Wednesday, November 30, 2022
HomeNewsములుగు: ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్ దంపతులు.. ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం..!

ములుగు: ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్ దంపతులు.. ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం..!

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ములుగు: ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్ దంపతులు.. ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం..!

ములుగు అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా జిల్లాని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో ప్రసవించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్వయాన ఆసుపత్రికి చేరుకుని వారిని కలిసి పరామర్శించి, అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ, అన్ని రకాల సౌకర్యాలను కల్పించారని అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రిలో ప్రసవించి జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారని, ప్రజల్లో విశ్వాసం నింపారని మంత్రి అన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సక్రమంగా చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులను రూపొందించారని.. అందుకు ఉదాహరణ అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించారని స్పష్టం చేశారు.

ఒక స్థాయిలో ఉండి, భార్య అడిషనల్ కలెక్టర్ స్థాయిలో ఉన్నప్పటికి ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనివ్వటం వారు తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఆదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠిని అభినందించారు, కెసిఆర్ కిట్‌ను అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటల వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారని, ప్రతి ఒక్కరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రకటించారు.

ఆసుపత్రి ఇంచార్జ్ డాక్ట‌ర్‌తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి.. ఇలా త్రిపాఠి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చిందని, శిశువు 3. 400 కిలోల బరువు ఉన్నారని తెలిపారు. తల్లి బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న గర్భిణీలతో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్.. వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి ధైర్యంగా వచ్చి నార్మల్‌ డెలివరీ చేయించుకోవచ్చని తెలిపారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments