5.1 C
New York
Sunday, April 2, 2023
Homespecial Editionసాటిలేని మేటి సంపాదకులు చలపతిరావు

సాటిలేని మేటి సంపాదకులు చలపతిరావు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


మానికొండ చలపతిరావు (1908 -1983) పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త, మానవతా వాది. నిర్భయమైన, నిష్పాక్షికమైన
శక్తి వంత మైన, పాఠకులను ఎంతగానో ఆకట్టుకునే రచనలకు చలపతి రావు, భారత దేశం లోనే ఇంగ్లీష్ జర్నలిజంలో గొప్ప సంపాదకులుగా మిగిలి పోయారు. భారతదేశ ప్రభుత్వం ప్రెస్ కమిషన్ (Press Commission) ఏర్పాటు చేయడానికి ఆయనే ప్రధాన కారకులు.

మానికొండ చలపతి రావు1908 సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. బాల్యం నుండి ఆయన జర్నలిస్టు కావాలని అనుకోలేదు. అయితే వార్తా పత్రిక లను మొదటి నుండి చివరి వరకు ఆసాంతం ఇష్టంగా చదివే అలవాటు చేసుకున్నారు.

ఎం.ఏ., బి.ఎల్. పట్టాలను పొంది కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. ఆయన విశాఖ పట్నంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన “ఎథేనియం” అనే పేరుతో సాహిత్య సాంస్కృతిక సంస్థను నెలకొల్పి తాను కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత “పీపుల్స్ వాయిస్”, “వీక్ ఎండ్”, “హిందూస్థాన్ టైమ్స్” పత్రికలలో వేర్వేరు కాలాలలో సహాయ సంపాదకులుగా పనిచేశారు.

జవహర్‌లాల్ నెహ్రూ 1938 లో స్థాపించారు. జవహార్ లాల్ నెహ్రూ 1938 లో లక్నో నుండి ప్రారంభించిన “నేషనల్ హెరాల్డ్” దినపత్రికకు చలపతి రావు ను సహాయ సంపాదకునిగా నియమించారు. అయన చిత్తశుద్ధితో, అంకిత భావంతో, రాజీ లేని, ఒత్తిళ్ళకు లొంగని శక్తివంతమైన సంపాదకీయాలు, వ్యాసాలు రాశారు. దేశంలో కొద్దిమంది జర్నలిస్టులు అటువంటి శక్తితో వ్రాయ గలిగారు, అతి తక్కువ మంది ఆయన అనుసరించిన పదబంధాలను, భాషపై పట్టును కలిగి ఉండేవారు. నేషనల్ హెరాల్డ్ మూసి వేయడం ద్వారా ది హిందూస్తాన్ టైమ్స్‌లో అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేయడానికి ముందు స్వాతంత్ర్య పోరాటంలో ప్రెస్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

1946 లో అప్పటి ప్రభుత్వం మూసివేసిన తరువాత తిరిగి తెరిచినప్పుడు ఆయన నేషనల్ హెరాల్డ్ ఆఫ్ లక్నోకు సంపాదకులు అయ్యాడు. అదే పత్రికకు సంపాదకులుగా 1946 నుండి 1978 వరకు కొనసాగి నెహ్రూకు సన్నిహిత మిత్రుడై భారత దేశం లోని ప్రముఖ పత్రికా సంపాదకులుగా పేరుపొందారు.

శక్తివంతమైన సంపాదకీయాలు మరియు వ్యాసాలు రాశారు. దేశంలో కొద్దిమంది జర్నలిస్టులు మాత్రమే అటువంటి శక్తితో వ్రాయ గలిగారు, తక్కువ మంది ఆ పదబంధాన్ని కలిగి ఉండేవారు.

యునెస్కో ప్రెస్ నిపుణుల కమిటీలో సభ్యుడిగా పని చేశారు. ఆయన 1955 లో యుఎస్ ఎస్ఆర్, పోలాండ్ మరియు యుగోస్లేవియాలో పర్యటించిన జవహర్ లాల్ నెహ్రూతో కలిసి వచ్చిన ఇండియన్ ప్రెస్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. 1958 లో, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించారు. చలపతి రావు ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఇనిషియేటింగ్ కమిటీ సభ్యులు కూడా.

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (Indian Fedration of Working Journalists) అనే సంస్థను వ్యవస్థీకరించి దానికి మొదటి అధ్యక్షులై, ఆ సంస్థను 1950 నుండి 1955 వరకు ట్రేడ్ యూనియన్ పద్ధతిలో నడిపి దేశంలోని పత్రికా రచయితలకు మేలైన స్థితిగతులను కల్పించ డానికి ఎంతగానో పాటు పడ్డారు.1952 లో చైనాకు భారత ప్రభుత్వ గుడ్విల్ మిషన్ సభ్యులు.

ఆయన జవహర్ లాల్ నెహ్రూ, గోవింద వల్లభ పంత్ ల జీవిత్ర చరిత్రలను ఆంగ్లంలో రచించారు. ది ప్రెస్ ఇన్ ఇండియా (The Press in India) అనేది ఆయన ప్రసిద్ధిచెందిన గ్రంథం.
ఆయన1983 మార్చి 25 తేదీన పరమ పదించారు.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments