5.1 C
New York
Saturday, March 25, 2023
HomeLifestyleLife styleనేటి తరానికి ఆదర్శం... కొండా వెంకటప్పయ్య వ్యక్తిత్వం...

నేటి తరానికి ఆదర్శం… కొండా వెంకటప్పయ్య వ్యక్తిత్వం…

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ఆయన విలువలతో కూడిన నిబద్ద త కలిగిన రాజకీయ నాయకుడు. దాన, ధర్మాల కోసం సొంత ఆస్తినే అమ్ముకొన్న దయా హృదయుడు. స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, దేశభక్త బిరుదాంకి తుడు. ఆయనే నిస్వార్తానికి నిలు వెత్తు రూపం కొండా వెంకటప్పయ్య. దృఢ సంకల్పం, నిర్మలమైన ప్రవర్తన, అసమాన ధైర్యం, నిశ్చల మైన దీక్షా దక్షత, అరమరకలేని అమాయకత్వం, నిరాడంబర వ్యక్తిత్వం కలగలిపినదే కొండా వెంకటప్పయ్య జీవితం. శ్రోత్రియ కుటుంబంలో జన్మించినా, సనాతన సాంప్రదాయాల పరిధిని అతిక్రమిం చిన భిన్న మనస్తత్వం ఆయనది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకత్వం నెరపిన నాయక త్వం ఆయనది. కృష్ణా పత్రికను స్థాపించి తెల్లదొరలపై అక్షర అస్త్ర శస్త్రాలను సంధించిన అక్షర యో ధుడు. గాంధీకే దేశ రాజకీయాల లోకి రాక ముందే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా న్యాయవాద వృత్తిని విడనాడి న త్యాగధనుడు.స్వాతంత్ర్యం వచ్చిన నాలుగు నెలలలో, 1947 డిసెంబరులో కొండా వెంకటప్ప య్య …స్వాతం త్ర్యం తరువాత పెచ్చుపెరిగిన అవినీతి గురించి మహాత్మా గాంధీకి వ్రాసిన లేఖను బట్టి ఆయన తపన అర్థం అవుతుంది. “మనం మన స్ఫూర్తిగా కోరుకొన్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర్య యోధులలో నీతి నియమాలు అంతరించి పోయాయి. రోజురోజు కూ పరిస్థితి దిగజారి పోతోంది. ప్రజలు కాంగ్రెసును దూషిస్తున్నారు. బ్రిటిషు రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెసు అవినీతికి ఆలవాలమై పోతున్నది. వారిని అదుపు చేయాల్సిన పోలీసు వ్యవస్థ కాంగ్రెసువారి కట్టడి లో ఉండి పోయింది. పైసా ఆదాయం లేని వారు ఇప్పుడు మహా రాజుల లాగా పెద్దపెద్ద కార్లలో తిరుగు తున్నారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరచూ జోక్యం చేసుకోవడం వలన జిల్లా కలెక్టరులూ, రెవిన్యూ అధికారులూ తమ విధులను సక్రమంగా నిర్వర్తిం చ లేక పోతున్నారు. ఈ పైరవీ కారుల ప్రభావం దుష్ప్రచారం, భయంతో నిజాయితీగల వారు తమ పదవులలో ఉండే పరిస్థితి లేదు.”విదేశీ పాలకుల దాస్య శృంఖలాల నుండి విముక్తి కలిగి, స్వతంత్ర భారతావని స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనంతరం కేవలం , నాలుగు మాసాలకే 1947 డిసెం బర్‌లో కాంగ్రెస్‌ నేతల స్వార్థ చింతన గురించి గాంధీజీకి రాసిన లేఖలోని వ్యథా భరిత హృదయంలో నుండి వచ్చిన బాధతో నిండిన వాక్యాలివి. దీన్ని బట్టి ఆయన నీతి నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థ భావన గురించి స్పష్టం అవుతుంది.కొండా వెంకటప్పయ్య (ఫిబ్రవరి 22, 1866 – ఆగష్టు 15, 1949) 1866, ఫిబ్రవరి 22 న పాత గుంటూరులో జన్మించాడు. ప్రాథమిక విద్య గుంటూరు మిషన్ స్కూలులో, ఉన్నత విద్య మద్రాసు క్రైస్తవ కళాశాలలో పూర్తిచేసి తరువాత బి.ఎల్. పట్టా పొంది, బందరులో న్యాయ వాద వృత్తిని చేపట్టాడు. ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో, జాతిని చైతన్య వంతం చేయడానికి వెంకటప్పయ్య 1902లో వాసు నారాయణరావుతో కలసి కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించాడు. 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపి, గుంటూరులో స్థిరపడగానే దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావుకు అప్పగిం చాడు. న్యాయవాద వృత్తిలో వెంక టప్పయ్య ధనార్జన గురించి ఆయ న పట్టించుకోనే లేదు. దాన, ధర్మాల కోసం సొంత ఆస్తినే అమ్ము కొన్నాడు. 1912 మే నెలలో కృష్ణా గుంటూరు జిల్లా రాజకీయ మహా సభ నిడద వోలులో జరిగింది. ఆ సభలోనే కొండా వెంకటప్పయ్య సలహాపై ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలగు యువకులు 11 తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే విషయంలో మంతనా లు జరిపారు. 1913లో అదే స్థాయి లో మహాసభ బాపట్లలో జరిగింది. కొండా వెంకటప్పయ్య సలహా మేరకు మొదటి ఆంధ్ర మహాసభ (ఆంధ్ర) బి.ఎస్.శర్మ అధ్యక్షతన జరిగింది. దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన బృందంలో కొండా వెంకట ప్పయ్యదే ప్రధాన పాత్ర. నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు ఆయనే అధ్యక్షుడిగా ఉండి ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి నిర్దిష్ట కార్యక్రమం రూపొందించాడు. 1917లో రాజ్యాంగ సంస్కరణల విషయమై పరిశీలనలు జరపడానికి మాంటేగ్ – చమ్స్‍ఫర్డ్ ప్రతినిధి వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. సదరు ప్రతినిధి వర్గం మద్రాసుకు వచ్చిన. సందర్భంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన అవసరాన్ని. నొక్కి చెప్పిన ఆంధ్ర ప్రతినిధులలో కొండా వెంకటప్పయ్య ముఖ్యుడు.1918లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనలో ఇది తొలివిజయం కాగా, రాష్ట్ర కాంగ్రెసు కమిటీకి తొలి కార్య దర్శి వెంకటప్పయ్యే. ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లా లు కలసిన నియోజక వర్గం నుంచి పోటీ చేసి కొండా వెంకటప్పయ్య మద్రాసు కౌన్సిలుకు ఎన్నిక య్యాడు. సహాయ నిరాకరణో ద్యమం కొనసాగించడానికి వీలుగా కాంగ్రెసు పార్టీ తన సభ్యుల రాజీనామా కోరగానే కొండా శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. తర్వాత ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడై భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడయ్యాడు.1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగగా, మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయల విరాళాలుగా స్వీకరించి స్వరాజ్య నిధికి సమర్పించాడు. పెదనంది పాడు పన్నుల నిరాకరణోద్యంలో పాల్గొన్నందుకు ఆయన మొదటి సారి జైలు శిక్ష అనుభవించాడు.1923లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన దేశబంధు చిత్తరంజన్ దాస్ రాజీనామా వల్ల వెంకటప్ప య్యను అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దుగ్గి రాల గోపాలకృష్ణయ్య అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి అయ్యా డు. గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంక టప్పయ్యే ఆ రోజుల్లో నాయకత్వం వహించేవాడు. ఆంధ్ర ఖద్దరుకు యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రధాన మైనది.1933లో మహాత్ముడు ఆంధ్రలో హరిజన యాత్ర చేపట్టి, అనేక గ్రామాలలో హరిజనుల దేవాలయ ప్రవేశం చేయించాడు. భార్య మృత్యు ఒడిలో ఉన్నప్పటికీ కొండా వెంకటప్పయ్య హరిజన సేవలో నిమగ్నుడై తిరుగుతున్నాడని మహాత్మాగాంధీచేత కొనియాడ బడినాడు.1929లో సైమన్ కమిషన్ రాక సందర్భంలో, 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు కొండా వెంకట ప్పయ్య జైలు శిక్షలు అనుభవిం చాడు. 1937లో జరిగిన ఎన్నికల్లో అతను మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యాడు. భాషా ప్రాతిపదికన మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభిజిం చాలని కొండా వెంకటప్పయ్య శాసన సభలో ప్రవేశ పెట్టిన తీర్మా నం ఏకగ్రీవంగా నెగ్గింది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో 1920 నుండి 1949లో మరణించే వరకు ఆంధ్ర దేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడైన గొప్ప వ్యక్తి వెంకటప్పయ్య. ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు కూడా అధ్యక్షుడిగా పని చేశాడు. అఖిల భారత చరఖా సంఘానికి జీవిత కాలం సభ్యుడిగా ఉన్నాడు. గ్రంథాలయోద్యమానికి తోడ్పడ్డాడు. దేశ, రాష్ట్ర రాజకీయాలలో, కాంగ్రెస్ పార్టీ లో తమకంటూ ప్రత్యేక స్థానం ఉన్న కొండా, స్వార్థ రాజకీయ నాయకుల మూలంగా తన ప్రతిభకు, త్యాగానికి సముచిత స్థానం పొందలేక పోయాడు. కొండా వెంకటప్పయ్య 1949 ఆగష్టు 15 న దేశ స్వాతంత్ర్య దినాన లోకాన్ని ఈ వదిలి వెళ్లాడు. ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శం కావాలి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments