ప్రాణనష్టం జరగకుండా చూడండి: కేటీఆర్‌

Date:


– వర్షాలను రాజకీయం చేయడం తగదు
– హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
– హుస్సేన్‌సాగర్‌ వద్ద వరద ఉధృతి పరిశీలన

– మరో రెండు గేట్ల ద్వారా జంట జలాశయాల నీరు విడుదల
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వర్షాలను కూడా రాజకీయం చేయడం సరికాదని, చేతనైతే సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రతిపక్షాలకు మంత్రి సూచించారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్‌ తదితర అధికారులతో కలిసి హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ వరద పరిస్థితిని మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వర్షకాలం ప్రారంభానికి ముందే నాలాల్లో పూడిక తీశామని చెప్పారు. చెరువుల్లోనూ తక్కువ నీటిమట్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకు న్నామని తెలిపారు. ఈసారి నాలా డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వల్ల వరద ప్రభావం కొంత తగ్గిందన్నారు. భారీ వర్షా లపై ముఖ్యమంత్రి ఎప్పటి కప్పుడూ సమీక్షిస్తున్నారని, శిథిల భవ నాల నుంచి జనాలను వెంటనే తరలిం చాలన్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డుతో పాటు ఇతర శాఖల ఉన్నతాధి కారులతోపాటు క్షేత్రస్థా యిలో సిబ్బంది వరకు అందరూ పనిచేస్తు న్నారన్నారు. వర్షంతో నగ రంలో ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవు తున్నదని, వర్షాలు తగ్గాక కబ్జాలపై దృష్టిసారిస్తా మన్నారు. అవసరమైతే వాటిని కూల్చేస్తామని తెలిపారు. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా ప్రతిపక్షాలు చిల్లర విమర్శలు చేయొద్దని సూచించారు. ఎక్కడికక్కడ కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకునే విధంగా అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో 14 బ్రిడ్జిలు మంజూరు చేశామన్నారు. ముసారంబాగ్‌ వద్ద మూసీనదిపై ఉన్న బ్రిడ్జిని కేటీఆర్‌ పరిశీలించారు. బ్రిడ్జి వద్ద ప్రవాహం పెరిగినా.. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదన్నారు. మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలావుండగా వరంగల్‌ నగరానికి వెళ్లాలని మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించామని, అవసరమైతే శుక్రవారం తాను కూడా వెళ్తానని కేటీఆర్‌ తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పూర్తిస్థాయిలో సంసిద్ధం: తలసాని
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలతరెడ్డితో కలిసి మంత్రి జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించారు. కంట్రోల్‌ రూమ్‌కు వస్తున్న ఫిర్యాదులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమం కింద 36 నాలాల అభివద్ధి పనులు చేపట్టగా, 30 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 6 పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. ప్రజలు అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ (040-21111111, 9000113667)కు కాల్‌ చేయాలని కోరారు. హుస్సేన్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లో ఇన్‌ ఫ్లో, అవుట్‌ ఫ్లోపై ఎప్పటికప్పుడూ అధికారులు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 455 టీంలు పని చేస్తున్నాయని చెప్పారు.
నిండుకుండలా జంట జలాశయాలు
జంట జలాశయాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ నిండుకుండలా మారాయి. హిమాయత్‌ సాగర్‌ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో మరో రెండు గేట్లను తెరిచి మొత్తం నాలుగు గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఉస్మాన్‌ సాగర్‌కు సైతం భారీగా వరద నీరు చేరుకుంటోంది. జలమండలి అధికారులు మరో రెండు గేట్లు ఎత్తడంతో మొత్తం నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువన మూసీలోకి వదులుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...