ఆంధ్ర నాటక రంగానికి ఆధునిక తను ప్రసాదించిన వారిలో ఎన్నదగిన వారు కోలాచలం శ్రీనివాసరావు, ధర్మవరం రామ కృష్ణమా చార్యులు. ఆధునిక ఆంధ్ర నాటక రంగానికి విశిష్ట సేవలు అందించిన ఈ ఇరువురు బళ్ళారికి చెందిన వారే కావడం విశేషం.
కోలాచలం శ్రీనివాసరావు (మార్చి 13, 1854 – జూన్ 20, 1919) ప్రముఖ న్యాయవాది. నాటక కర్త, నాటక శాల నిర్మాత, కవి, పరిశోధ కులు, బహు భాషా వేత్త, సంఘ సంస్కర్త, తెలుగు సాహిత్య సేవకులు.
కోలాచలం శ్రీనివాసరావు తెలుగు నాట సాహిత్యానికి, తెలుగు నాటక రంగానికి చేసిన సేవ అనన్య సామాన్యం. అనితర సాధ్యం. తెలుగు నాటక కర్తలలో ఉత్తమ శ్రేణి నాటక కర్తగా ప్రసిద్ధులు, నాటక రచనా ప్రయోగాల్లో విజయం సాధించిన వారు.
సంఘంలోని దురాచారాలను నిర్మూలించి సంఘ సంస్కరణం చేయడం, వినోదంతో పాటు ప్రజలకు నీతిని బోధించడం, హాస్యం సమ్మిళితం చేసి ప్రేక్షకుల హృదయాలను చూరగొనడం, వీటికి తోడు ప్రధానంగా ప్రజలకు చారిత్రక నాటకాల ప్రదర్శనవల్ల చరిత్ర తెలియ చేయాలన్నది ఆయన లక్ష్యాలు. చారిత్రక రచనలు, సంఘానికి సంబంధించిన రచనలు సమాజానికి అత్యవ సరమని భావించి ఆ దిశగా కృషి చేశారు. అందుకే ఆయన చారిత్రక నాటక పితామహునిగా పేరెన్నిక గన్నారు.
తెలుగు నాటకరంగ అభ్యుదయ, వికాసాలకు తమ జీవితాన్ని అంకితం చేసిన కోలాచలం శ్రీనివాసరావు మల్లినాథ సూరి వంశీయులు. ఆయన పూర్వీకులు విజయనగర సంస్థాన పండితులు. నాటక సాహిత్యాన్ని స్వాధ్యయనం చేశారు. ఆయన 1854 సంవత్సరం, మార్చి 13న బళ్ళారి జిల్లాలోని హంపి వద్ద కమలాపురం గ్రామంలో అచ్చమ్మ, సేతుపతి శాస్త్రి దంపతులకు జన్మించారు. చిన్న వయసులోనే తెలుగు, కన్నడ, సంస్కృత మరియు ఆంగ్ల భాషలలో పట్టు సాధించారు.
1876లో ఎఫ్.ఏ పరీక్ష ఉత్తీర్ణులై, అనంత పురం జిల్లా గుత్తిలో రెవిన్యూ ఇన్స్పెక్టరుగా పనిచేశారు. 1881లో అనంతపుర మండలం డిప్యూటి కలెక్టరు దగ్గర దివానుగా ఉద్యోగం చేశారు.1888లో జాతీ యోద్యమ పిలుపునందుకొని ఉద్యోగం వదిలి రెండవ తరగతి ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణుడై బళ్ళారి లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. అప్పటి నుండి ఆయన సాహితీ వ్యాసంగంకు అంకితం అయినారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా, నాటక కళ అంటే అత్యంత అభిమానం.
రాసిన తళ్ళికోట యుద్ధంలో కీర్తి శేషుడైన రామరాజు కథ ఆధారంగా ఆయన రామరాజు చరిత్ర చారిత్రక రచన చేశారు. మైసూరు రాజ్యము, ప్రతాపాక్బరీయము కూడా చారిత్రక రచనలే. ఆయన భారతదేశం లోనే కాక ఇతర దేశాల నాటకాల చరి త్రలను పరిశోధించి ప్రపంచ నాటక చరిత్ర (ది డ్రమాటిక్ హిస్టరీ ఆఫ్ ది వల్డ్) అనే గ్రంథాన్ని ఆంగ్ల భాషలో రాశారు. తెలుగులో సునందినీ పరిణయము, సుఖమంజరీ పరిణయము మొదలైన నాటకాలు రాశారు. తెలుగులో మొదటి చారిత్రక నాటకం రాసింది కూడా ఆయనే. భగవద్గీత 18 అధ్యాయా లు సవిమర్శగా పఠించి ప్రతి అధ్యాయాన్ని వచనంగా ప్రకటిం చారు. వ్యవహారిక భాషోద్యమానికి వ్యతిరేకుడు.
చారిత్రక నాటకాలకు జీవం పోసి,
ఆంధ్ర చారిత్రక నాటక పితామహు డన్న పేరు గాంచడమే కాకుండా, సుమనోరమా సభా నాటక సంస్థను స్థాపించిన, తెలుగు నేలపై ప్రప్రథ మంగా వాణీ విలాస నాటక శాలను బళ్లారిలో నిర్మించిన ఘనత కూడా ఆయనదే. దేశంలో తొలి ప్రపంచ నాటక చరిత్ర అనే గ్రంథం ఆంగ్లంలో రచించిన గొప్పతనం ఆయనకే చెందుతుంది భారతీయ. నాటక సాహిత్య నిర్మాతలలో ప్రాతః స్మరణీయులుగా నిలిచి పోయారు కోలాచలం శ్రీనివాసరావు. ఆయన , 1919 జూన్ 23న ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.
ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు కోలాచలం
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES