తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ ఆర్.ఆర్.ఆర్ చిత్రం అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ చిత్రం చేయనున్నారు.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారు.ఈ కథ పొలిటిక్స్ చుట్టూ తిరుగుతుందని సమాచారం.ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడు.
ఈ చిత్రంలో నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్న నటించనున్నది.గతంలో ఆచార్య మూవీలో రామ్ చరణ్ కు జోడిగా రష్మిక మందన్న ను అనుకున్నారు.కానీ డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడం వల్లన ఆమె ఆ సినిమా నుండి తప్పుకుంది.
ఇక ఈ చిత్రంలో ఓ స్పెషల్ పాత్ర కోసం సౌత్ కొరియన్ నటి బే సుజీని దర్శకుడు శంకర్ సంప్రదించరని దానికి ఆమె కూడా సానుకూలంగా స్పందించిందని ఓ రూమర్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సివుంది.