Thursday, December 8, 2022
Homespecial Editionవిలక్షణ నటుడు కొంగర జగ్గయ్య

విలక్షణ నటుడు కొంగర జగ్గయ్య

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

కొంగర జగ్గయ్య విలక్షణ నటుడు. ఎన్టీఆర్ ఏఎన్నార్ లతో పాటు, విశే ష ప్రేక్షకాదరణ, అశేష అభిమాను లను పొందిన నటుడు. ధరించిన పాత్ర ఏదైనా తన విలక్షణమైన నటనతో ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసి ఒక ప్రత్యేకతను, నిండు తనాన్ని, హుందా తనాన్ని సంతరిం ప జేసిన విశిష్ట వ్యక్తి జగ్గయ్య. జగ్గయ్య సినీ నటుడే కాదు ఒక రచయిత, సాహిత్యకారుడు, కళా వాచస్పతి, చిత్రకారుడు, పాత్రికే యుడు, సంపాదకుడు, రాజకీయ వేత్త. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో అనౌన్సర్. “ఆకాశవాణి… వార్తలు చదువుతుంది కొంగర జగ్గయ్య” అంటూ కంచు కంఠంతో ఆయన వార్తలు చదివిన సంగతి ఆనాటి శ్రోతలకు విదితమే.కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 – మార్చి 5, 2004) మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశ వాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా “కంచు కంఠం” జగ్గయ్యగా, “కళా వాచస్ప తి”గా పేరు గాంచాడు. శివాజీ గణే శన్ నటించిన చిత్రాలు తెలుగులోకి అనువదించిన అన్ని సందర్భాల్లో జగ్గయ్యే కంఠం వినిపించేది. ‘కళా వాచస్పతి’ అనేది జగ్గయ్యకు ప్రదానం చేసిన బిరుదు కాదు. అది ఢిల్లీ లోని అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవ డాక్టరేటు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఉద్యమ పోరాటంలో పాల్గొంటూ అజ్ఞాత వాసంలో తలదాల్చు కునేందుకు వచ్చిన అంతర్రాష్ట్ర సమర యోధు లకు తన ఇంటిలో ఆవాసం కల్పిం చిన దేశ భక్తుడు జగ్గయ్య.జగ్గయ్య గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో, 1928, డిసెంబర్ 31 న ధనవం తుల కుటుంబంలో జన్మించాడు. 11 సంవత్సరాల పిన్న వయసులో రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించాడు. గుంటూరు లోని ఆంధ్రా క్రిస్టియను కాలేజీలో ఎన్.టి.రామారావు, కొంగర జగ్గ య్య ఇద్దరు సహ విద్యార్థులు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. జగ్గయ్య మూడు సంవత్సరాల పాటు వరుసగా ఉత్తమ నటుడు పురస్కారం పొందాడు.ఇంటర్మీడియట్ తరువాత కొంత కాలం “దేశాభిమాని” అనే పత్రికలో ఉప సంపాదకుడిగానూ, ఆ తర్వాత “ఆంధ్రా రిపబ్లిక్” అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడి గానూ పనిచేశాడు. ఢిల్లీలో “ఆల్ ఇండియా రేడియో”లో మూడు సంవత్సరాల పాటు వార్తలు చదివే ఉద్యోగం చేసాడు. చిత్రకారుడు అడవి బాపిరాజు వద్ద చిత్రలేఖనం లో శిక్షణ పొందాడు.1950ల నుండి 1970ల వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేసాడు. జగ్గయ్య దాదాపు 500కు పైగా చిత్రాలలో, వందసినిమాల్లో హీరోగా, మరో వంద సినిమాల్లో సహ కథానాయకుడిగా నటించాడు. రెండువందల చిత్రాల్లో క్యారక్టర్ నటుడుగా రాణించాడు. ఎన్.టి.రామారావుతో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసి పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నాడు. బుచ్చిబాబు రాసిన దారిన పోయే దానయ్య నాటిక జగ్గయ్యకు పేరు తెచ్చి పెట్టింది.ఎన్.టి. రామారావు, జమున, సావిత్రి, గుమ్మడి, ముక్కామల వంటి నటీనటులతో రంగస్థలం మీద నటించిన జగ్గయ్య ఎందరు నటులకో మార్గదర్శకుడు. నటి సావిత్రి నాట్యానికే పరిమితమైన ఆరోజుల్లో తను రచించిన ‘బలిదానం’ అనే నాటకం ద్వారా రంగస్థల నటిగా మార్చిన ఘనత జగ్గయ్యకు దక్కుతుంది.100కు పైగా సినిమాలలో డబ్బింగు చేసాడు. తమిళ చిత్రరంగ నటుడు శివాజీ గణేశన్ నటించిన తెలుగు సినిమాలలో జగ్గయ్యే గాత్రధారణ చేసేవాడు. అంతేకాదు తెలుగులోకి డబ్బింగు చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తన గాత్రాన్ని అరువు ఇచ్చాడు.అల్లూరి సీతారామరాజులో పోషించిన రూథర్ ఫర్డ్ పాత్ర ఆయన జీవితంలో మరపురానిది. ఆ సినిమా తీసే నాటికి రూథర్ ఫర్డ్ చరిత్ర మరచి పోయిన వ్యక్తి కాదు. రూథర్ ఫర్డ్ ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికి చాలా ఉన్నారు. 1940 వరకు ప్రభుత్వ సర్వీసులో ఉన్నా డు. కృష్ణా జిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. వారిని కలిసి, జగ్గయ్య రూథర్ ఫర్డ్ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి తెలుసు కున్నాడు. రూథర్ ఫర్డ్ చాలా మంచి వ్యక్తి అని, సీతా రామరాజు అంటే ఆయనకు గౌరవం ఉండేదని తెలుసు కున్నాడు. అయితే రూథర్ ఫర్డ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడుగా, సేవకుడిగా అతను సీతారామ రాజును పట్టుకోక తప్పని స్థితి గురించి అవగాహన కలిగాక, జగ్గయ్య చిత్ర రచయిత మహారథిని కలిసి ఆ పాత్రను రొటీన్ విలన్ లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి వ్రాయాలని కోరాడు. అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో ఆ పాత్ర నిలబడడంతో బాటు సీతా రామరాజు పాత్ర మరింతగా హిట్ అయింది. ఆ సినిమా చూశాక పి.వి.నరసింహారావు జగ్గయ్యకు ఫోన్ చేసి “మీ పాత్ర పోషణ అద్భుతం.” అని ప్రశంసించారట.1967లో నాలుగవ లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో ఒంగోలు నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, 80 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. లోక్‌ సభకు ఎన్నికైన తొలి దక్షినాది, తొలి భారతీయ నటుడు జగ్గయ్య కావడం విశేషం. 1930లో గాంధీజీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమం నేపథ్యంలో డాన్సులు, డ్యుయెట్ల వంటి ఆకర్షణలు లేకుండా “పదండి ముందుకు” తీశారు. ఈ తొలి రాజకీయ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల పురస్కారాన్ని ఇచ్చింది. ఈ సినిమా రష్యాలో తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ తో బాటు మరికొన్ని నగరాల్లో ప్రదర్శితమైంది. సంభాషణలతో బాటు చిత్రం చివర్లో వచ్చే ‘మంచికి కాలం తీరిందా’ అనే పాటను కూడా జగ్గయ్యే వ్రాశాడు. ఇది మహమ్మద్ రఫీ పాడిన తొలి తెలుగు పాట. కృష్ణ ఒక చిన్న పాత్ర చేశాడు. మోహన్ బాబు నిర్మించిన ‘కుంతీ పుత్రుడు’ లో జగ్గయ్య చివరిసారిగా నటించారు.నోబెల్ పురస్కారము అందుకున్న రవీంద్రుని గీతాంజలిని “రవీంద్ర గీతా” అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం. రవీంద్ర నాథ ఠాగూరు రాసిన నాటకం “సాక్రిఫైస్” (Sacrifice) ను తెలుగులోకి “బలిదానం” అనే పేరుతో అనువదించాడు.భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన “పద్మభూషణ్” తో సత్కరించింది. ఢిల్లీ లోని సంస్కృత విశ్వ విద్యా లయం “కళా వాచస్పతి”అనే బిరు దుతో జగ్గయ్యను సత్కరించింది. తెలుగు విశ్వ విద్యాలయం గౌరవ “డాక్టరేటు”తో సత్కరించింది.తమిళనాడు ప్రభుత్వం “కలైమా మణి” బిరుదు నిచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించింది. 2004, మార్చి 5 న 76 సంవత్సరాల వయసులో చెన్నైలో గుండెపోటుతో జగ్గయ్య మరణించాడు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments