ఆరోగ్య బలం మరియు సామర్థ్యం పెరుగుతుంది. ఏ పనినైనా తన జ్ఞాన శక్తితో పూర్తి చేస్తారు. సంతానమునకు అభివృద్ధి, జ్ఞాపక శక్తి ,ఉపాసనా బలం బావుంటుంది. కోరుకున్న విషయాలని సాధించుకొనే ప్రయత్నం, మీ సలహాల కొరకు ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు. వివాహం కావలసిన వారికి వివాహం అయ్యే అవకాశం. ఆరోగ్యము స్నేహసంబంధాలు వృద్ధి.
ఆర్థిక బలం, మాట విలువ బాగుంటుంది రావలసిన ధనం సమయానికి అందుతుంది సద్వినియోగం పరుచుకోవాలి. శత్రువులపై విజయం వలన కొంతవరకు మీ యొక్క నైపుణ్యాలు పెరుగుతాయి .రుణాలు, అనారోగ్యాలకి కొంత పరిష్కారం లభిస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో వ్యాయామ ప్రాణాయామాలు ఉపకరిస్తాయి. వృత్తిలో గౌరవము శ్రమ పెరుగుతాయి. ఇతరులకు ఉపకారం చేసే విషయంలో మీరు చేసే కృషి సత్ఫలితాలనిస్తుంది. గుర్తింపు లభిస్తుంది.బద్ధకం, వాయిదాలు వేయకుండ ఆరోగ్యంపై శ్రద్ధ తో రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. సేవకులసహకారం తగ్గటం, మీ పనులు స్వయంగా మీరేనిర్వర్తించు కొనుట మేలు. స్నేహ సంబంధాల విషయంలోఎక్కువ జాగరూకత, ఇతరులకు ఇచ్చినా మాటను నిలబెట్టుకోవడానికి శ్రమ పడాలి.సమయానికి ఇచ్చిన పని పూర్తి చేసి అందజేసే విషయముల యందు పై అధికారులతో మాట పడే అవకాశం ఉన్నందున స్నేహితుల సహకారంతో పనిని సకాలములో పూర్తి చేసే ప్రయత్నములు చెయ్యాలి.ప్రయాణములు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు. కమ్యూనికేషన్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.