బిగ్ బాస్-2 ఫేమ్ భానుశ్రీ నటించిన విభిన్న కథా చిత్రం “మౌనమ్’. ‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ అనేది ఉప శీర్షిక. మురళీకృష్ణ, ఐశ్వర్య అడ్డాల, చిన్నా, బేబీ అక్షర, శ్రీహర్ష, సత్యం యాబి ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎల్.ఎ. టాకీస్-సంధ్య స్టూడియో బ్యానర్స్ పై అల్లూరి సూర్యప్రసాద్ నిర్మించారు. బహుముఖ ప్రతిభాశాలి కిషన్ సాగర్.ఎస్ దర్శకత్వం వహించడంతోపాటు ఛాయాగ్రహణం అందించారు. సెన్సేషనల్ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రానికి పోతుల రవికిరణ్ సాహిత్యం సమకూర్చారు.

సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఊర్వశి ఓటిటి ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే కథ- కథనాలతో… అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన “మౌనమ్” అన్ని వర్గాల ప్రేక్షకులనూ కచ్చితంగా అలరిస్తుందని, దర్శకుడిగా తనకు మంచి పేరు తెస్తుందని చిత్ర దర్శకుడు కిషన్ ఎస్.సాగర్ అన్నారు. తమ చిత్రం “ఊర్వశి ఓటిటి” ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండడం చాలా సంతోషంగా ఉందని, బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ పెర్ఫార్మెన్స్, శ్రీలేఖ సంగీతం “మౌనమ్” చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాత-ఎల్.ఎ.టాకీస్ అధినేత అల్లూరి సూర్యప్రసాద్ పేర్కొన్నారు.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చుక్క సురేష్ (దుగ్గిరాల), కథ: అనిల్, స్క్రీన్ ప్లే-డైలాగ్స్-ఎడిటింగ్: శివ శర్వాణి, నిర్మాత: అల్లూరి సూర్యప్రసాద్, ఛాయాగ్రహణం-దర్శకత్వం: కిషన్ ఎస్.సాగర్!!
