Homespecial Editionబ్రిటీష్ పాలకుల ఆజ్ఞలను ధిక్కరించిన తొలి సైనికుడు మంగళ్ పాండే

బ్రిటీష్ పాలకుల ఆజ్ఞలను ధిక్కరించిన తొలి సైనికుడు మంగళ్ పాండే

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


బ్రిటిష్ రాచరిక నిరంకుశ పాలనను, పక్షపాత ధోరణిని, పంటి బిగువున భరిస్తూ, ఎదురించలేక, తలవంచుకుని బానిసలుగా బతుకుతున్న భారతీయుల నిస్సత్తువకు నూతన శక్తిని ప్రసాదించి, ఆలోచనలను స్వేచ్ఛాస్వాతంత్ర్యాల వైపుకు మళ్లించిన స్వేచ్చా ప్రియుడు మంగళ్ పాండే. మూడు పదుల వయసు చూడ కుండానే ప్రాణ త్యాగానికి సిద్ధపడి, ఉరి కంబాన్ని ముద్దాడిన యువ కిషోరం పాండే.1857 నాటికి యావద్భారతాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్న బ్రిటీష్ పాలకుల ఆజ్ఞలను ధిక్కరించి . ఆ కొసలో సిపాయిల తిరుగుబాటుగా చరిత్ర పుటల్లో నిలిచిన. ప్రప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంకు బీజం వేసి, ధిక్కార స్వరాన్ని వినిపించి, సంగ్రామానికి మీసాన్ని మెలితిప్పి, చావు తప్పదని తెలిసి, మొక్కవోని ధైర్య సాహసాలను ప్రదర్శించి, భారత జాతికి మార్గదర్శకునిగా నిలిచిన మేరు నగ ధీరుడు మంగళ్ పాండే.
1857, మార్చి 29… భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మరచి పోలేని దినం. ప్రాణాలను పణం గా పెట్టి, బ్రిటీష్ పాలకుల ఆజ్ఞలను ధిక్కరించిన తొలి సైనికుడుగా మంగళ్ పాండే చరిత్ర పుటల్లో చేరిన రోజు.
బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రీ లో ఒక సాధారణ సిపాయిగా పనిచేసిన మంగళ్ పాండే 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటాని నాంది పలికాడు.

