హైందవ సాంప్రదాయంను అనుసరించి ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువులో ఉంటాయి. సంవ త్సరంలో పదవ మాసమూ, హేమంత రుతువులోని రెండో మాసమూ అయిన పుష్యం తెలుగు వారికి శూన్యమాసం. సంవత్స రంలోని నాలుగవ మాసమూ, గ్రీష్మ రుతువులోని రెండవ మాసమూ అయిన ఆషాఢం కూడా తెలుగు వారికి శూన్య మాసమే. శూన్య మాసాలు శుభ శోభనాలకు పనికిరానివి. ఒక సంవత్సరం చివరి పాదంలో వచ్చే పుష్య మాసానికి, మరు సంవత్సరం రెండవ పాదంలో వచ్చే ఆషాఢానికీ మధ్య ఆయిదు మాసాల తేడా ఉంటుంది. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం లకు “మాఘాది పంచకం” అని పేరు. ఇవి శుభకార్యాలకు అనుకూల కాలం. వాన, చలి అంతగా ఉండక, వస్త్ర గృహ సమస్య ఇబ్బంది కలిగించక, ధాన్యలక్ష్మి ఆరు బయట విరివిగా మసలే కాలమిది. శాక పాకాలు సమృద్ధిగా, అనుకూలంగా ఉండే మాస పంచకానికి తొలిమాసం మాఘం. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘ మాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించే వారు. మాఘమాసం మహిమ అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థం. ఈ మఘాధి పత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘ మాసమైంది. సంవత్సరంలో పదకొండవ మాసమైన మాఘంలో గృహ నిర్మాణాలు ఆరంభిస్తే సంపత్తి కలుగగలదని మత్స్య పురాణం స్పష్ట పరుస్తున్నది. మాఘ మాసపు ఆదివారాలు మహిమాన్వితాలు. ఈ రోజులలో సూర్యపూజ చేసిన వారికి ఆరోగ్య, భోగ భాగ్యాలు కలుగుతాయని పద్మ పురాణా ధారం. కార్తీకంలో “దీపానికి” ఎంత ప్రాధాన్యత ఉందో, మాఘ మాసంలో “స్నానానికి” అంత ప్రాముఖ్య ఉంది. మకర లగ్నంలో సూర్య భగవానుడు ఉండే సమయాన స్నానం ఫలితం కోటి జన్మాల పుణ్య కార్యాలతో లభ్యం కానిదని చెపుతారు. మాఘస్నాన మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని నిర్ణయ సింధులో పేర్కొన బడింది.
మాఘమాసంలో ఉషఃకాల స్నానం పుణ్యప్రదం. సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరు తాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. సూర్యుడు మకర రాశిగతుడు అయినప్పటి నుండి ప్రాతఃకాల స్నానాలు తప్పక చేయాలి. మాఘ మాసంలో ఉషఃకాల సమయాన నదులలో, చెరువులలో, మడుగులలో, కొలను లలో, తుదకు బావులలో స్నానం చేస్తే ప్రయాగ స్నాన ఫలితం దక్కుతుంది.
మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసిన
స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని చెబుతుంటారు. బావి నీటి స్నానం పన్నెండేళ్ల పుణ్య ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శత గుణం, గంగా స్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శత గుణ ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం మాఘ మాసములో నదీస్నానము చేసి, శ్రీమన్నారాయణుని పూజిం చి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైననూ గంగానదితో సమానం.
”గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ – నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు”.
గంగ, గోదావరి, కావేరి లాంటి పవిత్ర నదులను తలుచుకుని, పుణ్య స్నానం ఆచరించాలి. సూర్యుడికి అర్హ్యం ప్రదానం చేయాలి. అశక్తత చేత నిర్ణీత సమయ మందు స్నానం చేయ జాలని వారు పొద్దు పొడిచిన జాములోగా చేయాలి. చలికి వెరవ కయే, మంచు ఆవరించి ఉన్న నదీ జలాలలో, స్నానం శ్రేష్ఠమని పురా ణాలు ఘోషిస్తున్నాయి. స్నానానం తరం శివాలయాలకు వెళ్ళి, నువ్వు ల నూనెతో దీపాలు వెలిగిస్తే సకల దోష పరిహారం కాలదనే విశ్వాసం. మాఘమాస అరుణోదయ స్నానం, అరుణోదయ దీపారాధనం, తిల దానం, తిల భక్షణం ఉత్కృష్ట మైనవి.