Tuesday, August 9, 2022
HomeLifestylespecial Editionసినీ సంగీత సామ్రాజ్య మకుట రహిత "చక్రవర్తి"

సినీ సంగీత సామ్రాజ్య మకుట రహిత “చక్రవర్తి”

తెలుగు చలన చిత్ర రంగంలో విడదీయరాని బంధం అనుబంధం కలిగి ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి సంగీత దర్శకులు చక్రవర్తి. 950కి పైగా చలన చిత్రాలకు సంగీతాన్ని అందించిన చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్తగా, 1971 నుంచి 1989 వరకు రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు.

చక్రవర్తి గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పొన్నెకల్లులో 1936 సెప్టెంబరు 8వ తేదీన జన్మించిన చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు.

అయన తల్లిదండ్రులు సంగీత జ్ఞాన సంపన్నులు. అలా ఆయనకు సంగీతంపై ఆసక్తికి నేపథ్యం ఉంది. కుమారుని ఉత్సాహంచూసి తండ్రి గుంటూరులో ఉన్న మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించారు. ఒక పక్క చదువు, మరో పక్క సంగీతాభ్యాసం నిరాటంకం గానే సాగాయి. అయన ఉత్సాహం దాచుకోలేక వినోద్ ఆర్కెస్ట్రా అనే బృందాన్ని ఏర్పాటు చేసి పాటలు, పద్యాలు పాడుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో 1954-58ల మధ్య కె.అప్పారావు కంఠం పాటలతో ప్రతిధ్వనించేది. నాటి శ్రోతలకి అతని కంఠం బాగా సుపరిచితమే.

అప్పారావు మద్రాసు వచ్చి హెచ్.ఎమ్.వి. వారికి గ్రామఫోను పాటలు పాడటం ప్రారంభించారు. ఒక రికార్డింగులో సంగీత దర్శకులు రాజన్, నాగేంద్రలు అవకాశం ఇప్పించి పాడించారు. బి.విఠలాచార్య ఆపారావుతో తన సినిమా జయ విజయ (1959)లో ఆడాలి … పెళ్ళాడాలి అనే పాటను పాడించారు. ఆ పాటను చిత్రంలో హాస్యనటుడు బాలకృష్ణ పాడతాడు. ఇదే అప్పారావు సినిమాలలో పాడిన మొదటి పాట.
గాయకుడిగా కెరీర్ ప్రారంభించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ 500 చిత్రాలకు గాత్రం అందించాడు. నటుడిగా తేనెటీగ, రాజా తదితర చిత్రాల్లో కనిపించారు. డైలీ సీరియల్స్‌లోనూ ఉదాత్తమైన పాత్రలు పోషించారు. కొన్ని చిత్రాలకు పాటలూ రాశారు. ఫలోమా అనే మలయాళ చిత్రం హిందీ డబ్బింగుకి వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. టైటిల్స్‌లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని సినిమావారు అతనుకు చెప్పి “చక్రవర్తి”గా వేశారు. అలా చక్రవర్తి అయి పోయారు.

ఆ కాలంలో అనువాద చిత్రాలు ఎక్కువగా ఉండేవి, అందులో అప్పారావుకి అవాకాశాలు వచ్చాయి. నాటకాలలో అనుభవం ఉండడం చేత ఆయన సంభాషణలను బాగా చెప్ప గలిగారు. ఇలా అప్పారావు పాటలు పాడడంతో పాటు అనువాద చిత్రాలలో పాత్రలకు గాత్రం అందించటం మొదలు పెట్టారు. కంఠం, చెప్పే విధానం బాగా ఉండడంతో హీరో పాత్రలకు గొంతు దానం చేసే స్థాయికి ఎదిగారు. అలా ఎం.జి.రామచంద్రన్, జయ శంకర్, జెమిని గణేశన్ లకు గాత్రం అందించారు. హాస్యనటులైన నగేష్, కులదైవం రాజగోపాల్ లకూ డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా నగేష్ కు బాగా డబ్బింగు చెప్పేవారు. అప్పారావు సినిమాలలో 200లకు పైగా పాటలు పాడాతు. కొన్ని కలిసి పాడినవి ఐతే, కొన్ని యుగళ గీతాలు. పరమానందయ్య శిష్యుల కథ (1966)లో ఘంటసాలతో “పరమగురుడు చెప్పిన వాడు పెద్దమనిషి కాడురా” అనే పాటను పాడారు. బంగారు సంకెళ్ళు (1968)లో రాజబాబుకి “తొలగండెహే” అనే తాగుడు పాటని పాడారు. నిలువు దోపిడి (1968)లో ఎన్.టి.రామారావుకు ఒక పద్యం చదివినప్పుడు, నాగార్జున పద్యాలు, శ్లోకాలు చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. దర్శకుడు సి.ఎస్.రావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరి నిలువు దోపిడి, మళ్ళీపెళ్ళి, కంచుకోట, పెత్తందార్లు సినిమాలకు పని చేశారు. అయితే తమకు ఇష్టమైన సంగీతాన్ని విడిచి పెట్టక పాటలూ పాడేవాడు. శారద చిత్రంతో సినీ రంగంలో స్థిరపడ్డారు. అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకం,ఎన్.టి.రామారావు‌తో కొండవీటి సింహం వంటి విజయ వంతమైన చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించి 850కు పైగా తెలుగు చిత్రాలకు సంగీతాన్ని అందిచారు. చక్రవర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. చివరి సారిగా నిన్నే ప్రేమిస్తా చిత్రంలో సౌందర్య నాన్నగారిగా నటించారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల సినిమాలన్నీ కలుపుకుంటే -959 చిత్రాలు. ఆయన ‘ట్రాక్’ రికార్డు గురించి చెప్పకోవాలంటే – కన్నడ (60), తమిళం (4), మలయాళం (1) -ఒకే ఏడాదిలో 69 చిత్రాలకు సంగీతాన్ని అందించిన పాటల చక్రవర్తి అయన. అప్పారావు సినిమాల్లో 200లకు పైగా పాటలు పాడారు. తెలుగులో సంగీత దర్శకుడిగా ‘మూగప్రేమ’తో కెరీర్ ప్రారంభించిన చక్రవర్తి -1997లో ‘పెళ్లామా మజాకా’ వరకూ సుస్వరాలు అందిస్తూనే ఉన్నారు.

అమ్మోరు చిత్రానికి చివరి సారిగా సంగీతాన్ని అందించిన చక్రవర్తి 2002 ఫిబ్రవరి 3న కన్ను మూశారు. ఆస్కార్ అవార్డు పొందిన ఏ.ఆర్.రెహమాన్ చక్రవర్తి శిష్యుడు కావడం విశేషం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments