5.1 C
New York
Sunday, May 28, 2023
HomeEntertainmentMovie Updatesక్లీన్ U/A సర్టిఫికెట్ అందుకున్న కిరణ్ ఆబ్బవరం ‘సెబాస్టియన్‌ పిసి524’

క్లీన్ U/A సర్టిఫికెట్ అందుకున్న కిరణ్ ఆబ్బవరం ‘సెబాస్టియన్‌ పిసి524’

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా, సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలుగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కిరణ్ చేసింది రెండు చిత్రాలే అయినా తను సెలెక్టివ్ కథలను ఎంచుకొంటూ చాలా సినిమాలు చేస్తూ ఇప్పుడు బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. తాజా గా కిరణ్‌ అబ్బవరపు నటించిన చిత్రం  ‘సెబాస్టియన్‌ పిసి524’. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి.ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోకు ప్రేక్షకులనుండి ఊహించలేనటువంటి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ లభిస్తుంది.కిరణ్ కు ఈ సినిమా కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ ఇస్తుంది.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమాకు సెన్సార్ వారు  క్లీన్ U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా తెరకెక్కించడం జరిగింది. మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.

నటీనటులు

కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దారేకర్‌), శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ రఘువరన్‌, ఆదర్ష్‌ బాలకృష్ణ, జార్జ్‌, సూర్య, మహేష్‌ విట్టా, రవితేజ, రాజ్‌ విక్రమ్‌, లత, ఇషాన్‌, రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

సాంకేతిక నిపుణులు

సమర్పణ: ఎలైట్‌ ఎంటర్టైన్మెంట్స్‌,
నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్‌,
నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్‌, రాజు,
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కె.ఎల్‌. మదన్‌,
కథ – దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.
సంగీతం: జిబ్రాన్‌,
ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి,
డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ,
పబ్లిసిటీ డిజైన్‌: చవన్‌ ప్రసాద్‌,
స్టిల్స్‌: కుందన్‌ – శివ,
సౌండ్‌: సింక్‌ సినిమాస్‌ సచిన్‌ సుధాకరన్‌,
కాస్ట్యూమ్స్‌: రెబెకా – అయేషా మరియమ్‌,
ఫైట్స్‌: అంజి మాస్టర్‌,
సిజి: వీర,
డీఐ: రాజు,
కూర్పు: విప్లవ్‌ న్యసదాం,
కళ: కిరణ్‌ మామిడి,
పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడు`ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా)

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments