రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు
పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా “మాటరాని మౌనమిది”. ఈ చిత్రంతో
అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లో ట్రైన్ అయ్యిన మహేష్ దత్త, తెలుగు అమ్మాయి
సోని శ్రీవాస్తవ ప్రేక్షకుల ముందుకు పరిచయం కాబోతున్నారు. లవ్ స్టొరీ
మరియు థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న “మాటరాని
మౌనమిది” సినిమా గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు.
ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. నువు మాట్లాడేదాకా మట్టి
నీ కింద ఉంటుంది. మాట్లాడటం ఆగిన తర్వాత ఆ మట్టి నీ పైన ఉంటుంది అనే
డైలాగ్ తో పాటు హీరో హీరోయన్ల మధ్య లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
గ్లింప్స్ చివర్లో వచ్చిన షాట్స్ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను
రివీల్ చేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా
త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.
నటీ నటులు – మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి,
సంజీవ్ , శ్రీహరి తదితరులు.
సాంకేతిక వర్గం – , సినిమాటోగ్రఫీ చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, పిఆర్ఒ
ః జియస్ కె మీడియా,
నిర్మాత ః రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్, దర్శకుడు ః సుకు పూర్వాజ్