గల్ఫ్ కార్మికులు కుటుంబంతో జీవించే హక్కును అమలు చేయాలి

Date:

గల్ఫ్ కార్మికులు స్వదేశంలో కుటుంబంతో జీవించే హక్కును కాపాడాలని గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి కోరారు.
వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న బహుళ దేశాల ప్రాంతీయ సమావేశంలో గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి కి రియాక్టర్ (విషయంపై పరిజ్ఞానం కలిగి చర్చపై ప్రతిస్పందించే వ్యక్తి) గా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒకనెల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఉద్యోగ ఒప్పందాలలో ఉన్నప్పటికీ అమలు కావడం లేదన్నారు. అంతర్జాతీయ వలస కార్మికులకు ఆన్ లైన్ ఓటింగ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉన్నదని వచ్చే సంవత్సరం భారత్, ఇండోనేషియా, బాంగ్లాదేశ్ లలో జరిగే జాతీయ ఎన్నికలలో ప్రవాసుల ప్రభావం ఉంటుందని భీంరెడ్డి అన్నారు.

ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా అనే సంస్థ నిర్వహించిన ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆసియా, గల్ఫ్ మధ్యప్రాచ్య దేశాల ప్రతినిధుల సమావేశాన్ని ఈనెల 24, 25 రెండు రోజులు పాటు జరిగింది. లెబనాన్ రాజధాని బీరుట్ లో ఉన్న అరబ్ దేశాల ఐఎల్ఓ (అంతర్జాతీయ కార్మిక సంఘం) ప్రాంతీయ కార్యాలయం సోషల్ ప్రొటెక్షన్ టెక్నికల్ ఆఫీసర్ డా. లియాబూ కాటర్ వలస కార్మికుల సామాజిక రక్షణ (సోషల్ ప్రొటెక్షన్), సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ), విశ్వవ్యాప్త సామాజిక రక్షణ అంతస్తులు (యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ ప్లోర్స్) అంటే ఏమిటి? ఎందుకు? అనే విషయంపై వివరణాత్మకంగా ప్రసంగించారు. డా. రేణు అధికారి (నేపాల్), ఫిష్ ఐపి (ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్), విలియమ్స్ (ఫిలిప్పీన్స్) లు వివిధ దేశాలలో ఉన్న సామాజిక రక్షణ పథకాల గురించి వివరించారు.

రామకిష్టయ్య సంగనభట్ల... 9440595494
రామకిష్టయ్య సంగనభట్ల… 9440595494

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...