ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ బ్యానర్స్ లో ఒకటిగా కొనసాగుతున్న మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తెలుగులో భారీ ప్రాజెక్ట్స్ ను సిద్ధం చేస్తుంది.ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు,పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ చిత్రాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.
అలా వైరల్ అవుతున్న లిస్ట్ లో కొన్ని చిత్రాలను మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.మిగిలినవి డిస్కషన్ లో ఉన్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ లిస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
ఇన్ని భారీ బడ్జెట్ చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న విషయం కానీ నిజమైతే టాలీవుడ్ లో మరో నాలుగేళ్ల పాటు వారి హవా కొనసాగడం ఖాయం. పాత బ్యానర్స్ తప్ప కొత్తగా వచ్చిన ఏ బ్యానర్ కూడా టాలీవుడ్ లోని టాప్ హీరోలందరితో చిత్రాలు చేయలేదు.ఇప్పుడు ఆ రికార్డ్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్రేక్ చేసేలా ఉంది.