క్లీన్ డైరెక్టర్ గా పేరున్న శేఖర్ కమ్ముల ఫిదా చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నారు.ఆతర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈయన త్వరలో ప్రేక్షకుల ముందుకు లవ్ స్టోరీ చిత్రంతో రానున్నారు.ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన సాంగ్ మరియు టీజర్ లు పెద్ద హిట్ గా నిలిచాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ను విడుదల చేసింది.ఇంతకీ ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రేమకధ అంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ వాలెంటైన్స్ డేకి సరిగ్గా 10:08am కు ” నీ చిత్రం చూసి ” అనే సరికొత్త పాటను ప్రేమికుల కోసం ఆదిత్య మ్యూజిక్ లో తీసుకురానున్నది.మొదటి పాటతో అందరినీ మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ పవన్ తన రెండో పాటతో ఏ మేర ఆకట్టుకుంటారో చూడాల్సివుంది.ఈ చిత్రంలో నాగ్ చైతన్య తెలంగాణ యాస తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16, 2021 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.