ఆరు జోన్లుగా వైద్య, ఆరోగ్య శాఖ..! –

Date:


– ఒక్కో జోన్‌కు ఒక డీఎంఅండ్‌హెచ్‌ఓ
– మరింత తగ్గనున్న రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధి
– ఇంకా ఖరారు కాని విధివిధానాలు
– యూపీహెచ్‌సీ,పీహెచ్‌సీ, బస్తీ దవాఖానాల వికేంద్రీకరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య సేవలను మెరుగుపర్చేందుకు వైద్య, ఆరోగ్యశాఖ మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్‌, రంగా రెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల వారీగా ఉన్న వైద్యశాఖను జోన్లుగా విభజించడానికి సిద్ధమైంది. గతంలో నిర్వహించిన మంత్రిమండలి సమా వేశంలోనే ఈ నిర్ణయం తీసుకోగా.. గురువారం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ విధానం అందుబాటు లోకి వచ్చినప్పటి నుంచి జోన్ల వారీగా డీఎంఅండ్‌హెచ్‌ఓలు అందుబాటులో ఉండనున్నారు. ప్రస్తుతం హైదరా బాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజి గిరి జిల్లాలకు మాత్రమే డీఎం అండ్‌ హెచ్‌లు ఉన్నారు. ఈ మూడు జిల్లాల వైద్యశాఖను సికింద్రాబాద్‌, చార్మినార్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, శేరిలింగం పల్లి, కూకట్‌పల్లి పేర్లతో ఆరు జోన్లుగా వికేంద్రీకరించి ఆరుగురు డీఎం అండ్‌ హెచ్‌ఓలను నియమించనున్నారు. వీరంతా ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలు, ప్రయి వేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌లు, ప్రయివేటు ల్యాబ్‌లు ఇలా అన్నింటినీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. వికేంద్రీకరణ వల్ల వైద్యాధికారులకు పని భారం తగ్గి ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉం టుంది. ఆయా ప్రాంతాల్లోని బస్తీ వాసులకు సత్వర వైద్య సేవలు అందించడంతోపాటు విపత్తుల సమ యంలో క్లోజ్‌ మానిటరింగ్‌కు అవ కాశం ఉంటుంది. జాతీయ టీకాలు, నులి పురుగులు లాంటి కార్యక్రమాల నిర్వహణ కూడా సులభతరం కానుం ది. కొత్తగా ఎంపికైన డీఎఅండ్‌ హెచ్‌ఓలు జోనల్‌ కమిషనర్లకే రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
తగ్గనున్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖల పరిధి
ప్రస్తుతం హైదరాబాద్‌ డీఎం అండ్‌హెచ్‌ఓ పరిధిలో 91 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 166 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో 19 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, మరో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలన్నీ హైదరాబాద్‌ పరిధిలోకి వెళ్లనున్నాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో 36 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. వీటిలో 12 తప్ప మిగిలినవన్నీ కొత్త డీఎంఅండ్‌హెచ్‌ల పరిధిలోకి రాను న్నాయి. ఏ ఆరోగ్య కేంద్రం ఏ డీఎం అండ్‌హెచ్‌ఓ పరిధిలోకి వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అటు ప్రభుత్వం కానీ, ఇటు వైద్య, ఆరోగ్య శాఖ కానీ ఇంత వరకు విధివిధా నాలను ఖరారు చేయలేదు. ఇప్పటి వరకు రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజి గిరి జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికా రుల పరిధిలో ఉన్న ఆరోగ్య కేంద్రా లు.. ఇకపై జోన్‌లోని డీఎంఅండ్‌ హెచ్‌ఓల పరిధిలోకి రానుండటంతో ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ పరిధి మరింత తగ్గనుంది.
పర్యవేక్షణ సులభతరం చేసేందుకే..
గ్రేటర్‌ వ్యాప్తంగా ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, ఫర్టిలిటీ సెంటర్లు, డెంటల్‌ ఆస్పత్రు లు, నర్సింగ్‌ హోంలు, చిన్న చిన్న క్లినిక్‌ లు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటితో పాటు బస్తీ దవాఖాన, యూపీహెచ్‌సీ లు, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు కూడా ఉన్నాయి. వైద్య, ఆరోగ్యశాఖను జోన్ల వారీగా విభ జించడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓల పరిధి తగ్గి ఆయా ఆస్పత్రులపై పర్య వేక్షణ పెరగనుంది.
రోగులకు నాణ్య మైన, సకాలంలో వైద్య సేవలు అంద డంతోపాటు అనుమతుల్లేకుండా కొన సాగుతున్న క్లినిక్‌లు, నర్సింగ్‌ హోంలు, ఆస్పత్రులపై మరింత నిఘా పెంచ డానికి వీలుంటుందని సర్కార్‌ భావి స్తోంది. బస్తీలు, గల్లీలు, సిటీ పరిసర ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు పుట్టగొడు గుల్లా పుట్టుకొస్తున్నారు. వీరి ఆట కట్టించడంతోపాటు ఫేక్‌ ధ్రువపత్రా లు సృష్టించేవారు, సిజేరియన్లను ప్రోత్సహించే ఆస్పత్రులు, బ్రూణ హత్యలను ప్రోత్సహిస్తున్న ఆస్పత్రులు, డాక్టర్లపై ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్టు సమాచారం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...