Monday, August 15, 2022
HomeLifestyleLife styleసూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాత మహీపతి సూర్యారావు

సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాత మహీపతి సూర్యారావు


రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు పిఠాపురం సంస్థానా న్ని పరిపాలించిన వారిలో చివరి వాడు. సాహిత్య చక్రవర్తి, కళా ప్రపూర్ణ, సాహిత్య పోషకులు, డాక్టర్ రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహద్దర్ 1907-1948 పిఠాపురం సంస్థానా ధీదులుగా ప్రసిద్ధులు. ఆయన 1885, అక్టోబర్, 5 న మంగాయ మ్మ, రావు వేంకట మహీపతి గంగాధర రామారావు దంపతులకు జన్మించాడు. ఐదు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి తండ్రి మరణించాడు. అప్పుడు గంగాధర రామారావు దత్తపుత్రుడు వారసు డు కాడని, రాజ్యాధికారం తనదే అని కోర్టుకు ఎక్కాడు. ఈ వ్యాజ్యం ఎక్కువ రోజులు నడిచి చివరకు విజయలక్ష్మి ఆయననే వరించింది. ఈ వ్యాజ్యం కోర్టులో ఉన్నంత కాలం, అనంతరం ఆయన మైనారి టీ తీరేవరకు ఈ సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉంది. ఈ సమయంలో ఆయన మద్రాసు లోని న్యూయింగ్టన్ కళాశాలలో ఉండి విద్యాభ్యాసం చేశాడు. ఈ సమయంలోనే సంస్కృతం, తెలు గు, కన్నడం, తమిళం, ఆంగ్ల భాష లను నేర్చుకుని ఈ ఐదు భాషలలో ఉత్తమ గ్రంథాలను పఠించాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో కవిత్వం చెప్పగలిగే నేర్పును సంపా దించాడు. తర్వాత నూజివీడు సంస్థానాధిపతియైన రాజా వెంకట రంగయ్యప్పారావు ప్రథమ పుత్రిక అయిన ఆండాళమ్మను 1906, ఏప్రిల్ 2 న వివాహం చేసు కున్నాడు. వంశాచారమును బట్టి ఆండాళమ్మ అత్తింటికి వచ్చిన వెంటనే చిన్నమాంబా దేవిగా తన పేరును మార్చుకున్నది. తర్వాత 1907, ఫిబ్రవరి 19 న పిఠాపురం సంస్థానపు సింహాసనాన్ని అధిష్టిం చాడు. 1948లో సంస్థానాలు, జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు ఇతడు పిఠాపురం మహారాజుగా వెలుగొందాడు. ఆయనకు చిన్న మాంబా దేవి ద్వారా మొదట 1910లో గంగాధర రామారావు అనే పుత్రుడు జన్మించాడు. తర్వాత వారికి సూర్యారావు అనే కుమారుడు, మంగయమ్మ, భావ యమ్మ, సీతాదేవి, కమలాదేవి అనే కుమార్తెలు కలిగారు. ఆయన కుమార్తె సీతాదేవి బరోడా సంస్థాన పు మహారాణి అయ్యింది. రాజా సూర్యారావు గారు 79 సంవత్స రాలు జీవించి 1964, మార్చి 6 వ తేదీన మరణించాడు.
ఆయన తన తండ్రిచేత స్థాపించ బడిన పిఠాపురం హైస్కూలు, కాకినాడ కాలేజీలను అమితమైన ధనం వెచ్చించి అభివృద్ధి చేసి దక్షిణ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి విద్యాసంస్థలు మరొకటి లేదని పించాడు. కాకినాడ కాలేజీని ఫస్ట్ గ్రేడ్‌గా ఉద్ధరించి ఎన్నో భవనాలను కట్టించాడు. ఆ కాలేజీలో చదివే స్త్రీలకు, పేద విద్యార్థులకు ఉచితం గా చదువు చెప్పాడు. అంతే కాకుండా పట్టభద్రులై విదేశాలకు వెళ్లి, ఉన్నతవిద్య పొందగోరే వారికి సంపూర్ణ ధనసహాయం చేశాడు. పిఠాపురం హైస్కూలులో హరిజన విద్యార్థినీ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని నెలకొల్పి దానికయ్యే వ్యయాన్ని అంతా తానే భరించా డు. వారికి ప్రైవేటు టీచర్లను కూడా ఏర్పరిచి అనేకమందిని వృద్ధిలోనికి తీసుకు వచ్చాడు. రాజమండ్రి లోని వీరేశలింగోన్నత పాఠశాల ఆయన పోషణతోనే నడిచింది. రఘుపతి వేంకటరత్నం నాయుడు ప్రేరణతో కాకినాడలో బ్రహ్మసమాజ ప్రార్థనా మందిరాన్ని, అనాథ శరణాల యాన్ని ఏర్పాటు చేశాడు. రాణీ చిన్నమాంబాదేవి కోరికపై కాకినాడ లేడీస్ క్లబ్‌కు 40 ఎకరాల స్థలాన్ని ఇచ్చాడు. రాణీ ఆధ్వర్యంలో పిఠా పురంలో ఘోషా స్కూలును నడిపాడు. 1920 ప్రాంతములో విశ్వకవి రవీంద్రనాథ టాగూరు పిఠాపురం సందర్శించి నప్పుడు ఇతడు సుమారు లక్షరూపాయలు పారితోషికంగా ఇచ్చాడు. ప్రాచ్య, పాశ్చాత్య విద్యలను సమదృష్టితో గౌరవించి వాటి అభివృద్ధికై ఎంతో ధనాన్ని వెచ్చించాడు. ఆయన ఔదార్యము తోనే తెలుగు దేశము లోని ఆనాటి ప్రతి సాహిత్య సంస్థ అభివృద్ధిని చెందింది. ఆంధ్ర భాషాభివర్ధినీ సమాజము, విజ్ఞాన చంద్రికా మండలి, ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాలలకు విశేషమైన ధన సహాయం చేశాడు. జయంతి రామయ్య స్థాపించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రోత్సహించి సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణానికి కారకుడైనాడు. అంతే కాకుండా ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిషత్తు ద్వారా లక్షల రూపాయలు వెచ్చించి ముద్రించారు. ఆయన సాహిత్య ప్రపంచానికి చేసిన సేవ అంతా ఒక ఎత్తు, సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణానికి, ప్రచురణకు పాటుపడటం ఒక ఎత్తు. 1911, మే 12 న జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో జయంతి రామయ్య పంతులు నిఘంటు నిర్మాణానికి చేసిన ప్రతిపాదన విని, ఆ నిఘంటు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం భరించడానికి సంసిద్ధుడైనాడు. ఆ ప్రకటనకు సభలోని వారంతా ఆనంద పడ్డారు. జయంతి రామయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన నిఘంటువుకు “శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు” అని నామకరణం చేశారు. ఈ నిఘంటు నిర్మాణానికి కాశీభట్ట సుబ్బయ్య శాస్త్రి, తంజనగరము తేవప్పెరు మాళ్ళయ్య, పురాణపండ మల్లయ్య శాస్త్రి, పేరి పాపయ్య శాస్త్రి, శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి, కూచి నరసింహం, చర్ల నారాయణ శాస్త్రి, పిశుపాటి చిదంబర శాస్త్రి, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి, దర్భా సర్వేశ్వర శాస్త్రి, పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి, ప్రయాగ వేంకటరామ శాస్త్రి, అమలాపురపు విశ్వేశ్వర శాస్త్రి, బులుసు వేంకటే శ్వర్లు, చిలుకూరి వీరభద్ర శాస్త్రి, దువ్వూరి సూర్యనారాయణ శాస్త్రి, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, చెఱుకుపల్లి అప్పారాయ శాస్త్రి, ఇంద్రగంటి సూర్య నారాయణ శాస్త్రి, చిలుకూరి విశ్వనాథ శాస్త్రి, ఆకుండి వేంకట శాస్త్రి, ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి, పాలెపు వెంకటరత్నం, సామవేదం శ్రీరామమూర్తి శాస్త్రి, పన్నాల వేంకటాద్రిభట్ట శర్మ, దివాకర్ల వేంకటావధాని మొదలైన పండితులు పాటుపడ్డారు.
పిఠాపుర సంస్థాన చరిత్రలో రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు కాలం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఆయన సంస్థానం లో ఆస్థాన పండితులుగా శ్రీపాద లక్ష్మీనరసింహ శాస్త్రి (తర్కశాస్త్రం), తాతా సుబ్బరాయ శాస్త్రి (వ్యాకరణం), చిలుకూరి నారాయణ శాస్త్రి, వేదుల సూర్యనారాయణ శాస్త్రి, గుదిమెళ్ల వేంకట రంగాచార్యులు (విశిష్టాద్వైతము), వడలి లక్ష్మీనారాయణ శాస్త్రి (వేదం), దెందుకూరి నరసింహ శాస్త్రి (వేదాంతం), తుమురాడ సంగమేశ్వర శాస్త్రి (సంగీతం) మొదలైన దిగ్దంతులు ఉండేవారు. ఈ పండితుల సహకారంతో ఆయన ప్రతి యేటా పీఠికాపుర సంస్థాన విద్వత్పరీక్షల పేరుతో విజయ దశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంలో శాస్త్ర పరీక్షలు నిర్వ హించి, ఉత్తీర్ణులైన వారిని కానుకల తో సత్కరించేవాడు. ప్రబంధ రచనలో కూడా పోటీలు నిర్వహించే వాడు. ఆనాటి సుప్రసిద్ధ పండితులు ఎందరో ఈ పరీక్షలలో బహూకృతులైనవారే. పానుగంటి లక్ష్మీనరసింహారావు, వేంకట రామకృష్ణ కవులు ఆయన ఆస్థాన కవులుగా ఉన్నారు. వీరు కాక చిలకమర్తి లక్ష్మీనరసింహం, కందుకూరి వీరేశలింగం, టేకుమళ్ళ అచ్యుత రావు, దేవగుప్తాపు భరద్వాజము, పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి, శొంఠి భద్రాద్రి రామ శాస్త్రి, వేంకట పార్వతీశ కవులు, దాసరి లక్ష్మణకవి, వేదుల రామచంద్రకీర్తి, శ్రీరాం వీరబ్రహ్మకవి, మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి, కూచి నరసింహము, నడకు దుటి వీరరాజు మొదలైన ఎందరో కవులు ఆయన చేత సన్మాన సత్కారాలనుఅందు కున్నారు. 1929, జనవరి 29 న మద్రాసు గవర్నరు వెల్లింగ్‌టన్ ప్రభువు ఆయనకు మహారాజా అనే బిరుదును ఇచ్చి గౌరవించాడు.1938, అక్టోబరు 1 వ తేదీన ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు గౌరవ డి.లిట్. పట్టాను ప్రదానం చేశారు.1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. రాజా సూర్యారావు గారు 79 సంవత్సరాలు జీవించి 1964, మార్చి 6 వ తేదీన మరణించాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments