వనరుల కోసమే మణిపూర్‌ మారణకాండ –

Date:


– పౌరహక్కుల సంఘం స్పష్టీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సహజ వనరుల దోపిడీ కోసమే ప్రభుత్వాలు మణిపూర్‌లో మారణకాండను సృష్టిస్తున్నాయని పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ గడ్డం, ప్రధాన కార్యదర్శి ఎన్‌ నారాయణరావు, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు పీఎమ్‌ రాజు తెలిపారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) మణిపూర్‌ కొండ ప్రాంతాల్లో చేసిన సర్వేలో మలాకైట్‌, అజూరైట్‌, మాగెటెట్‌, నికెల్‌, కాపర్‌, ప్లాటినం గ్రూప్‌ ఎలిమెంట్స్‌, మెటల్స్‌ ఉన్నట్టు నివేదికలు ఇచ్చిందని తెలిపారు. వీటికోసం అక్కడి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొండ ప్రాంతాల్లోని ఆదివాసీలను ఖాళీ చేయించేందుకు తెగల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి, హింసను ప్రేరేపిస్తున్నాయని స్పష్టం చేశారు. మణిపూర్‌, మయన్మార్‌, థారులాండ్‌లను కలుపుతూ అంతర్జాతీయ బింస్టక్‌ హైవే ఇక్కడ వస్తున్నదనీ, మయన్మార్‌లోని ఓడరేవు అదానీకి చెందినదని విశ్లేషించారు. మణిపూర్‌ కొండ ప్రాంతాల్లోని సహజ వనరులను లూటీ చేసేందుకు అధికారపార్టీతో సన్నిహితంగా ఉండే ప్రయివేటు మైనింగ్‌ సంస్థలు అక్కడి హక్కుల కోసం ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. వెయ్యేండ్లుగా మణిపూర్‌ కొండ ప్రాంతాల్లో ఉంటున్న ఆదివాసీ తెగల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టడం కోసం, ప్రభుత్వాలే ఒక వర్గానికి ఆయుధాలను అందచేస్తున్నాయని విమర్శించారు. మణిపూర్‌లో సాయుధ బలగాల నుంచి 6వేల ఆయుధాలను ఆందోళనకారులు లాక్కున్నారని అక్కడి పోలీసులే నివేదికలు ఇచ్చారని చెప్పారు. రాజ్యహింసకు ఇంతకంటే ఉదాహరణ, దుర్మార్గం ఏమున్నాయని అన్నారు.
మణిపూర్‌ హింసతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసకబారింద న్నారు. కచ్చి తంగా ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలనీ, సిట్టింగ్‌ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో ఇంత జరుగు తున్నా జాతీయ మాన వహక్కుల కమిషన్‌ ఏంచేస్తు న్నదని ప్రశ్నించారు. తక్షణం ఈ దారుణాలపై జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్‌లో పర్యటించి, అక్కడ శాంతి నెలకొనేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
మోడీ మౌనం హింసను మరింత ప్రేరేపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య నిట్టనిలువుగా చీలిక తెస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
శిరీష అరెస్టు అక్రమం
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ సహచరి శిరీషను ఎన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేయడాన్ని మానవహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆమెతో పాటు కేవీపీఎస్‌ నేత దుడ్డు ప్రభాకర్‌, బెల్లాల పద్మ, దేవేందర్‌లను ఎన్‌ఐఏ పోలీసులు నిర్భంధించారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...