Tuesday, August 9, 2022
HomeEntertainmentMovie Updatesగణతంత్ర దినోత్సవ వేడుకల్లో మెగాస్టార్

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మెగాస్టార్

గణతంత్ర దినోత్సవ వేడుకులు ఈ రోజు దేశమంతటా పండగల జరుపుకుంటున్నారు. నేడు 72 వ గణతంత్ర దినోత్సవం. ఈ వేడుకలు అన్ని రంగాల్లో.. రాజకీయ నాయకుల నుండి సామాన్య ప్రజలంతా జరుపుకునే పండగ. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ జరుపుకునే ఈ వేడుకలు ఎప్పటి లాగే ఈ రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఘనంగా జరిగాయి.

ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నాగబాబు, మెగా  పవర్ స్టార్ రామ్ చరణ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు టీం తో పాటు మెగా ఫాన్స్ కూడా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా మెగా అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదానం చేసిన అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్ లు పరామర్శించారు. మెగా అభిమానుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments