“వివాహ భోజనంబు వింతైన వంటకంబు, వియ్యాల వారి విందు, ఒహ్హోహ్హో నాకే ముందు” అనే అలనాటి మల్టీ స్టారర్ చిత్రరాజం మాయా బజార్ చిత్రంలోని పాటను వినని తెలుగు వారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఆ పాట గుర్తుకు రాగానే వెను వెంటనే కళ్ళ ముందు కదలాడతూనే రూపం ఎస్వీ రంగారావు ది. ఆ వెంటనే స్ఫురణకు వచ్చేది మాధవపెద్ది గాత్రమే. ఎస్వీఆర్ నటనకు జీవం పోసిన నేపథ్య గాయకుడు మాధవ పెద్ది. అంతేకాదు, దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు ఇలా ప్రతినాయక పాత్రలకు నేపథ్య గానం ఆయనదే. ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి లాంటి నాయకే తర నటుల నటనలతో ఆయన గొంతు మమేకం అయింది. మాధవ పెద్దిది సుస్వరం.
వివాహ భోజనంబు’ అని తిను బండారాల గురించి వర్ణించినా, సరదా సరదా సిగరెట్టు’ అని ధూమ పానం అనర్థాల గురించి హెచ్చరిం చినా, అయయో జేబులో డబ్బులు పోయెనే’ అంటూ పేకాట గురించి వాపోయినా, భళి భళి భళి భళి’ దేవా అంటూ తత్త్వాన్ని బోధించినా, భలేచాన్సులే’ అంటూ ఇల్లరికంలో ఉన్న మజాను తెలిపినా, మాధవ పెద్ది సుస్పష్ట స్వరం చెవులలో ఇంపుగా వినిపిస్తుంది. అపస్వరమే తెలియని గాయకుడు మా బాబాయ్’ అని మాధవపెద్ది గురించి గాన గంధర్వుడు ఎస్పీ. బాలు అంటుండే వారు.
మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 – డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకు డు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయా ళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
సత్యం 1922, మార్చి 11 న బాపట్ల సమీపాన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో మాధవపెద్ది లక్ష్మీ నరస య్య, సుందరమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి రంగస్థల నాటకా లలో నటించేవాడు. తెలుగు రంగ స్థలముపై మల్లాది సూర్య నారాయ ణ నాటక బృందములో సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ పేరు తెచ్చుకున్నాడు. ఆయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి మాధవపెద్దిని తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగ జేశాడు. ఆయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఆ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్రర పాటలు తనే స్వయంగా పాడాడు. మాధవపెద్ది సత్యం షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగు పెట్టా డు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం ప్రధానంగా గాయకుడే. ఆయన ఆనాటి ప్రసిద్ధ సంగీత దర్శకులైన సాలూరు రాజేశ్వర రావు, ఘంటసాల వెంకటేశ్వర రావు తదితరు లందరితో పనిచేశాడు. ఎస్వీ రంగారావు, రేలంగి వెంకట రాయ య్య పాటలన్నీ దాదాపు ఆయనే పాడాడు. పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో పేరెన్నిక గన్నాడు. ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం జొడి కలిసి పాడిన పాటలు తెలుగు వారి నొళ్ళలో ఇప్పటికి నానుతూనే ఉన్నాయి.75 ఏళ్ళ వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంకురాతిరి పండ గొచ్చెరో పాటపాడి పలువురి ప్రశంసలందు కున్నాడు.
ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది. రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది.
పద్యం ఆయన గళంలో వయ్యారా లు ఒలికించు కుంది. పాట ఆయన గొంతులో ఒదిగి పోయింది. పాడు తున్నది పాత్రలేమో, పాత్రదారు లేమో అనిపించేలా పాత్రలలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుంది. ఆయన పద్యంలో భావం తొణికిస లాడుతుంది. ఆయన పాటలో రాగం అలవోకగా అమరి పోతుంది. ఆయన కంఠంలో గాంభీర్యం నాట్య మాడుతుంది. ఆయన కంఠంలో హాస్యం గిలి గింతలు పెడుతుంది.
తనకు వచ్చిన గౌరవ పురస్కారా లను ఎప్పుడూ ప్రదర్శించు కోలేదు. కారు కూడా ఎక్కేవారు కాదు. రైలు లో సెకండ్ క్లాసులోనే ప్రయాణించే వాడు.
మాయాబజార్‌లో నాన్న పాడిన ‘వివాహ భోజనంబు’ పాట ‘సాంగ్ ఆఫ్ ద మిలీనియమ్’గా ఎంపికయినా ఏ మాత్రం గర్వించ లేదు. ఆయన సినిమా పరిశ్రమలో యాభై ఏళ్లకు పైగా ఉన్నప్పటికీ విజిటింగ్ కార్డు కూడా ఉండేది కాదు .
ఆయన 78 సంవత్సరాల వయసు లో 2000, డిసెంబర్ 18న చెన్నైలో అస్వస్థతతో మరణించాడు.
ఆయన కుమారుడు, కూచిపూడి నృత్య కోవిదుడు మాధవపెద్ది మూర్తి తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం ‘ మాధవపెద్ది సత్యం అవార్డు, మాధవపెద్ది ప్రభావతి అవార్డును ‘ నెలకొల్పారు. ఆ పురస్కారం అందుకొన్న వారిలో ఎం. ఎస్. విశ్వనాథన్, పి. బి. శ్రీనివాస్ లాంటి ప్రముఖులున్నారు.
పాత్రలలో మాధవపెద్ది స్వరం పరకాయ ప్రవేశం
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES