నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ మౌళి. ఈ చిత్రంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్నారు. ఇందులో పూర్తిగా కొత్తగా మారిపోయారు నవదీప్. ఈ సినిమాతో నవదీప్ 2.0 గా కనిపించనున్నారు. జనవరి 26న ఆయన పుట్టిన రోజు సందర్భంగా లవ్ మౌళి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా అవనీంద్ర చూసుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
నవదీప్ పుట్టిన రోజు సందర్భంగా నైరా క్రియేషన్స్ ‘లవ్ మౌళి’ ఫస్ట్ లుక్ విడుదల, అనూహ్య స్పందన
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES