వినూత్నమైన కథాంశాలతో చిత్రాల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రానా.కథ,పాత్ర బాగుంటే చాలు ఎవరి సినిమాలోనైనా నటిస్తాడు.అందుకే ఆయనకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.అలాంటి రానా హీరోగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం.ఈ చిత్రంలో రానా సరసన మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈమె కూడా రానా వలె పాత్రను,కథను చూసి చిత్రాలు చేస్తుంది.ఈ చిత్రం నుండి తాజాగా చిత్ర యూనిట్ ఓ తాజా అప్డేట్ ను విడుదల చేసింది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ చిత్రంలో కొలు కొలు అనే సాంగ్ లిరికల్ వీడియోని ఈ నెల 25న విడుదల చేయనున్నారు.తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో టబు,ప్రియమణి,నందిత దాస్,ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.