ధార్మిక కార్య క్రమాలు స్నేహ సంబంధాలు పెరుగుతాయి. సంతాన వర్గం ద్వారా గౌరవభివృద్ధి. కార్యక్రమాలను సులభంగా నెరవేర్చుకుంటారు. సజ్జన సహకారం. తీర్ధ యాత్రలు, వృత్తిలో గౌరవం బాధ్యతలు శ్రమ పెరుగుతుంది. మాట విలువ కుటుంబసౌఖ్యం. సమయానికి రావలసిన ధనం,పాతబాకీలు అందుతాయి. విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకుంటారు, పరీక్షలో విజయం సాధిస్తారు. శత్రువులపై విజయాలు , శత్రువుల వలన ఇబ్బంది కూడా ఉంటుంది. స్వయంకృషితో నైపుణ్యాలు పెంచుకొని విజయాల పెంపొందించుకుంటార తండ్రి గారి ఆరోగ్యంలోఎక్కువ జాగ్రత్త శ్రద్ధ. అసంతృప్తి అధిగమించటానికి పుణ్యబలం పెంచుకోవాలి. సేవకజనం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, వీలైనంత వరకు పనులు స్వయంగా చేసుకోవడం మంచిది. రావలసిన సొమ్ము ఆలస్యముగా చేతికి అందడం వల్ల కొన్ని ఇబ్బందులు. అందువలన అవసరానికి తగినట్లుగా 2,3 మార్గాలలో ధనాన్ని ఏర్పాటు చేసుకోనెట్లు ప్రయత్నం చేస్తే మంచిది. అపార్ధములు రాకుండా తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయాలి. శత్రువులు అపకారం చెయ్యడానికి ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలలో కొంత ఆలస్యం వలన విజయం వీరికి లభిస్తుంది. అప్పులు తీర్చే విషయములో శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉన్నది లేకపోతే అపార్థములకు అవకాశం ఉన్నది. ఆకస్మికఆదాయముల కొరకు చేయు ప్రయత్నములు కొన్ని ఫలించినప్పటికీ సమగ్రముగా వాటి పైనే ఆధారపడి పూర్ణ విశ్వాసము వాటిపైన పెట్టుకొనుటకు లేదు. షేర్స్ మొదలైన వాటికి లాభములు వచ్చే అవకాశం ఉంది అని తాత్కాలికమైన విషయము గా గుర్తించి ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది.
మిధున రాశి: ఈ సంవత్సర రాశి ఫలాలు ….
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES