ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం నుంచి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను. హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. యశోధ ఆస్పత్రికి తీసుకెళ్లగా. గుండెపోటుతో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. వార ఫలాలు చెబుతూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు రామలింగేశ్వర సిద్ధాంతి సుపరిచితులయ్యారు.