గిరిజన జాతరకు తరగని ఆదరణ

Date:

దేశ మాతృ గౌరవాన్ని కాపాడే సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మ క్క, సారలమ్మలను దైవాంశ సంభూ తులుగా ఎంచి, ఉత్తర తెలంగాణ జానపదులు తమ ఆరాధ్య దైవాలు గా కొలవడం సదాచారంగా మారిం ది. దాదాపు 900 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన వన దేవతల జాతర పూర్తిగా గిరిజన సాంప్రదాయంలోనే సాగుతుంది. అయితే గిరిజనులే కాక, గిరిజనే తరులు సైతం గద్దెలెక్కిన దేవతల ను కొలవడం వంశపారం పర్య ఆచరణగా కొనసాగుతున్నది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సమ్మక్క- సారలమ్మ మేడారం జాతర ప్రతి రెండేళ్ల కోసారి వైభవంగా జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క – సారలమ్మల సంబంధిత జాతర వేడుకలు వరుసగా ఒక ఏడు పెద్ద, మరో ఏడు చిన్న జాతర ల కార్యక్రమాలు ప్రతిఏటా జరుగుతాయి. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతరలో అధిక సంఖ్యాకులయిన సాంప్రదాయ భక్తులు పాల్గొనడం వంశ పారంపర్య, సనాతన సంప్రదాయ ఆచరణ.

లక్షలాది మందిని ఆకర్షించే మేడారంలో గురువులు లేదా స్వామీజీల లాంటి వారు, మహిమా న్వితులుగా భావించబడే వారు ఎవరూ ఉండరు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కేవలం ఒకనాడు నిరక్షరాస్యులుగా, నేడు ప్రాపంచిక విషయాల పై అవగాహన ఉన్నట్లు కనిపించే గిరిజన పూజారు లు మాత్రమే ఉంటారు. పరాధీను లు కావడానికి అంగీకరించక, తల ఒగ్గక, లక్ష్యం కోసం ఆత్మార్పణం గావించిన సమ్మక్క, సారలమ్మల ను దైవాలకు ప్రతిరూపాలుగా భావించే గిరిజనులు, సంప్రదాయ అచారణాసక్తులు వన దేవతల జాతరకు శతాబ్దాలుగా శ్రమ కోర్చి పిల్లా పాపలతో తరలి వెళ్ళడం వెనక కోట్లాది మంది భక్తుల మొక్కవోని విశ్వాసం ఉంది.
మొదటి సారి మేడారంలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే వారు తప్పని సరిగా మరుసటి జాతరకు వస్తారని, దీనికి కారణం ఒక సారి దర్శనం చేసుకున్న వారికి కోరిన కోర్కెలు తీరడం, అటుంచి మానసి క ప్రశాంతత, తమలో ఏదో తెలియ ని కొత్త చైతన్యం రావడమేనని అనుభవజ్ఞులైన భక్తుల భావన.

మేడారం జాతర గిరిజన సాంప్రదా యాలకు ప్రతీక. సంస్కృతి ప్రియు లకు నిజమైన పండుగ. సామూ హిక భాగస్వామ్యానికి వేదిక. పూన కాలతో ఊగి పోయే శివసత్తులు, సంప్రదాయ వంశపారంపర్య ఆచరణలో భాగంగా, జాతరకు ముందు నుండే ఏర్పాట్లలో నిమగ్నమై ఉండడం, ముందుగానే ఎన్ని అసౌకర్యాలున్నా గుడారాలు వేసుకొని వేచి ఉండడం, నిలువెత్తు బంగారం (బెల్లం)తో రావడం, జంపన్న వాగులో స్నానాలు, వాయిద్యాల విన్యాసాలు, నిరంతర జంతు బలులు, అమ్మవార్లకు మొక్కులు, కలగలిపి మేడారం జాతర గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దమై నిలుస్తున్నది. దేశ విదేశీ సందర్శకు లను, భక్తులను, యాత్రికులను, చారిత్రక పరిశోధకులను, ఫొటో గ్రాఫర్లను, జర్నలిస్టులను ఈ జాతర ఎంతగానో ఆకర్షిస్తున్నది.

రుజువుకు అందనంత ప్రాచీన కాలం నుండి మేడారం జాతరకు ఎడ్ల బండ్లపై రాకపోకలు ప్రధానంగా జరిగేవి. ఎడ్ల బండ్ల ద్వారా జంపన్న వాగులో నుండి మేడారం చేరుకోవా లనేది స్థానిక గిరిజనుల సాంప్రదా య ఆచరణ. అయితే, 1996 నుండి జంపన్న వాగుపై భక్తుల స్నానాలకు అనువుగా స్నాన ఘట్టాలు వాగు పొడవునా నిర్మించడంతో జంపన్న వాగు దాటడానికి అనువుగా లేకపోవడం, కారణంగా ఎడ్ల బండ్ల సంఖ్య 90 శాతం తగ్గింది. అయినా కొందరు పాత పద్ధతిలోనే, ప్రస్తుతం వందల సంఖ్యలో మాత్రమే ఎడ్ల బండ్లపై జాతరకు వస్తున్నారు. మొట్ట మొదటి సారిగా 1998లో నాటి అవిభక్త రాష్ట్ర ప్రభుత్వం మేడారంతో పాటు పరిసర గ్రామాలలో కూడా అంతర్గత బిటి, సిసి రోడ్ల నిర్మాణాలను చేపట్ట డంతో దుమ్ములేసే అవకాశం గణనీయంగా తగ్గింది.

ఇటీవలి కాలంలో కోట్లాది నిధులతో సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వ కృషి జరిగిన క్రమంలో, రెండేళ్ల కోసారి జరిగే జాతర సమయంలో వచ్చే భక్తులు మేడారానికి రవాణా మార్గాలు కూడా మెరుగవడంతో తాము అనుకున్నపుడు, ఎప్పు డంటే అప్పుడు వెళ్లి సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనాలు చేసుకుంటున్నారు. గోదావరిపై వంతెనల నిర్మాణంతో పారుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, మహరాష్ట్ర, ఒడిసాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. విస్తృతమైన సోషల్ మీడియా ద్వారా మేడారం జాతర ప్రపంచ వ్యాపితం అయింది. ప్రత్యక్షంగా కోటి మంది దర్శించుకుంటే పరోక్షంగా మీడియా ప్రచార సాధనాల వల్ల కోట్లాది మంది చూస్తున్నారు.

ఇంతటి ప్రాశస్త్యం కల్గిన జాతరను జాతీయ పండువ గా ప్రకటించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అలహా బాద్ కుంభమేళా తరహాలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ప్రపంచం లోనే జరిగే అతి పెద్ద గిరిజన జాతరగా విస్తృత ప్రచారం కల్పించడానికి ప్రభుత్వాధి కారులు కృషి చేస్తున్నారు. ఈ పండుగకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ప్రయత్నా లను కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని గట్టుకుని చేస్తున్నది.

కోటికి పైగా భక్తులు, పర్యాటకులు హాజరు కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం 21 ప్రభుత్వ విభాగాలకు రూ.75 కోట్లు మంజూరు చేసి, వివిధ పనులు నిర్దేశించింది. రవాణా, వసతి, తాగునీటి సరఫరా, భద్రత చర్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

మేడారం జాతరకు ఈ సంవత్సరం కేసీఆర్ సర్కార్ రూ.75కోట్లు రిలీజ్ చేసింది. అలాగే రూ. 2.5 కోట్లు నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక తిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...

సౌందర్య శోభనను మర్చిపోతే ఎలా

దీంట్లో దివంగత సౌందర్య ఒరిజినల్ లో నటించిన శోభనకు ఎంత...

శ్రీలీల సెలవుపై రామ్ పేలిపోయే కామెంట్

రామ్ ఎంత సరదాగా అన్నా అందులో నిజం లేకపోలేదు. శ్రీలీల...

చంద్రముఖి 2 అసలు ట్విస్టు చెప్పేశారు

ప్రస్తుతానికి బజ్ పెద్దగా లేకపోయినా చేతిలో ఉన్న అయిదు రోజుల్లో...