‌కు తెలుస్తుంది. అలాంటి మంచివాడి జీవితంలోకి డేనియ‌ల్ బాలాజీ అనే విల‌న్ వ‌చ్చి ఇబ్బందులు వ‌స్తే.. ఊరుకుంటాడా? జ‌గ‌దీష్ మంచివాడే కాదు.. రౌడీల భ‌ర‌తం ప‌ట్టే ధీరుడు కూడా. చెడు చేయ‌డానికి వ‌చ్చిన‌వాళ్ల‌ను చిత‌క్కొడుతూ మ‌న‌కు క‌నిపించాడు జ‌గ‌దీష్‌. టీజ‌ర్ చివ‌ర‌లో కాళ్ల‌కు పారాణి వేసుకొని, లుంగీ పైకి ఎగ‌క‌ట్టి వ‌స్తున్న తీరుచూస్తే, పెళ్లికొడుకు అయిన‌ప్పుడు కూడా ఏదో స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డానికి వెళ్తున్న‌ట్లుగా అనిపిస్తోంది. టైటిల్ రోల్‌లో నాని సూప‌ర్బ్ అనిపిస్తున్నారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఆయ‌న కోస‌మే ‘ట‌క్ జ‌గ‌దీష్’ క్యారెక్ట‌ర్ పుట్టింద‌నిపిస్తోంది.

త‌మ‌న్ సంగీతం, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ ఈ టీజ‌ర్‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించేట్లు చేశాయి. డైరెక్ట‌ర్ శివ నిర్వాణ మ‌రో సూప‌ర్ హిట్ మూవీతో మ‌న‌ముందుకు వ‌స్తున్నార‌నే గ‌ట్టి న‌మ్మ‌కాన్ని ఈ టీజ‌ర్ ఇస్తోంది. థీమ్ సాంగ్స్‌లో తన‌నెందుకు బెస్ట్ అంటారో త‌మ‌న్ మ‌రోసారి ఈ టీజ‌ర్‌లో వినిపించిన సాంగ్‌తో నిరూపించారు. సాహి సురేష్ ఆర్ట్ వ‌ర్క్ కూడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ స‌మ‌కూర్చిన ఫైట్స్ ఈ సినిమాలోని మ‌రో ఆక‌ర్ష‌ణ‌.

తారాగ‌ణం:
నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌,  నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌,  డానియ‌ల్ బాలాజీ,  తిరువీర్, రోహిణి,  దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్.

Nani, Shiva Nirvana, Shine Screens Tuck Jagadish Teaser Released, Film Releasing On April 23rd

Tuck Jagadish starring Natural Star Nani is one of the most awaited films in 2021. The successful combination of Nani and Shiva Nirvana after Ninnu Kori is back with the film which is billed to be a wholesome family entertainer with adequate commercial elements.

It’s Nani’s birthday tomorrow. However, celebrations begin a day in advance for Nani’s fans as the film’s teaser is out now. Shiva Nirvana presents Nani in a wonderful role as a family man who is very responsible towards his father, mother, brother, and sisters. Giving romantic touch, the teaser shows charming romance of Nani-Ritu Varma. And giving completeness, the teaser also has an action block.

After watching the teaser one gets a feeling that every family needs a responsible man like Jagadish and S Thaman proves time and again that he is best in scoring theme songs. Though the teaser didn’t have any dialogues, Thaman spellbinds with his music.

Nani steals the show with his admirable acting prowess and Shiva Nirvana came up with another winning subject. Prasad Murella’s cinematography is another positive aspect.

Tuck Jagadish will hit the screens on April 23rd.

Ritu Varma and Aishwarya Rajesh are playing female lead roles in the movie.

The 26th film of Nani is produced jointly by Sahu Garapati and Harish Peddi under Shine Screens Banner.

Cast: Nani, Ritu Varma, Aishwarya Rajesh, Nasser, jagapathi babu, Rao ramesh, Naresh, Daniel Balaji, Tiruveer, Rohini, Devadarsini, Praveen and others.

Crew:
Written& Directed by: Shiva Nirvana
Producers: Sahu Garapati and Harish Peddi
Music Director: S Thaman
Cinematography: Prasad Murella
Editor: Prawin Pudi
Art: Sahi Suresh
Fights: Venkat
Executive Producer: S.Venkatarathnam (Venkat)
Co-Director: Laxman Musuluri
PRO: Vamshi-Shekar
Publicity Designer: Siva Kiran (Working Title)
Costume Designer: Neeraja Kona

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments