5.1 C
New York
Saturday, March 25, 2023
Homespecial Editionనమ్మిన సిద్ధాంతాలతో రాజీ పడని మొరార్జీ దేశాయ్

నమ్మిన సిద్ధాంతాలతో రాజీ పడని మొరార్జీ దేశాయ్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

Morarji Desai : తాను నమ్మిన సిద్ధాంతాలతో ఏనాడూ రాజీ పడని విలక్షణ వ్యక్తిత్వం దివంగత ప్రధాని మొరార్జీ దేశాయ్ కే సొంతం. మొరార్జీ దేశాయ్ దృష్టిలో నిజాయితీ అనేది ఒక విశ్వాసం త‌ప్ప అవ‌స‌రం కాదు. ఎట్టి ప‌రిస్థితుల్లో అయినా ఆయ‌న తాను న‌మ్మిన సిద్ధాంతాల‌కే క‌ట్టుబ‌డి ఉండేవారు. క్లిష్ట‌మైన సంద‌ర్భాల్లో కూడా ఆయ‌న రాజీప‌డిన దాఖ‌లాలు లేవు. ‘జీవితంలో ప్ర‌తి ఒక్క‌రూ నిజాయితీకి క‌ట్టుబ‌డి న‌మ్మిన సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ఉండాల‌న్న ధ‌ర్మ సూత్రాన్ని’ మొరార్జీ దేశాయ్ ఆచ‌రించి చూపించారు.
ధృఢమైన గంధేయవాదిగా దేశాయ్, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సోషలిస్టు విధానాలకు వ్యతిరేకంగా సామాజిక సంప్రదాయ వాదిగా, అనుకూల – వ్యాపార, ఉచిత సంస్థ సంస్కరణలకు అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎదిగిన దేశాయ్, అవినీతి వ్యతిరేక అంశాలతో తీవ్ర జాతీయ వాదిగా, ప్రధానమంత్రి నెహ్రూ, అయన మిత్రపక్షాలను విభేదించారు.

1927-28 గోద్రాలో జరిగిన అల్లర్ల సమయంలో హిందువులపై మెతక వైఖరి అవలంభించాననే అపరాధ భావంతో మే1930న అతను గోద్రా డిప్యూటీ కలెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేసారు.

వివాదం లేకుండా ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలు గడిపిన గొప్ప నాయకుడు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత, ఆయన ఎప్పుడూ క్రియాశీలక రాజకీయాల వైపు తిరిగి చూడలేదు.

మొరార్జీ దేశాయ్ బొంబాయి రాజ్యంలో (ప్రస్తుతం గుజరాత్) బ్లస్టర్ జిల్లాకు చెందిన భడేలీ గ్రామంలో 1896 ఫిబ్రవరి 29 న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ముంబైలోని విల్సన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత ఆయన గుజరాత్ లో సివిల్ సర్వీసులో చేరారు.

మహాత్మాగాంధీ అధ్వర్యంలో జరిగిన భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరారు. భారత దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో అనేక సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. తన తెలివైన నాయకత్వ నైపుణ్యాల వల్ల స్వాతంత్ర్య సమర యోధులందరికీ అభిమాని అయ్యారు. గుజరాత్ ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ముఖ్యమైన నాయకుడయ్యారు .1934, 1937 లలో ప్రాంతీయ ఎన్నికలు జరిగినప్పుడు, ఆయన బొంబాయి ప్రెసిడెన్సీలో వరుసగా రెవెన్యూమంత్రి, హోంమంత్రి బాధ్యతలను చేపట్టారు.1952లో బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకో బడ్డారు. బొంబాయి రాష్ట్రం ద్వి భాషా రాష్ట్రంగా ఉండేది. బొంబాయి రాష్ట్రంలో గుజరాత్, మరాఠీ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు.
పార్లమెంటులో ఎనిమిది వార్షిక మరియు రెండు మధ్యంతర బడ్జెట్లను ప్రదర్శిస్తూ మొరార్జీ దేశాయ్ ఒక ప్రత్యేకమైన రికార్డును కలిగి ఉన్నారు. 1964 మరియు 1968 లో ఫిబ్రవరి 29 న రెండు కేంద్ర బడ్జెట్లను సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆయనకు ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది, ఇది అయన పుట్టినరోజు కావడం గమనార్హం.

దేశాయ్ ఇందిరా గాంధీ ప్రభుత్వంలో ఉప ప్రధాన మంత్రిగా సేవల నందించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రభుత్వంలో అనేక కీలక పదవులను చేపట్టారు. బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత హోం మంత్రి, ఆర్థిక మంత్రి, ప్రతిపక్ష నేత పదవులతొ పాటు భారతదేశ 2వ ఉపప్రధాని పదవిని కూడా చేపట్టారు.

1977 మార్చి 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1979 జూలై 26 వరకు భారత దేశానికి 4వ ప్రధానిగా తన సేవల నందించారు. భారత రాజకీయ చరిత్రలో 81 సంవత్సరాల వయసులో ప్రధాని పదవిలో ఉన్న నేత. అలాగే కాంగ్రెసేతర ప్రధానిగా పదవి చేపట్టి, 1979 లో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. రెండున్నర సంవత్సరాలు (మార్చి 1977 నుండి జూలై 1979 వరకు) మాత్రమే ప్రధానిగా ఉన్నారు.
దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచిన నేతగా చరిత్రలో మిగిలి పోయారు.
అత్యధిక పౌర పురస్కారాలను అందుకున్న ఏకైక భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు.

పాకిస్తాన్ సంబంధిత అత్యున్నత పౌర పురస్కారం… నిషానే – ఎ – పాకిస్తాన్ – 1986 లో
గెలుచుకున్న ఏకైక భారతీయుడు. 1991లో భారత రత్న పురస్కారం పొందారు. అలా భారత దేశం, పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్న, నిషానే పాకిస్తాన్ లను పొందిన ఏకైక భారతీయుడు మొరార్జీ.

మొరార్జీ దేశాయ్ జనతాపార్టీకి 1980 సార్వత్రిక ఎన్నికలలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రచారం చేశారు, కాని ఎన్నికలో పోటీ చేయలేదు. అయన “యూరిన్ థెరపీ”ని అభ్యసించే వారు. 1978లో “మూత్ర చికిత్స” దీర్ఘకాలిక అభ్యాసకుడైన దేశాయ్ డేంరాథర్ తో “60 మినిట్స్” కార్యక్రమంలో మాట్లాడుతూ మూత్రం త్రాగడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. వైద్య చికిత్స పొందలేని లక్షల మంది భారతీయులకు మూత్ర చికిత్స అనేది పరిపూర్ణ వైద్య పరిష్కారం అని దేశాయ్ వివరించారు. స్వ మూత్రం తాగడం ద్వారా తన దీర్ఘాయువుని కాగలిగానని చెప్పారు. దీనిని “జీవజలము” అని పిలిచారు.

దేశాయ్ 1896 లో జన్మించారు. పదవీ విరమణ తరువాత అయన ముంబైలో నివసించి సంతోషంగా గడిపి, 1995 లో 99 సంవత్సరాల వయసులో మరణించారు. దేశాయ్ తన 100 వ పుట్టిన రోజుకు కొద్ది నెలల వ్యవధిలో 1995 ఏప్రిల్ 10 న కన్ను మూశారు. అత్యధిక కాలం జీవించిన దివంగత భారత ప్రధానిగా పేరు గడించారు.

పాశ్చాత్య సాంప్రదాయం ప్రకారం పుట్టిన తేదీన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతి ఏడూ అలా పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన పుట్టిన తేదీన భారత దేశంలోనూ జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే భారత దేశ చరిత్రలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, వివిధ పదవులను అలంకరించి, దాదాపు శత సంవత్సరాలు జీవించిన ఒక గొప్ప నాయకునికి అలాంటి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఆ దివంగత గొప్ప నాయకుని జన్మదినం చాలా మందికి గుర్తుండదు. ఆయనే దివంగత భారత ప్రధాని మొరార్జీ దేశాయ్. కారణం ఆయన ఫిబ్రవరి 29వ తేదీన జన్మించడమే. లీపు సంవత్సరము అయితే తప్ప ఆయనది ప్రాతి సంవత్సర జన్మదినం కాకపోవడమే. నాలుగు ఏళ్లకు ఒకసారి మాత్రమే ఫిబ్రవరి 29 రావడం కావడమే. జన్మదిన ప్రత్యేకత లాగే పలు విధ ప్రత్యేకతల సమాహారం మొరార్జీ జీవితం.
మొరార్జీ దేశాయ్ పండిన 99 ఏళ్ళ వయసు వరకు జీవించినా, ఫిబ్రవరి 29 న జన్మించి నందున అయన తన జీవిత కాలంలో కేవలం 24 పుట్టిన రోజులను మాత్రమే చూసి, 25వది రావడానికి కొద్ది రోజుల ముందు కన్ను మూశారు.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments