అన్ని వర్గాల ప్రజలను సమపాళ్లుగా చూసే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని,
దానిలో భాగంగా ఆర్థిక స్వావలంబన కోసం ముస్లిం మైనారిటీ వర్గాలకు లక్ష రూపాయల గ్రాంట్ ను ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పై వారి పక్షాన
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో
మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని సత్సంకల్పంతో అనేక పథకాలను
అమలు చేస్తున్న ప్రభుత్వం,
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి మళ్ళీ ఒక్క అవకాశం కల్పిస్తే చాలా మంది పేదలకు సహాయంగా ఉంటుందని,
మైనారిటీలకు గ్రాంట్ అందించడం
పట్ల ముస్లీం మైనారిటీ శాఖ మంత్రిగా తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి అంద చేస్తున్న విధంగా అర్హులైన మైనార్టీ వర్గాల వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. బిఆర్ఎస్ సర్కార్ మైనార్టీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, ఇతర వర్గాలతో సమానంగా మైనార్టీల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం కేసిఆర్ ప్రభుత్వ ప్రతేక పాలనకు నిదర్శనం అన్నారు. ఇప్పటికే
వారికోసం 204 రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించడం జరిగిందన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నానన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ కూడా అందుబాటులో ఉందన్నారు. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు ఇంజినీర్లు గా ఎదుగుతున్నారన్నారు.
గొప్ప స్థాయిలో బడ్జెట్ ను ప్రతిపాదిస్తూ వారి సంక్షేమాన్ని కోరుకోవడం
జరుగుతుందన్నారు. ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదన్నారు.
హిందువులకు కల్యాణ లక్ష్మీ తెచ్చినట్టు, మైనార్టీల కోసం షాది ముబారక్ ప్రవేశ పెట్టారన్నారు. 2200 కోట్ల బడ్జెట్ ను ఈ సంవత్సరం ప్రతిపాదించి వారి అవసరాలకు, అభివృద్ధి కోసం కేటాయించినట్లు తెలిపారు.
ఇలా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అన్ని వర్గాల వారిపట్ల
సమభావం చూపిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వమని
పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆయన ముస్లింలను అభినందించారు.
