5.1 C
New York
Sunday, May 28, 2023
HomeLifestyleLife styleఖండవల్లి లక్ష్మీరంజనం జయంతి.

ఖండవల్లి లక్ష్మీరంజనం జయంతి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

తెలుగునాట తెలుగు భాష నేర్చు కోవడానికి అవకాశాలు మృగ్యమైన కాలంలో మాతృభాషపై మమకారం తో విద్యార్థులకు తెలుగు భాష నేర్చుకునే అవకాశం కల్పించడానికి ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం చేసిన కృషి అనన్య సామాన్యం. సానుకూల దృక్పథంతో, అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనా కాలంలో తెలుగు సాహి త్యానికి, చరిత్రకు ఖండవల్లి లక్ష్మీ రంజనం విశేష సేవలు అందించా రు. ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ఆచార్యుడిగా పనిచేసిన ఆయన విద్యార్థుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు భాషకు ప్రముఖ స్థానం లభించడం వెనుక ఆయన విశేష కృషి దాగి ఉంది.ఆంధ్రప్రదేశ్ లో ప్రథమంగా ప్రాచ్య కళాశాలను, తెలుగు మీడియం సాయం కళాశాలను, ఒక సంగీత పాఠశాలను నెలకొల్పి, వాటికి విశాలమైన భవనాలు కట్టించారు. తన ఇంటిలోనే వేద పాఠశాలను 1980లో స్థాపించి సర్వ వర్ణాల వారికి తానే వేదాన్ని స్వయంగా బోధించారు. ఆంధ్ర రచయితల సంఘానికి 1957లో అధ్యక్షులై అనేక గ్రంథాలను ముద్రించారు. ఇంగ్లీషు, తెలుగు భాషలలో శర వేగంగా రాసేవారు. మద్రాసు మెయి ల్, దక్కన్ క్రానికల్, భారతి, కృష్ణా, స్రవంతి మొదలైన పత్రికలలో అనేకమైన వ్యాసాలు ప్రకటించారు.ఖండవల్లి లక్ష్మీరంజనం ( మార్చి 1, 1908 – జూన్ 18, 1986) సుప్రసిద్ధ సాహిత్యవేత్త, పరిశోధకులు. ఆయన తూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామంలోని మాతా మహులైన కోరాడ నరసింహులు ఇంటిలో మార్చి 1, 1908 న జన్మిం చారు. సూర్యనారాయణ, సీతమ్మ తల్లిదండ్రులు. తండ్రి ఉద్యోగ రీత్యా వరంగల్లుకు రావడంతో ఆయన మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యలు మట్టెవాడలో, హనుమ కొండ లోను పూర్తయ్యాయి. తరు వాత ఉన్నత విద్యకై హైదరాబాదు చేరుకుని 1924లో నిజాం కళాశాల లో బీఏ సంస్కృతం చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1928లో నిజాం కళాశాలలో తెలుగు, సంస్కృతం, ప్రాచీన భారత చరిత్రలలో బి.ఎ. పట్టా పొందారు. తరువాత సిటీ కళాశాలలో అధ్యా పకులుగా చేరి 1936లో తెలుగు, సంస్కృతాలలో ఎం.ఎ. పరీక్షలో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వ ప్రథము లుగా ఉత్తీర్ణులయ్యారు. ఖండవల్లి 1936 నుంచే సాహిత్యసేవ ప్రారం భించారు. ‘తెలుగుదుక్కి’ శీర్షికతో వ్యాసాలు ప్రచురించారు. త్రివేణి లాంటి ఆంగ్ల పత్రికల్లో ఆధునిక కవిత్వం గురించి అనేక వ్యాసాలు రాశారు.1936లో ఎంఏ (తెలుగు సంస్కృ తం)లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు లెక్చరర్ గా చేరారు. రాయ ప్రోలు సుబ్బారావు పదవీ విరమణ చేశాక ఆచార్య (ప్రొఫెసర్) పీఠాన్ని అధిష్టించారు. ఖండవల్లికి విద్యార్థి దశ నుంచే ఆదిరాజు వీరభద్రరావు లాంటి పరిశోధకులతో, గోలకొండ పత్రికా సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి లాంటి ప్రజా సాహిత్య సేవకులతో, లోకనంది నారాయణ లాంటి సాహిత్య పోషకులతో పరిచయం ఏర్పడింది.ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి, తరువాత 1946లో ఆ శాఖకు అధ్యక్షులై, 1964లో పదవీ విరమణ చేశారు. ఆయన కృషి కారణంగా తెలంగాణలో 1956 నుంచి ప్రాచ్య భాషాధ్యయనంలో డిగ్రీ తరగతులు (బీఓఎల్‌) మొదల య్యాయి. 1957 నుంచి ఓరియం టల్‌ కళాశాలలు సాయంకాలం పూట పనిచేసేలా ప్రారంభ మయ్యాయి. ఇంగ్లీషు భాషా పరిచయం లేని పేదసాదా విద్యార్థు లు ఈ కళాశాలల్లో చదివి, ఎంఏ తెలుగు, సంస్కృతం పట్టాలు పొంది కళాశాలల ఉపన్యాసకులు కాగలిగారు. 1966లో తెలుగు మాధ్యమంలో సాయం డిగ్రీ కళాశాలను స్థాపించారు. 1960లో హైదరాబాదులో వేద పాఠశాలను ప్రారంభించి, తాను కూడా తరగ తులు తీసుకునేవారు. ఉస్మానియా లో ఆయన కాలంలో తెలుగు శాఖ బాగా అభివృద్ధి చెంది, తెలుగు ఎం.ఎ. చదివే విద్యార్ధుల సంఖ్య పెరిగి, 1952 నుండి తెలుగులో పి.హెచ్.డి. పట్టాలకు పరిశోధన ప్రారంభమైంది. ఆయన రాసిన పుస్తకాల్లో ఆంధ్రుల చరిత్ర– సంస్కృతి, ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము, తెనుగుదుక్కి, లక్ష్మీరంజనం వ్యాసావళి, ఆంధ్రదేశ చరిత్ర భూగోళ సర్వస్వము మూడు సంపుటాలు, కాసె సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్రము, శ్రీనాథుని హర విలాసము (పరిష్కరణ గ్రంథాలు) ప్రసిద్ధాలు. ఆయన ఆంధ్ర మహా భారతం పరిశోధన ప్రతిని ఎనిమిది సంపుటాలుగా తెలుగు శాఖ పక్షాన ప్రకటించారు.వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక విద్యాసంస్థను ప్రారం భించి బాల బాలికలకు వేరువేరుగా ఉన్నత పాఠశాలలను నెలకొల్పారు.కొమర్రాజు లక్ష్మణరావు… విజ్ఞాన సర్వస్వం ముద్రించడంలో ఖండవ ల్లి విశిష్టమైన కృషిచేశారు. ఆయన ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము’ అనే చక్కని రచన చేశారు. సోదరు డు ఖండవల్లి బాలేందు శేఖరంతో కలసి తెలుగులోను, ఇంగ్లీషులోను రచించిన ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ అమూల్యమైన గ్రంథం.హైదరాబాద్ లోని శ్రీకృష్ణదేవరాయ గాంధ్ర భాషా నిలయం కార్యదర్శిగా రెండేళ్లపాటు పనిచేశారు. పుస్తకాల సేకరణ, చందాల కోసం తెలంగాణ అంతటా పర్యటించారు. వర్థంతు లు, జయంతులు ఎన్నో జరిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ సభ్యులు గా పనిచేసి దాని విస్తరణకు విశేష కృషి చేశారు. ‘నిజాం రాష్ట్ర గ్రంథాలయ సంఘం’ కార్యదర్శిగా కూడా పనిచేశారు.ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా 1964లో విశ్రాంతి తీసుకున్నాక, మరో 22 సంవత్సరాలు సాహిత్య సేవ చేసి, 1986, జూన్ 18న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన స్థాపించిన ఆంధ్ర ప్రాచ్య కళాశాల ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రభుత్వ ప్రాచ్య కళాశాలగా అభివృద్ధి చెందింది. ఖండవల్లి శత జయంతి, కళాశాల స్వర్ణోత్సవాలు 2008లో హైదరాబాదులో ఘనంగా జరిగా యి. ఈ సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచురించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments