విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి –

Date:


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వర్షాల వల్ల విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారంనాడాయన బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్‌ శర్మ, టీఎస్‌ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డిలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్‌ నిర్వహణ, సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంతటి భారీ వర్షాలు సంభవించినా సరఫరా నిరంతరం కొనసాగేలా చూడాలని చెప్పారు. విద్యుత్‌ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్రేక్‌ డౌన్‌ అయితే దాన్ని పునరుద్ధరించేందుకు అత్యవసర సిబ్బందిని, మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...

సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి –

– ఈఎన్‌టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఎమ్మెల్యే భాస్కరరావు– అత్యాధునిక పరికరాల...