1827, జూలై 19న ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా నాగ్వ గ్రామంలో జన్మించి, 34 వ బ్రిటిష్ బెటాలియన్ లో పనిచేసిన అతిచిన్న వయస్సు గల బ్రాహ్మణ యువకుడు మంగళ్ పాండే, తూటాని వినియోగించేది లేదని తేల్చి చెప్పేశాడు. దూషణకు దిగిన సైనికాధికారి లెప్టినెంట్ బాగ్‌ని మంగళ పాండే కాల్చి చంపేశాడు. దీంతో క్రమశిక్షణ చర్యల కింద పాండేని ఆంగ్లేయులు ఉరి తీశారు.
అలా 1857, మార్చి 29న కలకత్తాలో బ్రిటీష్ సార్జెంట్ పై మంగళ్ పాండే దాడిచేయడంతో సిపాయిల తిరుగుబాటుకు నాంది పలికింది.
భారతీయుల్లో బానిసత్వ భావాన్ని పారద్రోలుతూ.. స్వాతంత్య్ర కాంక్షని ఉవ్వెత్తున రగిలించిన తొలి ఉద్యమం 1857 సిపాయిల తిరుగుబాటు. అప్పటి వరకు బ్రిటీష్ పాలకుల అజమాయిషీని భరిస్తూ, సామాజిక వివక్ష, లెక్కలేనన్ని అవమానాలు, అంగీకరించలేని స్థాయిలో అసమానతలను సైతం పంటిబిగువన భరిస్తూ వచ్చిన భారతీయ సిపాయిలు.. చివరికి తమ మనోభావాలను దెబ్బతీసేందుకు బ్రిటీషర్లు ప్రయత్నించడంతో తిరగబడ్డారు. ఈ తిరుగుబాటు భారతదేశ స్వాతంత్య్ర పోరాట గతి రీతినే సమూలంగా మార్చేసింది. బ్రిటిష్ పాలకుల పక్షపాతం సిపాయిల్లో తిరుగుబాటు జ్వాల రగిలించింది. 1856లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన జనరల్ బ్రిటీష్ ఎన్‌లిస్ట్‌మెంట్ యాక్ట్ ప్రకారం సిపాయిలు బ్రిటీష్ పాలనలోని ఏ దేశంలోనైనా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతో కొంతమంది హిందువులు ఈ యాక్ట్‌పై నిరసన తెలిపారు. అలాగే 1856లోనే రాయల్ కంపెనీ ఎన్‌ఫీల్డ్ తుపాకుల్ని సైన్యంలోకి ప్రవేశ పెట్టింది. వీటిల్లో వినియోగించే తూటాలను సిపాయిలు నోటితో కొరికి అమర్చాల్సి ఉండేది. కానీ.. ఈ కొరకాల్సిన భాగంలో ఆవు, పంది కొవ్వుని పూశారనే వదంతి అంతటా వ్యాపించింది. దీంతో ఆవును పవిత్రంగా భావించే హిందువులతో పాటు.. పందిని అపవిత్రంగా భావించే ముస్లింలు ఈ తుపాకుల వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫిబ్రవరి 26, 1857న ప్రయోగాత్మకంగా తుపాకుల్ని పరీక్షించాలని బ్రిటీషర్లు ఆదేశించగా.. బారక్‌పూర్‌లోని 19వ దళం సిపాయిలు వ్యతిరేకించారు. దీంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
సిపాయిల తిరుగుబాటు
అనంతరం 1857, మార్చి 29న అదే బారక్‌పూర్‌లోని 34వ పటాలానికి చెందిన మంగళ పాండే తూటాని వినియోగించేది లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో అతనిపై దూషణకి దిగిన సైనికాధికారి లెప్టినెంట్ బాగ్‌ని మంగళ పాండే కాల్చి చంపేశాడు. దీంతో క్రమశిక్షణ చర్యల కింద పాండేని ఆంగ్లేయులు ఉరి తీశారు. అనంతరం 19, 34 పటాలాలను రద్దు చేశారు. అయితే.. ఈ తిరుగుబాటు దావానంలా దేశం మొత్తం వ్యాపించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సిపాయిలు ఆ తూటాలను వినియోగించేందుకు నిరాకరించారు. దీంతో వారిని ఉద్యోగాల్లోంచి తీసేసి.. పదేళ్లు జైలు శిక్ష విధించారు.

పాండే తిరుగుబాటు స్ఫూర్తితో.. ఢిల్లీ చేరిన సిపాయిలు భక్తఖాన్ ఆధ్వర్యంలో ఎర్రకోటలో ప్రవేశించి.. బహదూర్ షాని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించి ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. కాన్పూర్‌లోనూ నానాసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు ప్రారంభమైంది. కానీ.. సరైన దిశా నిర్దేశం లేకపోవడంతో
ఈ తిరుగుబాటు నీరు గారిపోయింది. బహదూర్‌ షాని బ్రిటీషర్లు అదుపులోకి తీసుకుని రంగూన్ జైలుకి తరలించడంతో ఉద్యమం గతి తప్పింది. నానాసాహెబ్ నేపాల్ పారిపోయాడు. బ్రిటీషర్లు అప్పట్లో పైచేయి సాధించినా.. ఈ సిపాయిల తిరుగుబాటు మాత్రం స్వాతంత్య్ర పోరాటంలో చెరగని ముద్ర వేసిన తొలి పోరాటంగా భారతీయుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఆధునిక భారతదేశంలో పాండేను హీరోగా విస్తృతంగా పరిగణిస్తారు. ఆయనను గౌరవించటానికి 1984 సంవత్సరంలో భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను జారీ చేసింది.

హిందీ చిత్రం ‘మంగల్ పాండే: ది రైజింగ్’ మరియు 2005 లో ‘ది రోటీ తిరుగుబాటు’ అనే రంగస్థల నాటకంతో సహా అనేక సినిమాలు మరియు రంగస్థల నాటకాలు అతని జీవితంపై ఆధారపడి ఉన్నాయి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments