జాను చిత్రంతో రీసెంట్ గా సూపర్ హిట్ ను అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఇక శర్వానంద్ తదుపరి చిత్రం శ్రీకారం టీజర్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ చిత్ర టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ లో నటించి అందరినీ మెప్పించిన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో సీనియర్ నటి ఆమని,నరేష్,మురళీ శర్మ,సాయి కుమార్,రావు రమేష్,సప్తగిరి,సత్య తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట,గోపి ఆచంట నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి,కిషోర్ బి దర్శకత్వం వహిస్తున్నారు.మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్న
ఈ చిత్రంలోని పాట విడుదలైన రోజు నుండే ప్రేక్షకుల ఫేవరేట్ గా మారింది.మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం
ఏ మేర సినీ అభిమానులను మెప్పిస్తుందో వేచి చడాల్సివుంది.