సినిమా ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్
కొవిడ్ ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం
ఇష్క్
విడుదల వాయిదా..
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడం..రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ఏప్రిల్23న విడుదల కావాల్సిన ఇష్క్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దక్షినాదిలోని సుప్రసిద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇష్క్
. ఏప్రిల్23న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.