Wednesday, November 30, 2022
HomeLifestyleLife styleమహా మహోపాధ్యాయ వెంకటరత్నం పంతులు

మహా మహోపాధ్యాయ వెంకటరత్నం పంతులు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


కొక్కొండ వెంకటరత్నం పంతులు (మార్చి 14, 1842 – డిసెంబరు 14, 1915) కవి, నాటక రచయిత, పత్రికా సంపాదకులు, ఉపాధ్యాయులు, సంగీతజ్ఞులు. గ్రాంధికమే మాట్లాడేవారు. “మహామహోపాధ్యాయ” బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించారు. “ఆంధ్రభాషా జాన్‌సన్” అనే గౌరవం కూడా పొందారు. ఆంధ్ర వాజ్మయంలో నవయుగ ప్రవర్తక త్రయం (చిన్నయసూరి, వెంకట రత్నము, వీరేశలింగము) లో కొక్కొండ మధ్యమ స్థానాన్ని ఆక్రమించారు.

ఇరవై రెండు సంవత్సరాలు మద్రాసు రాజధాని కళాశాలలో, ఎనిమిది సంవత్సరాలు రాజమండ్రి కళాశాలలో తెలుగు పండితులుగా పనిచేసారు. అయన 1871 లో ‘ఆంధ్రభాషా సంజీవిని’అనే పత్రికను స్థాపించి 20 సంవత్సరాలు నడిపారు. చెన్నైలో ఆంధ్రులచే నడుపడిన పత్రికలో అదే మొదటిది పత్రిక. ఆ తర్వాత ‘హాస్యవర్ధని’ అనే పత్రికను నడిపారు. హిందూ శ్రేయోభివర్ధనీ సభను స్థాపించి, ఆంధ్ర భాషలో వక్తృత్వం, ఉపన్యాస పద్ధతి నెలకొల్పి వాటిద్వారా ఆర్యమత ప్రచారం చేశారు.

శ్రవ్యకావ్యాలను, 5 రూపకాలను, అజామీళోపాఖ్యానం అనే యక్షగానమును రచించారు. ఆయన అనువదించిన ఐదు రూపకాలలో నరకాసుర విజయ వ్యాయోగం (1872), ధనుంజయ విజయ వ్యాయోగం (1894), ఆంధ్ర్ర పసన్న రాఘవం (1897) కేవలం మూడు మాత్రమే ముద్రించ బడ్డాయి. ‘పౌండరీకం’ అనే భాణము, శ్రీమతి బాధవం అనే నాటకం ముద్రితం కాలేదు. సంస్కృత నాటకాలను అనువదించడంలో పద్యానికి పద్యం, గద్యానికి గద్యం వరుసగా వ్రాసే పద్ధతిని ఆయనే ఏర్పరచారు. ఈ పద్ధతి నేటికీ అవలంభించ బడుతోంది. నరకాసుర విజయ వ్యాయోగం రెండవ సంస్కృతాంధ్రనువాదమైనా, లభ్యమైన వాటిలో నరకాసుర విజయ వ్యాయోగమే మొదటి సంస్కృతాంధ్రానువాదంగా పేర్కొన బడుతుంది.

ఆయన 1843 మార్చి 24న నరసింగరావు పంతులు, రామాంబ దంపతులకు వినుకొండలో జన్మించారు. తండ్రి 1845లో మరణించగా, వెంకటరత్నం సంస్కృతాంధ్ర గ్రంథములు ఇంటివద్దనే చదువుతూ ఇంగ్లీషు పాఠశాలలో చదివారు. 1855లో మేనరిక వివాహం జరిగింది.15వ ఏటనే గుంటూరు కలెక్టరు కచ్చేరీలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరారు.
1856లో మొదటిసారి చెన్న పట్టణం వెళ్ళారు. 1856 కంపెనీ సర్కారు సర్వే పార్టీలో ఉద్యోగానికి దరఖాస్తు చేయగా సేలంలోని సర్వే పార్టీలో ఉద్యోగం వచ్చింది. తరువాత కోయం బత్తూరు దగ్గరలోని పాల్ఘాట్ వెళ్లి అక్కడ తెలుగు పాఠశాల పెట్టారు. అందులో కన్నడం, తమిళం కూడా బోధించేవారు. కోయంబత్తూరులో నారాయణ అయ్యర్ వారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. 1864లో ఉడుపి యాత్రలో తల్లి మరణించింది. 1863లో సర్వే పార్టీ మూసివేసిన తరువాత 1866లో చెన్నపట్టణం రెవెన్యూ బోర్డులో ఉద్యోగం చేశారు. 1870లో చెన్న పట్టణంలో హిందూ ప్రొప్రయటరీ స్కూలులో తెలుగు పండితులుగా చేరారు. 1870 సంవత్సరములో “హిందూ శ్రేయోభి వర్ధనీ సమాజం”ను స్థాపించి దానిలో విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను సమావేశ పరచి ఒకొక్కసారి ఒకొక్క విషయంపై ఉపన్యాసం చేసేవారు.

1871లో “ఆంధ్ర భాషాసంజీవని” పత్రిక స్ధాపించారు. అందులో పత్రికా లక్షణాల గురించి, పత్రికా సంపాదకుల లక్షణాల గురించి పద్యాలు వ్రాసేవారు. ఆ పత్రికలో ఇంగ్లీషు పత్రికల లాగా సంపాదకీయాలు ప్రారంభించారు. 1871 నుండి 1883 వరకూ, తరువాత మళ్ళీ 1892 నుడీ 1900 వరకూ ఆ పత్రిక నడిచింది. బందరు నుండి ప్రచురించ బడే “పురుషార్ధ ప్రదాయిని” పత్రిక 1872 జూలై సంకలనంలో కొక్కొండ స్థాపించిన ఆంధ్ర భాషా సంజీవని గూర్చి ప్రశంసిస్తూ ఇంగ్లీషులోను తెలుగులోనూ సమీక్షలు రాశారు. పత్రికలో ప్రచురించ బడిన ముఖ్య విషయాలను ఇంగ్లీషు ప్రభుత్వ ట్రాన్సలేటర్ లెఫ్టనెన్టు కర్నల్ లేన్ దొర ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రతినెలా మద్రాసు ప్రభుత్వానికి నివేదికలు పంపించే వారు. 1874 నవంబరులో ఆంధ్రభాషా సంజీవని పత్రికలో “సంజీవిని సమాచారమ”నే పేరుతో దేశ పరిపాలన వ్యవహారాల గురించి 16 ప్రశ్నలు రాశారు. ఈ ప్రశ్నలు తమ పాఠకులు చదివి తమ అభిప్రాయాలను కారణాలు ఉదాహరణలు వ్రాసి పంపమని పత్రికాధిపతి కోరారు. ఆ 16 ప్రశ్నలనూ గూడా ప్రభుత్వ ట్రాన్సలేటర్ కర్నల్ లేన్ దొర ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ 16 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య చరిత్ర 1874 నవంబర్ మొదటి సంకలనములో 58వ చారిత్రక పఠముగా ఉంది. ఆంధ్రభాషా సంజీవిని గూర్చి తిరుమల రామచంద్ర వ్యాసం 1986లో వ్యాసం రాశారు. 1874 అక్టోబరులో స్ధాపించిన కందుకూరి వీరేశలింగం వివేకవర్ధని పత్రిక ఆంధ్ర భాషాసంజీవనికి పోటీ పత్రికగా ఉండేది.1871లో కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నంను ప్రశంసిస్తూ వ్రాసిన లేఖ 1951, జూలై నెల భారతి ప్రచురణలో నిడదవోలు వెంకటరావు ప్రచురించారు. కానీ 1874 నుంచీ వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం కొక్కొండ సంజీవని పత్రికపై విమర్శలు ప్రచురించటం ప్రారంభించారు. 1875లో వెంకటరత్నం “హాస్యవర్ధని” స్థాపించారు. 1876లో కందుకూరి వీరేశలింగం “హాస్య సంజీవని” ప్రచురణ ప్రారంభించారు. ఆవిధంగా కొక్కొండ, కందుకూరిల మధ్య వ్యంగ్య వాదోపవాదాలు కొనసాగుతూ వుండేవి. 1877లో కొక్కొెండ వెంకటరత్నం మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితుడిగా నియమింప బడ్డారు. 1890లో ప్రెసిడెన్సీ కాలేజీలో కొక్కొండ ఆంధ్రభాషావర్ధని స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వం కేవలం సంస్కృత పండితులకే ఇచ్చే “మహామహోపాధ్యాయ” బిరుదును 1907లో కొక్కొండ వెంకటరత్నం అందుకున్నారు. ఆ బిరుదు అందుకున్న “ప్రప్రథమ ఆంధ్ర పండితుడు” ఆయనే. రాజమండ్రిలో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సమావేశాలలో 1912 ఏప్రిల్ 23వ తేదీన, 1913 ఏప్రిల్ 22 తేదీన జరిగిన సమావేశాలకు కొక్కొండ వెంకట రత్నం అధ్యక్షత వహించారు. ఆయన రచించిన మహాశ్వేత (1867) తెలుగులో తొలి నవలగా కొంతమంది భావిస్తున్నారు. కొక్కొండ 1915, డిసెంబర్ 14వ తేదీన మరణించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments