Thursday, August 18, 2022
HomeLifestyleLife styleఅసమాన పరిశోధకుడు మేఘనాథ్ సాహా

అసమాన పరిశోధకుడు మేఘనాథ్ సాహా

మేఘనాధ్ సాహా (1893 అక్టోబరు 6 — 1956 ఫిబ్రవరి16) భారత దేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాలలో జరిగే మార్పు లు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్నాడు.ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో గల ఢాకాలోని సియోర్‌ తలి గ్రామంలో 1893 అక్టోబరు 6న, జన్మించిన మేఘ నాథ్‌ సాహా, చదువులో బాల్యం నుండే రాణించాడు. తండ్రి సంపాదన చాలక పోవడంతో ఆ కుటుంబం తరచు పస్తులతో గడపాల్సి రాగా, సాహాను బడి మానిపించి ఏదైనా పనిలో పెట్ట డానికి తండ్రి ప్రయత్నించాడు. అయితే సాహా చురుకు దనాన్ని గమనించిన ఉపాధ్యాయులు తండ్రికి నచ్చచెప్పి దాతల సాయం తో ఓ బోర్డింగ్‌ స్కూలులో చేర్చారు. సాహా చక్కగా చదువుతూ స్కాలర్‌షిప్‌లు సాధించి పై చదవుల కోసం ఢాకా వెళ్లాడు.ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం బెంగాల్‌ ను విభజించి నందుకు నిరసనగా పన్నెండేళ్ల సాహా, గవర్నర్‌ తమ స్కూలును సందర్శి స్తున్న కార్యక్ర మాన్ని స్నేహితులతో బహిష్కరించి డిస్మిస్‌ అయ్యాడు. మరో స్కూల్లో చేరి అక్కడ కూడా స్కాలర్‌షిప్‌ సాధించాడు. కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఆయనకు బోధించిన వారిలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు జగదీశ్‌ చంద్రబోస్‌, పీసీ రే ఉండగా, అతడి క్లాస్‌మేట్స్‌లో సత్యేంద్రనాథ్‌ బోస్‌, పీసీ మహాలనోబిస్‌ కూడా శాస్త్రవేత్తలు కావడం విశేషం.ఎమ్మెస్సీ తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వక పోవడంతో ఉపాధి కోసం ట్యూషన్లు చెబుతూనే పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. తర్వాత కలకత్తాలో అధ్యాపకుడిగా చేరిన ఆయన ఖగోళ భౌతిక శాస్త్రంపై పట్టు సాధించాడు. సూర్యకాంతి గాజు పట్టకం ద్వారా ప్రసరించి నప్పుడు ఏర్పడే వర్ణపటం (Spectrum) ఎందుకు ఏర్పడుతుందో చెబుతూ అయనీ కరణ సూత్రాన్ని ప్రతిపాదించాడు. సూర్యుని ఉష్ణోగ్ర తలు, సౌష్టవం, సంయోజనం లాంటి ధర్మాలను విశ్లేషించాడు. ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ (లండన్‌) గా ఎన్నికయ్యాడు. అలహాబాదు యూనివర్శిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా వర్ణపట విజ్ఞానం (Spectro scopy), అయనా వరణం (Ionosphere) పై పరిశోధనలు చేశాడు. సూర్య కిరణాల బరువును, వత్తిడిని కనిపెట్టే పరికరాన్ని రూపొందిం చాడు. ఇంకా పురాతన శిలలు, సూర్యుని నుంచి వెలువడే రేడియో తరంగాలు, రేడియో ధార్మికతలపై కూడా పరిశోధన లు చేశాడు. కలకత్తా విశ్వ విద్యాల యంలో న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ విభాగా న్ని1948లో సాహా ప్రారంభించాడు. దేశంలో పరమాణు కణాల త్వర ణాన్ని పెంచే తొలి యాక్సిలరేటర్‌ ఆయన పర్యవేక్షణ లోనే నిర్మిత మైంది. సైన్స్‌ అండ్‌ కల్చర్‌ పత్రికను నడిపాడు. ఆయన రాసిన ‘ఎ ట్రిటైజ్‌ ఆన్‌ హీట్‌’ ఓ ప్రామాణిక పాఠ్య గ్రంథం.1923 లో సాహా అలహాబాదు విశ్వ విద్యాలయంలో ఆచార్యుడయి నాడు. 1927 లో రాయల్ సొసైటీ లో సభ్యత్వం లభించింది. 1934లో 21వ భారత సైన్సు కాంగ్రెస్ సదస్సు కు అధ్యక్షత వహించాడు. 1938 లో కలకత్తా విశ్వ విద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ కలకత్తా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ను నెలకొల్పి దానికి గౌరవా ధ్యక్షుడిగా ఉన్నాడు. సాహా ఫిబ్రవరి 16, 1956న మరణించాడు. .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments