నంబూద్రిపాద్ భారతీయ కమ్యూ నిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన రాజకీయవేత్త, సిద్ధాంతకర్త. దేశ చరిత్ర లో గుర్తింపు పొందిన గొప్ప కమ్యూనిస్టు నాయకులు. భారత దేశంలో కాంగ్రెసేతర సంబంధిత కమ్యునిస్టు పార్టీ పక్షాన ఎన్నికైన తొలి ముఖ్యమంత్రిగా వినుతి కెక్కారు. మార్క్స్ వాద సూత్ర బద్ధు డు, విప్లవవాది, రచయిత, చరిత్ర కారుడు. మార్క్స్ వాద కమ్యూని స్టు పార్టీ ఆచరణ వాదిగా, క్రియా శీలక నేతగా, 14 యేళ్ళ పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన తీసుకున్న చొరవ, ముందు చూపు గల నిర్ణయాలవలనే దేశంలో ఈనాడు జాతీయ స్థాయి సంకీర్ణ ప్రభుత్వ రాజకీయాలకు భూమిక అయిందన్న మాట వాస్తవం. నంబూద్రిపాద్ కేరళలో శ్రీకారం చుట్టిన మౌలికమైన భూ సంస్కరణలు, విద్యా సంస్కరణ లను అనుకరించే ప్రయత్నాలు ఈ నాటికి ఇతర భారతీయ రాష్ట్రా లలో జరుగుతూనే ఉన్నాయి. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం కలిగి ఉన్నా, భూస్వామి కుటుంబంలో పుట్టినా శ్రామిక వర్గ లక్ష్యాలకు అంకితమై శ్రామిక విప్లవ ఉద్యమంలో అగ్ర నాయకుడిగా ఎదిగారు.
ఇఎంఎస్ నంబూద్రిపాద్ బహు ముఖ ప్రజ్ఞాశాలి, మార్బిస్టు రుషి, నిరంతర క్రియాశీలి. అవిశ్రాంత కలం యోధులు. సాహితీ విమర్శ కులు. సాంస్కృతిక సైనికుడు. పాలనా చతురులు. సిద్ధాంత, ఆచరణల సంగమం. విప్లవ మేధావి. భావితరాలకు చెరగని ఆదర్శం. ఒకనాటి భారత రాష్ట్ర పతి కెఆర్ నారాయణన్ అభివర్ణించి నట్లుగా 20వ శతాబ్దపు మహోన్నత వ్యక్తి.
ఇ.ఎం.ఎస్. అనే పేరుతో ప్రసిద్ధి కెక్కిన ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్, (1909 జూన్ 13 – 1998 మార్చి 19) 1909 జూన్ 13 నాడు, ప్రస్తుత మలప్పురం జిల్లా పెరింతాళ్ మన్న తాలూకా ఏలాంకుళం గ్రామంలోని అగ్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మిం చారు. తండ్రి పేరు పరమేశ్వరన్ నంబూద్రిపాద్. విద్యార్థి దశనుంచే శాస్త్రీయ భావాలు అలవరుచు కున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు.
చిన్న వయసులోనే ఆయన వి.టి.భట్టాద్రిపాద్ మొదలయిన పెద్దవారికి చేయూతగా, కేరళ నంబూద్రి కుటుంబాలలో పాతుకు పోయిన కులవివక్ష, సాంప్రదాయ వాదం ధోరణులకు వ్యతిరేకంగా పోరాడారు. చదువుకునే రోజుల్లో భారత జాతీయ కాంగ్రెస్ సహ చర్యంతో స్వాతం త్ర్య సంగ్రామంలో తీవ్ర కృషి చేసారు.
1931 లో కాలేజీని వదిలి స్వాతం త్ర్య పోరాటంలో చేరారు. సత్యా గ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. అప్పటినుంచి ఆయన దేశ స్వాతంత్య్రం కోసం సాగిన కాంగ్రెస్ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. కేరళలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ స్థాపకుల్లో ఒకరుగా వున్నారు. 1934 లో ఆయన కాంగ్రెస్ పార్టీ సోషలిస్టు పార్టీ అఖిల భారత ఉమ్మడి కాలంలో కాంగ్రెస్ పార్టీకి, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మార్క్సిజంతో పరిచయం చేశారు. 1936 లో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక బృందాన్ని ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల్లో ఆయన ఒకరు. నంబూద్రిపాద్ కేరళలో ఒక శక్తివంతమైన కమ్యూనిస్ట్ ఉద్య మం అభివృద్ధికి పునాదులు వేశా రు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం. రెండు పోరాటాలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. కేరళను ఏకీకృత భాషా రాష్ట్రంగా ఏర్పర్చడానికి దారితీసిన ఐక్య కేరళ ముఖ్య ప్రతిపాదకులలో ఆయన ఒకరు.
నంబూద్రిపాద్ మొట్టమొదట 1939 లో మద్రాసు ప్రొవిన్షియల్ శాసనసభకు ఎన్నికయ్యారు. కమ్యునిస్ట్ పార్టీని విస్తృత పరచడానికి ఆయన తన వాటగా వచ్చిన ఆస్తిని పార్టీకి విరాళంగా ఇచ్చాడు. అతను 1939-42 మరియు 1948-50 మధ్య అజ్ఞాతం లోకి వెళ్ళారు. ఆయన 1941 లో భారత కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యారు. డిసెంబరు, 1950 లో సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెక్రటేరియట్ సభ్యునిగా పనిచేశారు.
1957 లో కేరళ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మొదటి ఎన్నిక లలో కమ్యూనిస్ట్ పార్టీ మెజారిటీ సాధించడంతో 1957 ఏప్రిల్ 5 నాడు కేరళ రాష్ట్ర ప్రథమ ముఖ్య మంత్రిగా పగ్గాలు చేపట్టి భారత దేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. త్వరలోనే భూ సంస్కరణల చట్టాన్ని,విద్యా చట్టాన్ని తీసుకు వచ్చారు. వివాదాస్పదమైన పరిస్థి తుల్లో 1959 లో కేంద్ర ప్రభుత్వం, భారత రాజ్యాంగం లోని 356 వ ప్రకరణం అనుసరించి రాష్ట్రపతి పాలన విధిస్తూ ఆ ప్రభుత్వాన్ని కూల్చి వేసింది. కేరళ శాసన సభకు 1960-64, తిరిగి 1970-77 కాలం లో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహ రించారు.1967 లో రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి నంబూ ద్రిపాద్ ముస్లిమ్ లీగ్ తో సహా 7 పార్టీల మద్దతు స్వీకరించారు.
1964 లో సిపిఐ (ఎం) ను స్థాపించిన తరువాత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి అందులో చేరారు. 1964 లో జరిగిన అఖిల భారత మహాసభలో పార్టీలో కేంద్ర కమిటీ మరియు పార్టీ పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. ఆయన మరణం వరకు ఈ పదవిలో కొనసాగారు.
1977 లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శిగా పదవిని చేబట్టి 1992 వరకు ఆ బాధ్యతలను నిర్వహిం చారు. అన్ని వామపక్ష, ప్రజాస్వా మ్య, లౌకిక శక్తులను సమీకరిం చడంలో ఆయన నాయకత్వం అమూల్యమైనది.
ఒక తెలివైన మార్క్సిస్ట్ సిద్ధాంత కర్తగా, భారతీయ సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజం – లెనినిజం అన్వయించడంతో పాటు భారతీ య విప్లవం యొక్క వ్యూహానికి అనుగుణంగా సాగించాల్సిన, సాగించిన కృషిని ఆయన రచించారు. ఆయన వ్రాసిన పలు గ్రంథాలలో కేరళ చరిత్ర అనే పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది.
భూమి సంబంధాలు, కేరళ, సమా జం, రాజకీయాలు, మార్క్సిస్టు తత్వశాస్త్రం, సాహిత్యం మరియు చరిత్రలపై ఆయన వ్రాసిన రచనల తో ఆయన్ను దేశంలోనే గాక ప్రపంచంలోనే అత్యంత ప్రభావ వంతమైన కమ్యూనిస్టు ఆలోచనా పరులలో ఒకరిగా గుర్తించ బడ్డాయి. విశిష్ట మార్క్సిస్ట్ సూత్రవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఆయన ముందు చూపుకు నిజాయితీ నిబద్ధతలకు కేరళ సాధించిన అభివృద్ధే తార్కాణం. ప్రజల యోజన ద్వారా కేరళలో అధికార, వనరుల వికేంద్రీకరణకు, అక్షరాస్యతా ఉద్యమానికి కృషి చేసారు. ఆంగ్ల, మలయాళ భాషల్లో అనేక పుస్తకాలు రచించిన నంబూద్రిపాద్ పత్రికా విలేఖరిగా కూడా సుపరి చితుడే. ఈ నాటికీ కేరళలో ఆయన పేరు, ఒకప్పటి ఈయన ప్రభుత్వ పనితీరుల గుఱించి దినదినం గొప్పగా చెప్పుకుంటూనే ఉంటారు.
నంబూద్రిపాద్ 1998 మార్చి 19 న మరణించారు.
కాకలు తీరిన కమ్యునిస్టు యోధుడు నంబూద్రిపాద్
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES