Wednesday, November 30, 2022
Homespecial Editionభారత గణిత శాస్త్ర పరిశోధనా పితామహుడు గణేష్ ప్రసాద్

భారత గణిత శాస్త్ర పరిశోధనా పితామహుడు గణేష్ ప్రసాద్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

గణితశాస్త్రాన్ని, ప్రాచీన కాలం నుండి ఎంతోమంది భారతీయులు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. ప్రాచీన కాలంలో … క్రీ.పూ. 4లో పాణిని నుండి మొదలుకొని పింగళుడు, వరాహమిహిరుడు, ఆర్యభట్టు, యతి వృషభుడు, బ్రహ్మగుప్తుడు, మొదటి భాస్కరుడు, శ్రీధరుడు, మహావీరుడు, పావులూరి మల్లన, ఆచార్య హేమచంద్రుడు, భాస్కరా చార్యుడు, వరకు అలాగే మధ్య యుగంలో …నారాయణ పండితు డు, మాధవుడు, పరమే శ్వరుడు, నీలకంఠ సోమయాజి, మహేంద్ర సూరి, శంకర వారియార్, రఘునాధ శిరోమణి, జ్యేష్ట దేవుడు, అచ్యుత పీషరటి, మునీశ్వరుడు, కమలా కరుడు, జగన్నాధ సామ్రాట్ తదితరులు; ఆధునిక యుగం సంబంధిత 1800లలో…రామచంద్ర లాల్, శ్రీనివాస రామానుజన్, ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్, గణేష్ ప్రసాద్, తదితరులు గణిత శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేసి తర్వాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శ కులు అయినారు. అలా గణిత శాస్త్ర వివిధ అంశాలపై పరిశోధనలు చేసి భారత దేశ గణిత శాస్త్ర పరిశోధనా పితా మహునిగా పేరెన్నిక గన్నాడు గణేష్ ప్రసాద్.

గణేష్ ప్రసాద్ (1876 – 1935) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకత పరిశోధనలు చేసిన మేధావి. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం, గొట్టిజెన్ విశ్వ విద్యాలయం లలో శిక్షణ పొందా డు. భారత దేశానికి తిరిగి వచ్చి దేశంలో గణిత పరిశోధనల సంస్కృతిని అభివృద్ధి చేసాడు. భారత దేశంలోని గణిత శాస్త్రజ్ఞులు గణేష్ ప్రసాద్ ను “భారత దేశ గణిత శాస్త్ర పరిశోధనా పితా మహుడు”గా కొనియాడారు. ఆయన భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రాథమిక విద్య అభివృద్ధి పట్ల ప్రత్యేక ఆసక్తి కనవరచి అందుకు కృషి సల్పాడు.

గణేష్ ప్రసాద్ 1876 నవంబరు 15 న ఉత్తర ప్రదేశ్ లోని బాలియాలో శ్రీవాస్తవ కాయస్థ కుటుంబం లో జన్మించాడు. అక్కడే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తన ప్రారంభ విద్యను అభ్యసించాడు.1891లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. అలహాబాద్‌లోని ముయిర్ సెంట్రల్ కాలేజీలో చదువు కున్నాడు, 1895లో గణితంలో ఫస్ట్ క్లాస్ ఆనర్‌లతో బీ ఏ డిగ్రీ పూర్తి చేశాడు. అలహాబాద్, కలకత్తా యూని వర్శిటీలలో డీ ఎస్సీ, ఎం ఏ డిగ్రీ తీసుకుని, తర్వాత అలహా బాద్ నందలి కాయస్థ పాఠశాలలో విద్యా బోధననకు శ్రీకారం చుట్టా డు. అలహాబాదు లోని “మూయిర్ సెంట్రల్ కాలేజీ”లో కూడా విద్యా భోధన గావించాడు. తర్వాత ఉన్నత విద్య, పరిశోధనల కోసం కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయానికి వెళ్లాడు. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం లో ఆయనకు ఇ.డబ్ల్యూ.హాబ్‌సన్, ఆండ్రూ పోర్సైథ్ వంటి గొప్ప గణీత శాస్త్రవేత్తలలో కలసి పనిచేసే అవ కాశం లభించింది. తర్వాత గొటిజెన్ ప్రాంతానికి వెళ్ళి ప్రముఖ శాస్త్ర వేత్తలైన ఆర్నాల్డ్ సోమర్ ఫీల్డ్, డెవిడ్ హిల్బెర్ట్, జార్జి కాంటర్ వంటి వారితో కలసి పని చేసే అవకాశం కలిగింది. గొటిజన్ లో ప్రసాద్ “ఆన్ ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ మేటర్ అండ్ ద అనలైటిక్ థీరీస్ ఆఫ్ హేట్” పై పరిశోధనా పత్రాన్ని ప్రచురించాడు.

ఐదు సంవత్సరాలు విదేశాలలో గడిపిన అనంతరం , ప్రసాద్ 1904లో భారత దేశానికి తిరిగి రాగానే అలహాబాద్‌ లోని ముయిర్ సెంట్రల్ కాలేజీలో గణితశాస్త్ర అదనపు ప్రొఫెసర్‌గా నియమితు డయ్యాడు. అప్పటి బనారస్‌లోని క్వీన్స్ కాలేజీలో గణిత శాస్త్ర విభాగాధిపతి సుధార్కర్ ద్వివేది పదవీ విరమణ చేయడంతో డాక్టర్ ప్రసాద్‌ అక్కడికి పంప బడ్డాడు. అక్కడ గణితశాస్త్ర అధ్యాపకుడు ఆయన ఒక్కడే కావడంతో నాలుగు డిగ్రీ తరగతులకు ఆయనే బోధించాల్సి వచ్చింది.

1917లో బనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా ; సెంట్రల్ హిందూ కళాశాల, బనారస్ గౌరవ ప్రిన్సి పాల్‌గా పనిచేశాడు. అక్కడ గణిత శాస్త్ర బోధనను సమూలంగా పునర్వ్యవస్థీ కరించాడు. 1923లో కలకత్తాకు ఆహ్వానించ బడి, గణితశాస్త్ర ప్రొఫెసర్ గా. విధులు నిర్వర్తించాడు. 1935 మార్చి 9న ఆయన మరణించే వరకు ఈ పదవిలో కొనసాగాడు.
1924 లో గణేష్ ప్రసాద్ కలకత్తా గణిత సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. ఇండియన్ అసోషి యేషన్ ఫర్ అడ్వాన్స్‌ మెంట్ ఆఫ్ సైన్స్ కు ఉపాధ్యక్షు లుగా ఎన్నికైనాడు. ఆయన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఇండియా (ప్రస్తుతం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ) వ్యవస్థాపక సభ్యుడు. ఆగ్రా యూనివర్సిటీ స్థాపకుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన 11 పుస్తకాలను రచించారు. గణిత శాస్త్రంలో 50 పరిశోధనా పత్రాలను వ్రాసాడు. వివిధ విషయాలపై పనిచేశాడు. ఇందులో థియరీ ఆఫ్ పొటెన్షియ ల్స్, థియరీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ రియల్ వేరియబుల్, ఫోరియర్ సిరీస్, థియరీ ఆఫ్ సర్ఫేస్ మొదలైనవి ఉన్నాయి. ఆయన విద్యార్థులలో దివంగత డాక్టర్ ఎ ఎన్ సింగ్, డాక్టర్ గోరఖ్ ప్రసాద్, డాక్టర్ ఆర్ ఎస్ వర్మ, డాక్టర్ బి ఎన్ ప్రసాద్, డాక్టర్ ఎన్ జి శబ్దే, డాక్టర్ ఆర్ డి మిశ్రా వంటి వారు ఉన్నారు.

డా. ప్రసాద్ హిందీ అంటే చాలా ఇష్టపడేవాడు. యూనివర్శిటీ క్లాసులలో హిందీని ఒక సబ్జెక్ట్‌గా పరిచయం చేయడంలో ఆయన కృషి మరిచి పోలేనిది. “పంతొమ్మి దవ శతాబ్దానికి చెందిన కొంత మంది గొప్ప గణిత శాస్త్రజ్ఞులు” అనే పేరుతో ఆయన తన పుస్తకం లోని మొదటి వాల్యూమ్‌ను హిందీలోకి అనువదించాడు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments