HomeLifestyleLife styleరాష్ట్ర తొలి మహిళా మంత్రి మాసూమా బేగం

రాష్ట్ర తొలి మహిళా మంత్రి మాసూమా బేగం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


కాలం ఏదైనా సమాజంలో, మిగతా మతాల కన్నా ముస్లిం సమాజంలో ఇస్లాం మతంలో స్త్రీల పరిస్థితి పూర్తి భిన్నమైంది. మతాలన్నీ స్త్రీని, పురుషుని తర్వాతనే రెండవ స్థానంలో పరిగణిస్తున్నప్పటికీ, ఇస్లాం మతం స్త్రీని పరదా చాటు వ్యక్తిగా చూసింది. పరాయి పురుషు ల కంటపడటమే నేరంగా కట్టడి విధించింది. పరదా అంటే కొన్ని వర్గాలలో మహిళలు వారి దేహాన్ని కనపడకుండా కప్పుకొనే సాంప్ర దాయ ఆచారం. కొన్ని ప్రాంతాలలో స్వచ్చందంగా, మరి కొన్ని ప్రాంతాలలో ఆంక్షల నేపద్యంలో మహిళలు స్వేచ్చగా మసలే హక్కును కోల్పోయారు. బురఖా అనేది ఇస్లాం మత ఆచారాలకు చిహ్నంగా మతపరమైన ఆంక్షలను విధిస్తుంది. అలా పరదా చాటు ముస్లిం స్త్రీలు సమాజంలో మిగతా వర్గాల స్త్రీల కన్నా ఎక్కువగా మత ఆచారాలు, పురుషాధిపత్యం విధించిన ఆచారాలు, ఆంక్షల వల్ల అణచి వేతకు, నిర్భందానికీ గురి కావలసి వచ్చింది. మహిళలను మతపరమైన కార్యక్రమాలకు అనుమతించినప్పటికీ, శతాబ్దాలుగా ఎక్కువగా నిర్బంధాన్ని, ఆంక్షలనూ
ఎదుర్కొన్నారు.
ముస్లిం మహిళల విద్య విషయంలో…మదరసాల్లో విద్యా భ్యాసం కేవలం మగవారికే అందుబాటులో ఉన్నా, పట్టణాలు, నగరాల్లో ప్రాముఖ్యత కలిగిన కుటుంబాల స్త్రీలకు ఇళ్ళు, ఆంతరంగిక ప్రదేశాల్లో విద్య నేర్పేవారు, మహిళలు మత గ్రంథాలను, వ్యవహారికంగా పనికి వచ్చే నైపుణ్యాలను పెద్దల నుంచి, ఒకరి నుంచి ఒకరూ నేర్చుకునే వారు.

అలా పరదా ధరించే సంప్రదాయం మాటున… సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశాలు మృగ్యమైన కాలంలో, ఇంటి బయటకు రాని సాంఘిక కట్టుబాట్ల ఆంక్షల నేపద్యంలో ఉన్నత చదువులు చదివే సాహసం చేయడమే కాకుండా ప్రజా సంబంధాలు అధికంగా ఉండే రాజకీయాల్లోనూ ముందుకు సాగడం సామాన్యమైన విషయమేమీ కాదు. అలా విద్యా వేత్త కావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు మాసూమా బేగం. దేశంలో మంత్రి పదవిని అధిష్టించిన తొలి ముస్లిం మహిళ కూడా ఆమెనే కావడం విశేషం.

మాసూమా బేగం (అక్టోబరు 7, 1901 – మార్చి 2, 1990) సంఘ సేవకురాలు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తొలి మహిళా మంత్రి. దేశంలో మంత్రి పదవిని అధిష్టిం చిన తొలి ముస్లిం మహిళ కూడా ఆమెనే. హైదరాబాదీ అయిన మాసూమా బేగం చిన్నప్పట్నుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

మసూమా బేగం 1901, అక్టోబరు 7 న హైదరాబాదులో విద్యావంతుల కుటుంబంలో జన్మించారు.

ఆమెకు చిన్నతనం నుండి సంఘ సేవలో ఆసక్తి మెండుగా ఉండేది. మసూమా విద్యాభ్యాసం మహబూ బీయా బాలికల పాఠశాలలో జరిగింది. ఆమె 20 సంవత్సరాల వయసులో 1921లో తల్లి తయ్యబా బేగం మరణించడంతో, తల్లిచే స్థాపించబడిన “అంజుమన్ -ఏ – ఖవాతీన్” అనే జాతీయ మహిళా సంస్థకు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.1922లో ఆమె ఆక్స్‌ఫర్డులో విద్యను అభ్యసించి స్వదేశానికి తిరిగి వచ్చిన తమ కజిన్ హుసేన్ అలీఖాన్‌ను పెళ్ళి చేసు కున్నారు. అమె భర్త డాక్టర్ హుసేన్ ఆలీ ఖాన్ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఆంగ్ల శాఖా ధిపతిగా పనిచేశారు. 1927లో హైదరా బాదులో ఏర్పడిన అఖిల భారత మహిళా సంస్థ యొక్క ఆంధ్ర శాఖ కార్యదర్శిగా తరువాత అధ్యక్షురాలిగా పనిచేశారు.

తల్లి ద్వారా సరోజనీ నాయుడుతో పరిచయం కలిగిన పరిచయం చిరకాలం నిలిచి పోగా, ఆమె సాహచర్యంతో, 1928లో బొంబాయిలో తొలిసారిగా నిర్వహిం చిన అఖిల భారత మహిళా సదస్సులో ఆమె పాల్గొనడం జరిగింది.

హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1957లో జరిగిన తొలి ఎన్నికల్లో పత్తర్‌గట్టి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించారు. 1960 జనవరిలో రాష్ట్ర మలి ముఖ్య మంత్రి దామోదరం సంజీవ య్య ప్రభుత్వంలో మంత్రిగా చేరారు.

1962లో తిరిగి పత్తర్‌ఘట్టి నియోజకవర్గం నుండి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి సలావుద్దీన్ ఒవైసీ చేతిలో ఓటమి చవి చూశారు.

ప్రపంచంలో ద్వేషం, అసూయ నిర్మూలించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సంఘంలో ఆమె సభ్యురాలుగా ఉన్నారు.
మసూమా బేగం 1990, మార్చి 2 న హైదరాబాదులో మరణించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments