తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం కావాలి

Date:

హిదావరి నది తీరప్రాంత వాసులకు ఎలాంటి అష్టి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదావరి నది తీర ప్రాంతాల్లో పర్యటించారు గోదావరి నది ఉధృతిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన గోదావరి నది ప్రవాహం పై అధికారులు ఎప్పటికప్పుడు తీరప్రాంత వాసులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు..
గత 4 రోజుల నుండి రాష్ట్రం లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజానీకానికి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు గైకొన్న నేపథ్యంలో ఈ రోజు గోదావరి నది ఉధృతి పరిశీలించడం జరిగిందన్నారు.
తీరప్రాంత వాసులు నది ప్రవాహానికి
అనుగుణంగా అధికారుల సూచన మేరకు నడుచుకోవాలని కోరారు.
భక్తులు, ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో నది ప్రవాహం పెరిగే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాలకు ఎవరు వెళ్లకూడదని
ఆయన కొరారు. డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, కమిషనర్ రమేశ్,
ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు..

బి ఆర్ ఎస్ లో చేరికలు

ధర్మపురి పట్టణంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో
శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎండపెల్లి మండలం గుళ్లకోట గ్రామానికి చెందిన 70 మంది గ్రామస్తులు
బి.అర్ ఎస్ పార్టీ లో చేరారు.
మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎస్ హెచ్ గార్డెన్స్ లో నియోజకవర్గ స్థాయి ఫీల్డ్ అసిస్టెంట్ల్స్, ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఈకార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

రామకిష్టయ్య సంగనభట్ల... 9440595494
రామకిష్టయ్య సంగనభట్ల… 9440595494

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...