ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే గుడిలో వేరుగా చెయ్యాలి. ఒక వ్యక్తికి దృష్టి దోషం, నర ఘోష ,శని దోషం, ఆర్ధిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవ్వడం పిల్లలు మాట వినకపోవడo మొదలైన సమస్యలు ఉన్న వారికి కాల భైరవ తత్వం ప్రకారం, మంచి పరిహారం ఇది అందరు చేసుకోవచ్చు, కేవలం భక్తి శ్రద్ధ కావాలి అంతే,
ఒక బూడిదగుమ్మడి కాయ తీసుకుని చిన్నది పెద్దది కాదు, దాన్ని అడ్డముగ కోసి గింజలు పిక్కలు తీసి దొల్లగ చేసి దానిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పేట్టి అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి .
ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర కాల భైరవ అష్టకం 11 సార్లు చదవాలి. ఈ దీపారాధన
బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ చెయ్యాలి
ధన యోగం కోసమైతే అష్టమి రోజు చెయ్యాలి.
జనాకర్షణ కోసమైతే అమావాస్య రోజు చెయ్యాలి.
ఈ దీపారాధన 19 అష్టమి తిథులు కానీ
లేదా 19 అమావాస్య తిథులు కానీ చెయ్యాలి
పూజ చివరకు ఎండు ఖర్జూరం ప్రసాదంగా పెట్టాలి
పూజ చేసిన రోజు ఉపవాసము ఉండాలి ఘన పదార్థం తినకుండా ద్రవ పదార్థం మాత్రమే తీసుకోవాలి. ఉదయం 4:30 నుండి 6:00 మద్యలో చెయ్యాలి, సంకల్పము చెప్పుకోవాలి కోరిక లేదా సమస్య తీరాలి అని చెప్పుకోవాలి.
ఇది భక్తి శ్రద్ధలతో చేసినవారి జీవితంలో ఉన్న పూర్తి నరదృష్టి గ్రహ వాస్తు పీడలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ దీపారాధన అత్యంత శక్తి వంతం అయినది విపరీత జన/ధన ఆకర్షణ పెరుగుతుంది. సమస్యలు సమసిపోతాయి