Wednesday, November 30, 2022
HomeNewsబ్రిటిష్ పాలకులపై గర్జించిన పంజాబ్ కేసరి

బ్రిటిష్ పాలకులపై గర్జించిన పంజాబ్ కేసరి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

లాలా లజపతిరాయ్ జీవితం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలు రాయి. ఆనాటి భారతీయులను ఎందరినో ఆయన భావాలు, త్యాగాలు ప్రభావితం చేశాయి. ఆయన పిలుపు దేశ ప్రజల గుండెలలో మారుమోగి, లక్షలాది మంది భారతీయులు స్వాతంత్య్ర ఉద్యమంలోకి దిగి, ఆ మహా యజ్ఞంలో సమిధలు కావడానికి ప్రేరణ కలిగించింది. కోట్లాది ప్రజలకు ఆరాధ్య దేవునిగా లాలాజీ పూజలు అందుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. ‘నేను మరణించవచ్చు, కాని నానుండి వెలువడే ప్రతి నెత్తురు చుక్క నుండి లక్షలాది స్వాతంత్య్ర సమరయోధులు ఉద్భవిస్తారు’ అని ప్రకటించారు. లాలా మాట నిజం అయింది. అయన మరణానంతరం స్వాతంత్య్రోద్యమం మరింతగా విస్తృతం అవుతుందని తెలిసిన భవిష్యత్‌ దర్శకుని జీవితం భారతీయులకు స్పూర్తిదాయకం. స్వదేశీ ఉద్యమం, ఆర్య సమాజాన్ని, అతివాద రాజకీయాలను సమన్వయ పరచిన భారత జాతీయ అగ్ర నాయకులలో లాలా లజపతిరాయ్ ఒకరు. ఒకే భావాలు కలిగిన స్వాతంత్ర్య సమర యోధులైన లాలా లజపత్ రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్ లను “లాల్ బాల్ పాల్” అని పిలిచే వారు.
లాలా లజపత్ రాయ్ (జనవరి 28, 1865 – నవంబరు17, 1928) పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో జన్మించారు. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకరిగా చిరస్థాయిగా నిలిచి పోయారు. ఆయన “పంజాబ్ కేసరి” బితుదాంచితులు అయినారు. అయన పంజాబ్ నేషనల్ బ్యాంకు, మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు. లాహోర్‌లో న్యాయవిద్య అభ్యసిస్తున్నప్పుడు స్వాతంత్ర్యోద్యమం వైపు దృష్టి సారించారు. అదే సమయంలో స్వామి దయానంద సరస్వతి భావాలవైపు మొగ్గు చూపారు. 1877లో లాగోర్ ఆర్యసమాజ్ సభ్యుడిగా ఉంటూనే ఆర్య గెజిట్‌కు సంపాదకత్వం వహించారు.
1888, 1889 లలో జరిగిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలలో ఆయన ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆ తర్వాత 1892లో హైకోర్టులో న్యాయవాదిగా లాహోర్ కు వెళ్లారు. 1885వ సంవత్సరంలో ఒక ప్రభుత్వ కళాశాల నుండి రెండవ తరగతి న్యాయవాద పరీక్షలో ఉత్తీర్ణులై హిస్సార్ లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. ఆ తర్వాత 1892లో లాహోర్ కు మకాం మార్చారు. భారత జాతీయ కాంగ్రెస్ లోని ప్రముఖ నాయకులలో లాలా లజపతిరాయ్ ఒకరిగా గుర్తింపు పొందారు. ‘స్వేచ్ఛ అనేది అభ్యర్థించడం నుంచి రాదు, కానీ అది పోరాడాలి’ అనే బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ ల అభిప్రాయాలతో ఆయన ఏకీభవించారు. అలా
భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రవేశించి 1920లో కలకత్తాలో జరిగిన ప్రత్యేక సమావేశానికి అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1921లో “సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటి” పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. జాతీయోద్యమంలో “పంజాబ్ కేసరి”గా పేరు పొందారు. “ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి” అంటుండే వారు ఆయన.

బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో లాలా కూడా పాల్గొన్నారని, ఆయనతో పాటు సురేంద్ర నాథ్ బెనర్జీ, బిపిన్ చంద్ర పాల్, అరవింద్ ఘోష్ లతో కలిసి బెంగాల్ తదితర ప్రాంతాల్లో ప్రజలను ఏకం చేసి స్వదేశీ ఉద్యమాన్ని ఉధృతం చేశారని చరిత్ర చేపుతున్నది. భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఆయన తన పూర్తి శక్తిని వినియోగించారు. చివరికి న్యాయవాద వృత్తిని కూడా వదులు కున్నారు. సైమన్ కమిషన్ లో భారతీయ ప్రతినిధి ఎవరూ లేని అంశం భారతీయుల ఆగ్రహానికి ఆజ్యం పోయగా, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలైన నేపథ్యంలో లాలా లజపతిరాయ్ నిరసనలో ముందున్నారు. పోలీసు సూపరింటిండెంట్ జేమ్స్ ఎ. స్కాట్ కవాతును ఆపడానికి లాఠీచార్జి చేయాలని ఆదేశించారు. జేమ్స్‌ స్కాట్‌ బ్రిటిష్‌ పోలీసు ఉన్నతాధికారి విచక్షణ రహితంగా కసిగా, ఆవేశంగా లాఠీ దెబ్బలతో ఛాతీపై కొట్టాడు. ‘ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్‌ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి.’ అని ఆ సందర్భంగా లజపతి రాయ్ అన్న మాటలు. “అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు!’ అంటూ గర్జింపుతో స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్‌ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్‌ ఒక సందర్భంలో అన్నమాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన రెండు దశాబ్దాలకు నిజమైనాయి.
ఈ సంఘటనలో లజపతి రాయ్ తీవ్రంగా గాయపడి 1928 నవంబర్ 17న గుండె పోటుతో మరణించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments