మాస శివరాత్రి ఎప్పుడంటే..
శివరాత్రిని శివయ్య, పార్వతీ తల్లి శక్తి సంగమ పండుగగా పరిగణిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ఈసారి మాస శివరాత్రి 17 మే 2023 రాత్రి 10:28 గంటల నుంచి మరుసటి రోజు అంటే 18 మే 2023 9:43 గంటల వరకు ఉంటుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం, ఉదయం మాస శివరాత్రి పూజలు శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పూజా విధానం..
మాస శివరాత్రి వేళ బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవాలి. అనంతరం ఇంటిని శుభ్రం చేసి, మీరు స్నానం చేయాలి.
మాస శివరాత్రి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి శివ కుటుంబాన్ని పూజించాలి. పరమేశ్వరుడికి నీరు, తేనే, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తదితర పదార్థాలతో పాటు శివ లింగానికి రుద్రాభిషేకంతో పూజలు చేయాలి. శివలంగంపై ధాతురా, బిల్వ పత్రాలను సమర్పించాలి. పూజా సమయంలో శివ స్తుతి శివ చాలీసా, శివ శ్లోకాలను పఠించాలి. మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండే వాళ్లు పాలను కూడా తీసుకోవచ్చు. మరుసటి రోజున నియమ నిబంధల మేరకు ఈశ్వరుడిని పూజించి, అవసరమైన వారికి దానం చేయాలి. ఆ తర్వాత ఉపవాసానని విరమించాలి.
Budhaditya Raja Yog నేటి నుంచి బుధాదిత్య రాజ యోగం.. ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు..!
3)
మాస శివరాత్రి ప్రాముఖ్యత..
హిందూ మతంలోని గ్రంథాలలో మాస శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఎవరైతే భక్తులు స్వచ్ఛమైన మనసుతో ఉపవాసం ఉంటారో.. ఎలాంటి కల్మషం మనసులో లేకుండా పూజిస్తారో.. అలాంటి వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాదు ఎంతో కాలంగా పెండింగులో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. అవివాహితులకు కోరుకున్న భాగస్వామితో కళ్యాణం జరుగుతుంది.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.
Read Latest Religion News and Telugu News
https://telugu.samayam.com/religion/articlelist/47120420.cms
https://telugu.samayam.com/